సూపర్ స్టార్ కృష్ణతో మూవీ, 2 పొట్టి నిక్కర్లు కొని 60 వేలు బిల్లు ఇచ్చిన హీరోయిన్, నిర్మాత పరిస్థితి ఏంటంటే

Published : Feb 28, 2025, 04:20 PM IST

హీరోయిన్ల వల్ల నిర్మాతలు ఇబ్బంది పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్ళు అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వలేక, అడిగిన సౌకర్యాలు కల్పించలేక కొంతమంది నిర్మాతలు ఇబ్బంది పడుతుంటారు.

PREV
14
సూపర్ స్టార్ కృష్ణతో మూవీ, 2 పొట్టి నిక్కర్లు కొని 60 వేలు బిల్లు ఇచ్చిన హీరోయిన్, నిర్మాత పరిస్థితి ఏంటంటే
Actress Nagma

హీరోయిన్ల వల్ల నిర్మాతలు ఇబ్బంది పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్ళు అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వలేక, అడిగిన సౌకర్యాలు కల్పించలేక కొంతమంది నిర్మాతలు ఇబ్బంది పడుతుంటారు. సీనియర్ డైరెక్టర్ సాగర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ నటించిన చిత్రం భారత సింహం. ఈ చిత్రంలో నటించిన హీరోయిన్ వల్ల నిర్మాతకి చుక్కలు కనిపించాయి. 

24

ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణకి హీరోయిన్ గా నగ్మా నటించింది. అప్పటికే నగ్మకి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు వచ్చింది. ఒక సన్నివేశంలో హీరోయిన్ కాస్ట్యూమ్స్ రెడీ చేయాలి. డైరెక్టర్ సాగర్ నిర్మాత ఎల్ వి రామరాజుకి ఇలా చెప్పారట. మనం కాస్ట్యూమ్స్ కుట్టించి, రెడీ చేయడం ఎందుకు..హీరోయిన్ ని కొనుక్కోమని చెప్పి బిల్లు మనం ఇస్తే సరిపోతుంది కదా అని అన్నారట. అలాగే అని నిర్మాత చెప్పారు. 

34

మరుసటి రోజు నగ్మ డైరెక్టర్ కి, నిర్మాతకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. రెండు పొట్టి నిక్కర్లు కొనుక్కుని 60 వేలు బిల్లు ఇచ్చిందట. అప్పట్లో 60 వేలు బిల్లు అంటే మామూలు విషయం కాదు. పైగా రెండు పొట్టి నిక్కర్ల కోసం.. ఆమె చేసిన పనికి దర్శకుడికి, నిర్మాతకి నోట మాట రాలేదు. 

44

కాసేపటికి తేరుకుని నేను ఆమె బిల్లు ఇవ్వను అని నిర్మాత గొడవ పెట్టుకున్నారు. దీనితో నగ్మా ఏడవడం ప్రారంభించింది. కాస్ట్యూమ్స్ కొనుక్కోమంటే ఇలా చేసావ్ ఏంటి అని దర్శకుడు కూడా తిట్టారు. దీనితో నగ్మా నాకు ఈ సినిమా అవసరం లేదు అని చెప్పిందట. ఆమె వెళ్ళిపోతే సినిమా పోతుంది అనే ఉద్దేశంతో దర్శకుడే ఆమెకి డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ నగ్మా మాత్రం నాకు నిర్మాతే ఇవ్వాలి అని మొండికేసింది. ఎంత ప్రయత్నించినా ఆమె కాంప్రమైజ్ కాలేదు. అలిగి ముంబై వెళ్లిపోయిందట. మిగిలిన షూటింగ్ ని ఆమె లేకుండానే పూర్తి చేశాం అని దర్శకుడు తెలిపారు. 

Read more Photos on
click me!

Recommended Stories