`గార్డ్` తెలుగు మూవీ రివ్యూ, రేటింగ్‌

Published : Feb 28, 2025, 04:22 PM IST

Guard movie review: హర్రర్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో వచ్చే చిత్రాలకు ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు అలాంటి కాన్సెప్ట్ తోనే `ది గార్డ్` అనే మూవీ వచ్చింది. ఈ శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

PREV
15
`గార్డ్` తెలుగు మూవీ రివ్యూ, రేటింగ్‌
Guard movie review

Guard Movie Review: హర్రర్‌ థ్రిల్లర్‌ సినిమాలు చూసేందుకు సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంటుంది. సరికొత్త థ్రిల్లింగ్‌ ఎక్స్ పీరియెన్స్ ని ఇచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తూనే ఉంటారు. డిఫరెంట్‌గా హర్రర్‌ థ్రిల్లర్స్ తో ఆడియెన్స్ ని అలరిస్తుంటారు. అలా ఇప్పుడు `ది గార్డ్`తో హర్రర్‌, థ్రిల్లింగ్‌ ఎక్స్ పీరియెన్స్ ని అందించేందుకు వచ్చారు దర్శకుడు జగ పెద్ది.

విరాజ్‌ రెడ్డి చీలం, కమల్‌ కృష్ణ, శిల్పా బాలకృష్ణన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకి దర్శకుడు. జగపెద్ది, అనసూయ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. ఈ శుక్రవారం(ఫిబ్రవరి 28)న విడుదలైంది. మరి మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

25
Guard movie review

కథః 
సుశాంత్‌(విరాజ్‌ రెడ్డి చేలం) ఆస్ట్రేలియాలో నైట్‌ సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తుంటాడు. అతను ఒంటరి, అమ్మానాన్న లేరు. అమ్మ రీసెంట్‌గానే యాక్సిడెంట్‌లో చనిపోతుంది. ఎవరూ ఆమెని కాపాడకపోవడంతో ప్రాణాలు కోల్పోతుంది. ఓ రోజు రాత్రి ఓ తాను పనిచేసే కెమికల్‌ కంపెనీ బిల్డింగ్‌లో ముగ్గురు వ్యక్తులు ఓ అమ్మాయిని హత్య చేసే ప్రయత్నం చేస్తుంటారు.

వారి నుంచి ఆ అమ్మాయిని సేవ్‌ చేస్తాడు సుశాంత్‌. పోలీసులకు సమాచారం అందించడంతో వాళ్లు సుశాంత్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్‌ అడుగుతారు. అందుకోసం మన తెలుగు అమ్మాయి అయిన డాక్టర్‌ సామ్‌(మిమి లియోనార్డ్)ని కలుస్తాడు.  ఆమెని చూసి ఫిదా అయిన సుశాంత్‌ ఫస్ట్ మీట్‌లోనే కాఫీకి ఇన్‌వైట్‌ చేస్తాడు. మొదట నో చెప్పిన ఆమె తర్వాత సుశాంత్‌ మంచి తనం చూసి ఓకే చెబుతుంది.

ఇద్దరు తరచూ కలుస్తారు. ప్రేమలో పడతారు. పెద్దలను ఒప్పించి సెపరేట్‌గా ఇళ్లు తీసుకుని ఆ ఇంటికి షిఫ్ట్ అవుతారు. అయితే తాను పని చేసే బిల్డింగ్‌ లో రాత్రి సమయంలో భయానక శబ్దాలు వినిపిస్తుంటాయి. దెయ్యాలు ఉన్నాయని ఫ్రెండ్‌ కృష్ణ(కమల్‌ కృష్ణ) చెబుతాడు. ఆ తర్వాత అనుకోకుండా కలలోకి దెయ్యాలు వస్తుంటాయి. ఈ విషయంలో సామ్‌కి చెప్పడంతో ఓ రోజు రాత్రి వాళ్లు ఆ బిల్డింగ్‌కి వెళ్తారు. అక్కడ లాక్‌ చేసిన కొత్త రూమ్‌లోకి వెళ్తారు.

సడెన్‌గా భయానక శబ్ధాలు వస్తాయి? సామ్‌ కింద పడిపోతుంది. ఆసుపత్రిలో చేర్పించగా, అందులో ఆమెలో మరో ఆత్మ(పర్సనాలిటీ) ఉందని, సామ్‌ని కంట్రోల్‌ లోకి తీసుకుందని చెబుతారు. మరి సామ్‌లోకి చేరిన ఆత్మ ఎవరిది? ఆ ఆత్మ కథేంటి? దాన్నుంచి సామ్‌ ఎలా బయటపడింది? సుశాంత్‌ తన సామ్‌ని కాపాడుకోవడం కోసం ఏం చేశాడు? అనేది మిగిలిన కథ. 

 

35
Guard movie review

విశ్లేషణః 

థ్రిల్లర్‌ సినిమాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. మంచి కంటెంట్‌తో వస్తే, ఆడియెన్స్ ని ఎంగేజ్‌ చేస్తే ఆకట్టుకుంటాయి. ఈ క్రమంలో వచ్చిన మరో థ్రిల్లర్‌ `ది గార్డ్`. థ్రిల్లర్‌, హర్రర్‌ మేళవింపుతో ఈ మూవీని రూపొందించారు. ఇలాంటి మూవీస్‌ కథ పరంగా కొత్తగా ఏముండదు, ఎంతగా ఎంగేజ్‌ చేశామ్‌, ఎంతగా థ్రిల్‌ చేశామ్‌, ఎంతగా ఆడియెన్స్ ని ఆకట్టుకున్నామనేది ఇంపార్టెంట్‌.

అక్కడ సక్సెస్‌ అయితే సినిమా సక్సెస్‌ అయినట్టే. `ది గార్డ్` మూవీ ఈ విషయంలో చాలా వరకు మెప్పించిందని చెప్పొచ్చు. కథ పరంగా కొత్తగా ఏం అనిపించదు, కానీ ప్రారంభం నుంచి ఎండింగ్‌ వరకు థ్రిల్‌ ఎక్స్ పీరియెన్స్ ని ఇస్తుంది. రాత్రి సమయంలో సుశాంత్‌ సెక్యూరిటీ గార్డ్ గా పర్యవేక్షిస్తుంటాడు.

ఈ క్రమంలో ఒకన్ని భయానక శబ్దాలు సరికొత్త థ్రిల్‌ ఫీలింగ్‌ ఇస్తుంటాయి. ఎంగేజ్‌ చేస్తుంటాయి. ఏం జరుగుతుంది? ఏం జరుగబోతుందనే క్యూరియాసిటీని క్రియేట్‌ చేస్తుంది. అదే ఇక్కడ ఆడియెన్స్ కి హుక్‌ పాయింట్‌గా చెప్పొచ్చు. ఫస్టాఫ్‌ మొత్తం ఇదే తరహాలో ఎంగేజ్‌ చేస్తూ సాగుతుంది.

అదే సమయంలో అనిత అనే అమ్మాయిని మరో బాస్‌ ఒకరు ట్రాప్‌ చేసే ప్రయత్నం చేయడం, మరో వ్యక్తి అనుమానాస్పదంగా ఆమెని గమనిస్తుండటం, మరో వ్యక్తి ప్రేమిస్తుండటం, ఇవన్నీ చాలా అనుమానాలు క్రియేట్‌ చేస్తూ ఆడియెన్స్ ని ఎంగేజ్‌ చేసే ఎలిమెంట్లు. 

ఇక సెకండాఫ్‌లో దెయ్యం కథ స్టార్ట్ అవుతుంది. సామ్‌ని పట్టింది ఎవరు? ఆమె కథేంటి? ఆమె ఎందుకు అలా మారిందనేది రివీల్‌ అవుతుంది. ఆ స్టోరీ సినిమాపై క్లారిటీనిస్తుంది. అదే సమయంలో కొంత రొటీన్‌ అనే ఫీలింగ్‌ కలుగుతుంది. ప్రతి దెయ్యం కథలోనూ ఇలాంటి అంశమే ఉంటుంది. ఇది కూడా అంతే కదా అనిపిస్తుంది.

కానీ ఆ తర్వాత కథనాన్ని నడిపించిన తీరు ఇంపార్టెంట్‌. ఇందులో మరి రొటీన్‌గా కాకుండా చాలా వరకు ఎంగేజ్‌ చేసేలానే కథ రన్‌ అవుతుంది. ఈ క్రమంలో హీరో ఫ్రెండ్‌ కృష్ణ చేసే ఫన్‌ వర్కౌట్‌ అవుతుంది. దెయ్యాన్నిచూసి వీరిద్దరు భయపడే సీన్లు నవ్వులు పూయిస్తాయి. ఆడియెన్స్ కి ఇవి రిలీఫ్‌నిచ్చే అంశాలు. అయిత కథ ఏమాత్రం కొత్తగా లేకపోవడం మైనస్‌గా చెప్పొచ్చు.

సెకండాఫ్‌లో కొంత ల్యాగ్‌ కూడా ఉంటుంది. ఆ తర్వాత సీన్లు రొటీన్‌ ఫీలింగ్‌ని తెప్పిస్తాయి. దెయ్యం ఎపిసోడ్లు కూడా కొంత వరకు మనం ఇప్పటికే చూసిన భావన కలుగుతుంది. ఇక క్లైమాక్స్ వరకు బాగానే థ్రిలింగ్‌తో లాగారు. కానీ క్లైమాక్స్ లో ఇవ్వాల్సిన కిక్‌, హై మూమెంట్‌ ఇంకా బాగా ఇవ్వాల్సింది. ఓ పీక్లోకి తీసుకెళ్లి ముగింపు పలికితే ఇంకా బాగుండేది.

సినిమా మొత్తం ఆస్ట్రేలియాలో సాగడంతో మనదైన ఫీలింగ్‌ రాదు. తెలుగుదనం మిస్‌ అయ్యింది. ఓవరాల్‌గా హర్రర్‌ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి అలరించే మూవీ అవుతుందని చెప్పొచ్చు. 
 

45
Guard movie review

నటీనటులుః 
సుశాంత్‌ పాత్రలో విరాజ్‌ రెడ్డి చేలం బాగా చేశాడు. హీరోయిజానికి పోకుండా చాలా సెటిల్డ్ గా చేశాడు, సహజంగా నటించే ప్రయత్నం చేశాడు. అలాగే ఎమోషనల్‌ సీన్లో, లవ్‌ సీన్లలో బాగా చేశాడు. ఫైట్స్ కూడా నేచురల్‌గా చూపించే ప్రయత్నం చేయడం ఇందులో స్పెషల్‌గా చెప్పొచ్చు. ఆయన ఫ్రెండ్‌ కృష్ణ పాత్రలో కమల్‌ కృష్ణ బాగా నటించాడు, నవ్వించాడు.

ఇక సామ్‌ పాత్రలో మిమి లియోనార్డ్ ఉన్నంతలో ఫర్వాలేదనిపించింది. అలాగే అనిత పాత్రలో శిల్పా బాలకృష్ణన్‌ సైతం అదరగొట్టింది. ఈ సినిమాలే ఇవే మెయిన్‌ రోల్స్. మిగిలిన పాత్రలు ఉన్నంతలో ఓకే అనిపిస్తాయి. 
 

55
Guard movie review

టెక్నీకల్‌గాః
టెక్నీకల్‌గా ఉన్నంతలో నీట్‌గా ఉంది ఈ మూవీ. కెమెరా వర్క్ బాగుంది. రాత్రి సీన్లు, విజువల్‌గా కలర్‌ఫుల్‌గా, నీట్‌గా ఉన్నాయి. సినిమా కలర్‌ టోన్‌ హాలీవుడ్‌ చిత్రాలను తలపించేలా ఉంది. ఎడిటింగ్‌ ఇంకా షార్ప్ చేయాల్సింది. మ్యూజిక్ పరంగా ఓకే, కానీ బీజీఎం విషయంలో ఇంకా కేర్‌ తీసుకోవాల్సింది. ఇలాంటి సినిమాలకు ఆర్‌ఆర్‌ చాలా కీలకం.

దర్శకుడు జగ పెద్ది రెగ్యూలర్‌ కథని ఎంచుకున్నాడు, కానీ టేకింగ్‌ పరంగా తన మార్క్ చూపించాడు. ఆ మ్యాజిక్‌ చేశాడు. విదేశాల్లోనే సినిమా సాగడంతో ఓవర్సీస్‌ ఆడియెన్స్ కోసమే అనేట్టుగా ఉంది. మనవైన ఎమోషన్స్ కి ప్రయారిటీ ఇస్తే బాగుండేది. కానీ సినిమాని తెరకెక్కించడంలో, దాన్ని ఎంగేజింగ్‌గా నడిపించడంలో దర్శకుడు చాలా వరకు మెప్పించాడని చెప్పొచ్చు. నిర్మాణ విలువలు కూడా ఫర్వాలేదు. 

ఫైనల్‌గాః హర్రర్‌ థ్రిల్లర్స్ ని ఇష్టపడేవారికోసం `ది గార్డ్`. 
రేటింగ్‌ః 2.5
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories