ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్లపై నోరు జారిన పూజా హెగ్డే, అంత మాట అనేసిందేంటి?

పూజా హెగ్డే.. అసలే టైమ్ కలిసిరాక..అవకాశాలు లేక.. చేతిలో సినిమాలు జారిపోయి.. ఐరన్ లెగ్ అని పేరు తెచ్చుకుంది. ఈక్రమంలో ఆమె అనవసర విషయాలు కదిలించి.. వివాదాస్పదం కూడా అవుతోంది. రీసెంట్ గా నోరు జారి ఇంబ్బందుల్లోపడింది పూజా హెగ్డే. ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ పై ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆమె ఏమన్నారంటే? 

Pooja Hegde Shocks with Comments on Instagram Followers They re Not Real Fans in telugu jms
pooja hegde

సోషల్ మీడియా వచ్చిన తరువాత స్టార్స్ కు.. ఫ్యాన్స్  కు మధ్య దూరం తగ్గిపోయింది. ఇది వరకు బయట కనిపిస్తేనే సినిమా తారలను చూసేవారు, కుదిరితే మాట, లేకుంటే ఓ ఆటోగ్రాఫ్. కాని సోషల్ మీడియా వచ్చిన తరువాత డైరెక్ట్ గా తాము అనుకున్నది సోషల్ మీడియా ద్వారా చెప్పేస్తున్నారు. లైవ్ చిట్ చాట్ లో తమ ఫేవరెట్ స్టార్ తో మాట్లాడేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కువగా వాడుతున్న సోషల్ మీడియా ప్లాట్ ఫామ్  ఇన్ స్టాగ్రామ్. ఇందులో హీరోలకంటే హీరోయిన్లకే ఎక్కువ ఫాలోవర్లు ఉంటారు. వారి అందమైన ఫోటోస్ కు లక్షల్లో లైక్ లు వేలల్లో కామెంట్లు కూడా వస్తుంటారు. 

Also Read: ముగ్గరు హీరోయిన్లతో అల్లు అర్జున్ యాక్షన్ విత్ రొమాన్స్, అట్లీ ప్లాన్ మామూలుగా లేదుగా?
 

Pooja Hegde Shocks with Comments on Instagram Followers They re Not Real Fans in telugu jms
Suriya Pooja Hegde starrer film Retro update

ఇన్ స్టాలో హీరోయిన్ల క్రేజ్ ఎంత ఉందంటే.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్  శ్రద్దా కపూర్ వంటి హీరోయిన్స్ కి అయితే భారత ప్రధాని నరేంద్ర మోడీ కంటే ఎక్కువ ఫాలోవర్లు ఉన్నారు. ప్రస్తుతం ఫామ్ కోల్పోయిన పూజా హెగ్డే లాంటి హీరోయిన్ల కు కూడా ఇన్ స్టాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక ఈమధ్య స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే  ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం  సోషల్ మీడియా ను ఊపేస్తున్నాయి. 

Also Read: 85000 ఖరీదైన షర్ట్ వేసుకున్న పాన్ ఇండియా తెలుగు హీరో, ఎవరో గుర్తు పట్టారా?


Pooja Hegde

పూజా హెగ్డేకు ఇన్ స్టా లో 38 మిల్లియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈమె అప్లోడ్ చేసే ప్రతీ ఫొటోకు మిలియన్ కి పైగా లైక్స్ వస్తుంటాయి. ఆ రేంజ్ ని ఎంజాయ్ చేస్తున్న పూజా హెగ్డే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఇన్ స్టాగ్రామ్ ఫాలవర్ల గురించి అసలు నిజం చెప్పింది. ఆమె మాట్లాడుతూ ‘నాకు ఇన్ స్టాగ్రామ్ లో 38 మిల్లియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. నాకు ఉన్న ఫాలోవర్లు పెద్ద పెద్ద స్టార్ హీరోలకు కూడా లేదు. కాని వాళ్లంతా నా నిజమైన అభిమానులు కాదు. ఎందుకంటే నాకు ఉన్న అంత మంది ఫాలోవర్లు  నా సినిమాని థియేటర్స్ లో చూడరు అని అన్నారు. 

Also Read: మహేష్ బాబు మిస్ అయ్యాడు, రామ్ చరణ్ హిట్ కొట్టాడు, ఏ సినిమానో తెలుసా?

Pooja Hegde

అంతే కాదు  నాకే కాదు చాలా మంది హీరోయిన్స్ కి బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ కంటే ఎక్కువ ఫాలోవర్లు ఉన్నారు. అయితే వాళ్లంత నిజమైన అభిమానులు అని నేను అనుకోవడంలేదు. మేం సోషల్ మీడియాలో పెట్టే కంటెంట్ ను బట్టి వాళ్లు వస్తుంటారు. కంటెంట్ నచ్చితే లక్షల్లో లైక్ లు చేస్తారు. కాని మా సినిమాలు మాత్రం చూడరు. వాళ్ళు సోషల్ మీడియా వరకే అభిమానులు. క్రికెట్ అభిమానులు, లేదా హీరోల ఫ్యాన్స్.. తో మమ్మల్ని పోల్చుతారు. ఏవేవో ఊహించుకుంటారు. కాని అసలు నిజం మాత్రం వేరు అని అన్నారు పూజా హెగ్డే. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. 

టాలీవుడ్ లో పూజాకు అవకాశాలు లేవు. తమిళ్ లో మాత్రం వరుసగా సినిమాలు చేస్తోంది పూజా.  తమిళంతో సూర్య జంటగా రెట్రో సినిమాలో నటించింది పూజా హెగ్డే. ఈ మూవీ మే 1న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకు సబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా పూజా హెగ్డే ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేసింది.  

Latest Videos

vuukle one pixel image
click me!