స్టార్ హీరోయిన్ కాకపోయినా తన పాత్రలతో టాలీవుడ్ ఆడియన్స్ లో గుర్తింపు మాత్రం సాధించింది. ఇక ఎప్పుడు ఎలా ప్రేమలో పడిందో తెలియదు కానీ, సమంతతో విడాకుల తరువాత ఆమె నాగచైతన్య ప్రేమలో పడటం, వీరు చెట్టాపట్టాలేసుకుని ఫారెన్ ట్రిప్పులకు తిరగడం , ఆతరువాత ఎంగేజ్మెంట్, పెళ్లీ అన్నీ చకచకా జరిగిపోయాయి. ప్రస్తుతం వీరిద్దరు హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. శోభిత కూడా పెళ్లి తరువాత ఫ్యామిలీ లైఫ్ కే కాస్త ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. సినిమాలు కూడా పెద్దగా చేయడం లేదు. ఇక ముందు ముందు ఇండస్ట్రీకి ఆమె గుడ్ బై చెప్పినా ఆశ్చర్చపోవలసింది లేదు.