శోభన్‌బాబు ఆరాధించే ఏకైక హీరో ఎవరో తెలుసా? కృష్ణంరాజు బయటపెట్టిన నిజాలు

Published : Feb 28, 2025, 05:23 PM ISTUpdated : Feb 28, 2025, 08:05 PM IST

Sobhan Babu: సోగ్గాడు శోభన్‌ బాబు అంటేనే కోట్లాది మంచి ప్రజలు ఇష్టపడతారు, అభిమానిస్తారు. వారిలో మహిళలే ఎక్కువగా ఉంటారు. మరి సోగ్గాడు అభిమానించే హీరో ఎవరు?  

PREV
15
శోభన్‌బాబు ఆరాధించే ఏకైక హీరో ఎవరో తెలుసా? కృష్ణంరాజు బయటపెట్టిన  నిజాలు
Sobhan Babu:

Sobhan Babu: శోభన్‌బాబు తెలుగు చిత్ర పరిశ్రమకి దొరికిన అరుదైన ఆణిముత్యాలలో ఒకరు. ఆయన అద్భుతమైన సినిమాలతో, అద్భుతమైన నటనతో మెప్పించడమే కాదు, వ్యక్తిత్వం పరంగానూ ఆకట్టుకున్నారు. క్రమ శిక్షణ విషయంలోనూ స్టార్‌గా రాణించారు. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.

అమ్మాయిలు మెచ్చిన నటుడిగా నిలిచారు. ఆర్థిక క్రమశిక్షణ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన క్రమశిక్షణ ఆయన్నుంచే నేర్చుకోవాలని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

25
sr ntr

మరి శోభన్‌బాబు ఆరాధించే, ఇష్టపడే, అభిమానించే హీరో ఎన్టీరామారావు. ఆయన్ని దేవుడిలా భావిస్తాడట శోభన్‌బాబు. అంతేకాదు తన ఇంట్లో హాల్‌లో ఆయనది పెద్ద ఫోటో ఫ్రేమ్‌ పెట్టించారట. శోభన్‌బాబు కొన్నాళ్లపాటు కొడంబాకంలోని ఇంట్లో నివాసం ఉన్నారు.

అది ఆయన ప్రారంభ రోజులు అని చెప్పొచ్చు. అంటే అప్పటికే స్టార్లుగా రాణిస్తున్నారు. కృష్ణంరాజు కూడా మంచి స్నేహితులు. ఇద్దరు ఏ రా ఏ రా అని పిలుచుకునే స్నేహం ఉంది. 
 

35
Sobhan Babu, krishnam raju

అయితే ఓ సారి పుట్టిన రోజుని శోభన్‌ బాబు ఇంటికి వెళ్లాడట కృష్ణంరాజు. గుమ్మం నుంచి ఇంట్లోకి అడుగుపెడుతుండగానే ఓ పెద్ద కటౌట్‌ కనిపించింది. అది ఎన్టీఆర్‌ ఫోటో ఫ్రేమ్‌. హాల్‌లో చాలా పెద్దగా ఫ్రేమ్‌ కట్టించి పెట్టిన ఫోటో.

అది చూసి కృష్ణంరాజు షాక్‌ అయ్యారట. రామారావు అంటే ఆయనకు అంతటి ప్రేమ, అభిమానం అని, ఇంట్లో ఓ దేవుడి ఫోటోకి దెండం పెట్టుకున్నట్టుగానే రామారావు ఫోటోకి దెండం పట్టుకునేవాడట శోభన్‌బాబు.  
 

45
sobhan babu, ntr

శోభన్‌బాబు ఎన్టీఆర్‌ని ప్రారంభంలో బాగా ఆరాధించేవారట. నటన పరంగా ఆయన్నే ఆదర్శంగా తీసుకున్నారట. ఆయనలా తాను ఫాలో అయ్యేవాడట. ఆయనలా తాను కూడా రాణించాలనుకునేవారట.

అనుకోవడమే కాదు, అదే స్థాయిలో కఠినమైన కృషితో ఆ స్థాయికి చేరుకున్నారు. తిరుగులేని స్టార్‌గా ఎదిగారు. అప్పట్లో ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ల కంటే ఎక్కువగా పారితోషికం తీసుకునే స్థాయికి శోభన్‌బాబు ఎదిగారట.
 

55
Sobhan Babu, Krishnam Raju

అప్పట్టో ఆయనకు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఫ్యామిలీ చిత్రాలు చేసి ఆడవారి ఫాలోయింగ్‌ని ఏర్పర్చుకున్నారు. ఆడియెన్స్ దృష్టిలో తాను ఎప్పటికీ సోగ్గాడిగానే ఉండాలని చెప్పి ఆయన మంచి ఏజ్‌లో రిటైర్‌మెంట్‌ తీసుకుని షాకిచ్చాడు. ఆ తర్వాత ఎన్ని ఆఫర్లు వచ్చినా రిజెక్ట్ చేశారు. చివరికి ఆయన 2008లో గుండెపోటుతో కన్నుమూశారు. 

read more:శోభన్ బాబు అత్తా అని ముద్దుగా పిలుచుకునే హీరోయిన్ ఎవరో తెలుసా?

also read: ముక్కుతో టమాటాలు కోసిన ప్రభాస్‌, మోహన్‌బాబు కంటే ఆయనదే షార్ప్.. వీడియో వైరల్‌

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories