Sobhan Babu : కష్టాల్లో ఉన్న శోభన్ బాబుని ఆదుకోవడానికి కృష్ణ ముందుకు వచ్చారు. కానీ కృష్ణకే శోభన్ బాబు నమ్మక ద్రోహం చేశారు. అసలేం జరిగింది అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.
సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు కలిసి ఎన్నో చిత్రాల్లో నటించారు. మంచి స్నేహితులుగా మెలిగారు. కానీ ఒక సందర్భంలో కృష్ణ, శోభన్ బాబు మధ్య విభేదాలు తలెత్తాయి. కృష్ణ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లోనే స్టార్ హీరోగా ఎదిగారు. కానీ శోభన్ బాబుకి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి చాలా సమయం పట్టింది. హీరోగా అవకాశాలు వచ్చిన తర్వాత కూడా ఒక దశలో శోభన్ బాబు వరుస ఫ్లాపులతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
25
కృష్ణని సాయం కోరిన శోభన్ బాబు
ఆ టైంలో శోభన్ బాబు.. సూపర్ స్టార్ కృష్ణ నుంచి సాయం ఆశించారట. ఈ విషయాన్ని కృష్ణ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. శోభన్ బాబు వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు ఆయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఎవరూ ముందుకు రాలేదు. ఆ టైంలో శోభన్ బాబు నన్ను సాయం కోరారు. ఓ వ్యక్తి ద్వారా నాకు కబురు పంపారు. నేను ఫ్లాపుల్లో ఉన్నాను. నిర్మాతలు రావడం లేదు. కృష్ణతో నాతో కలసి నటించమని చెప్పండి. మేమిద్దరం కలిసి నటిస్తే బావుంటుంది. నాకు కూడా సాయంగా ఉంటుంది. మంచి పేరు వస్తుంది. కృష్ణనే ఆ సినిమాని నిర్మించమని చెప్పండి అని శోభన్ బాబు నా దగ్గరకి ఓ వ్యక్తిని పంపారు.
35
హిట్ పడగానే ప్లేట్ తిప్పేసిన శోభన్ బాబు
నేను వెంటనే ఆ ప్రపోజల్ కి ఒకే చెప్పను. శోభన్ బాబు, నా కాంబినేషన్ లో మూవీ కంఫర్మ్ అని చెప్పాను. శోభన్ బాబుకి అడ్వాన్స్ గా 25 వేలు డబ్బు ఇచ్చి పంపాను. ఆ టైంలో శోభన్ బాబు నటిస్తున్న మల్లెపూవు మూవీ విడుదలై హిట్ అయింది. కొన్ని రోజుల తర్వాత స్టోరీ రెడీ చేసి శోభన్ బాబు దగ్గరకి పంపాను. మల్లెపూవు హిట్ కావడంతో ఇక నా సాయం అవసరం లేదని శోభన్ బాబు భావించారు. కథ నాకు నచ్చలేదు.. కృష్ణతో నేను సినిమా చేయను అని నమ్మక ద్రోహం చేశాడు.
అడ్వాన్స్ డబ్బు కూడా వెనక్కి పంపేశాడు. నాకు కోపం వచ్చింది. శోభన్ బాబుని మించిన స్టార్ తో వారంలోగా మనం సినిమా మొదలు పెట్టాలి అని విజయ నిర్మలకు చెప్పాను. వెళ్లి ఏఎన్నార్ ని తనతో కలసి సినిమా చేయమని రిక్వస్ట్ చేశాం. అప్పటికి దేవదాసు విషయంలో మా ఇద్దరి మధ్య చిన్న విభేదాలు ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టేసి జాలీగా, మంచి స్నేహితులుగా ఈ సినిమాలో కలసి వర్క్ చేద్దాం అని ఏఎన్నార్ కి చెప్పాను. ఆయన వెంటనే ఒకే అన్నారు.
55
శోభన్ బాబు మైండ్ బ్లాక్ చేసిన కృష్ణ
అమితాబ్ బచ్చన్ డాన్ మూవీ స్ఫూర్తితో కథ రెడీ చేశాం. ఆ చిత్రమే హేమా హేమీలు. విజయ నిర్మల దర్శకత్వం వహించింది. సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా గురించి న్యూస్ పేపర్ లో శోభన్ బాబు తెలుసుకుని షాక్ అయ్యారు. ఇంత త్వరగా వీళ్ళకి ఎలా సాధ్యం అయింది అని శోభన్ బాబు కంగుతిన్నట్లు కృష్ణ తెలిపారు.