Chiranjeevi and Sobhan Babu: హైదరాబాద్ సంధ్య థియేటర్ లో చిరంజీవి గురించి శోభన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శోభన్ బాబు చెప్పిన మాటలే ఆ తర్వాత నిజం అయ్యాయి.
హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ కి ఘన చరిత్ర ఉంది. కానీ ఇటీవల పుష్ప 2 సినిమా కారణంగా ఈ థియేటర్ వివాదంలో చిక్కుకోవడం చూశాం. అల్లు అర్జున్ థియేటర్ విజిట్ చేయడంతో తొక్కిసలాట జరిగి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. ఈ వివాదాన్ని పక్కన పెడితే.. 1980లో సంధ్య థియేటర్ ని ప్రారంభించారు. ఎంతో గుర్తింపు ఉన్న ఈ థియేటర్ లో మొట్ట మొదట 100 రోజులు ఆడిన సినిమా ఏంటో ఇప్పుడు చూద్దాం.
25
విజయ్ తండ్రి దర్శకత్వంలో చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో ఉన్నప్పుడు హీరోగా ప్రయత్నిస్తూనే చిన్న చిన్న పాత్రల్లో నటించేవారు. దళపతి విజయ్ తండ్రి, సీనియర్ డైరెక్టర్ ఎస్ ఏ చంద్రశేఖర్ దర్శకత్వంలో 1981లో చిరంజీవి చట్టానికి కళ్ళు లేవు అనే చిత్రంలో నటించారు. తమిళంలో సూపర్ హిట్ అయిన చట్టం ఓరు ఇరట్టై అనే చిత్రానికి ఇది రీమేక్. ఆ మూవీకి కూడా ఆయనే దర్శకుడు. ఈ కథని 20 మంది నిర్మాతలు రిజెక్ట్ చేశారట. అయినప్పటికీ చంద్రశేఖర్ తన ప్రయత్నం ఆపకుండా సినిమా పూర్తి చేసి విజయం అందుకున్నారు.
35
27 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న మూవీ
తెలుగులో చిరంజీవితో చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ప్రారంభ వేడుకకి సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు అతిథులుగా హాజరయ్యారు. కేవలం 27 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి 1981 అక్టోబర్ 30 న ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. తొలి రోజు నుంచి ఈ చిత్రాన్ని సూపర్ హిట్ టాక్ మొదలైంది. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునే కొడుకుగా చిరంజీవి పెర్ఫార్మెన్స్ అదరగొట్టారు. నటి లక్ష్మి పోలీస్ అధికారిగా, మాధవి హీరోయిన్ గా నటించారు. చిరంజీవిని స్టార్ హీరోగా మార్చిన చిత్రం ఖైదీ కాగా, చట్టానికి కళ్ళు లేవు చిత్రం చిరంజీవికి హీరోగా మంచి గుర్తింపు తీసుకువచ్చింది.
హైదరాబాద్ సంధ్య థియేటర్ లో 100 రోజులు ప్రదర్శించబడిన తొలి చిత్రం ఇదే. దీనితో విజయేత్సవ కార్యక్రమం ఆ థియేటర్ లోనే నిర్వహించారు. 100 రోజుల వేడుకకి శోభన్ బాబు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో శోభన్ బాబు మాట్లాడుతూ.. గతంలో ఎన్టీఆర్, ఏఎన్నార్.. ఇప్పుడు నేను, కృష్ణ.. ఇక భవిష్యత్తు మొత్తం చిరంజీవిదే అని శోభన్ బాబు జోస్యం చెప్పారు.
55
అగ్ర హీరోగా ఎదిగిన చిరంజీవి
శోభన్ బాబు చెప్పినట్లుగానే అతి తక్కువ సమయంలో చిరంజీవి టాలీవుడ్ లో నెంబర్ 1 స్థానానికి చేరుకున్నారు. శోభన్ బాబు చెప్పిన మాటలు నిజమయ్యాయి. చట్టానికి కళ్ళు లేవు చిత్రం తర్వాత చాలా మంది దర్శకులు, నిర్మాతలు భవిష్యత్తులో చిరంజీవి స్టార్ హీరో అవుతారు అని ఊహించారట.