సిగరెట్ పొగను లోపలికి తీసుకున్న క్షణంలో నికోటిన్ ఊపిరితిత్తుల నుంచి నేరుగా రక్తంలోకి చేరుతుంది. అక్కడి నుంచి కేవలం 7 నుంచి 10 సెకన్లలోనే మెదడుకు చేరిపోతుంది. ఇంత వేగంగా పనిచేసే పదార్థాలు చాలా తక్కువ. అందుకే ఒక్క పఫ్‌తో వెంటనే ఊరట వచ్చినట్లు అనిపిస్తుంది.
25
నికోటిన్ మెదడులో ఎలా పనిచేస్తుంది?
మెదడుకు చేరిన నికోటిన్ అక్కడ ఉన్న నికోటీనిక్ అసిటైల్కోలిన్ రిసెప్టర్లను యాక్టివేట్ చేస్తుంది. ఇవి స్విచ్‌లా పనిచేస్తాయి. ఈ స్విచ్‌లు ఆన్ అవగానే మెదడులో కొన్ని కెమికల్ సంకేతాలు విడుదల అవుతాయి. మెదడు వీటిని అవసరమైనవిగా భావిస్తుంది.
35
డోపమిన్ విడుదలే అసలు కారణం
నికోటిన్ ప్రభావంతో మెదడులో డోపమిన్ అనే కెమికల్ విడుదల అవుతుంది. ఇదే “ఫీల్ గుడ్” కెమికల్. దీనివల్ల ఆందోళన తగ్గుతుంది, చిరాకు తగ్గినట్లు అనిపిస్తుంది, మనసు కాస్త రిలాక్స్ అవుతుంది, అందుకే సిగరెట్ తాగిన వెంటనే కోరిక తగ్గిపోయిన భావన కలుగుతుంది.
ప్రతి సారి సిగరెట్ తీసుకున్నప్పుడు డోపమిన్ విడుదల కావడంతో మెదడు ఒక విషయం నేర్చుకుంటుంది. “సిగరెట్ అంటే రిలీఫ్” అని ఫిక్స్ అయిపోతుంది. అందుకే డోపమిన్ రిలీజ్ అవుతున్న క్షణంలోనే కోరిక తీరిపోయినట్లు అనిపిస్తుంది. ఇది పూర్తిగా మెదడు చేసే ట్రిక్.
55
మళ్లీ మళ్లీ తాగాలని ఎందుకు అనిపిస్తుంది.?
నికోటిన్ ప్రభావం చాలా తక్కువ సేపే ఉంటుంది. కొంత సమయం తర్వాత రక్తంలో నికోటిన్ స్థాయి తగ్గిపోతుంది. దాంతో డోపమిన్ కూడా తగ్గుతుంది. అప్పుడు మెదడు మళ్లీ అదే అనుభూతిని కోరుకుంటుంది. అదే మళ్లీ సిగరెట్ తాగాలనే కోరికను ప్రేరేపిస్తుంది. మొత్తం మీద సిగరెట్ మనకున్న మానసిక సమస్యను పరిష్కరించదు. సిగరెట్ ముందుగా సృష్టించిన అసౌకర్యాన్ని తాత్కాలికంగా దాచుతుంది అంతే. ఈ సైకిల్‌ని అర్థం చేసుకోవడమే అలవాటు నుంచి బయటపడే మొదటి అడుగు.
గమనిక: స్మోకింగ్ ఆరోగ్యానికి చాలా ప్రమాదం. మెజారిటీ క్యాన్సర్ కేసుల్లో స్మోకింగ్ ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. అందుకే వీలైనంత వరకు దీనికి దూరంగా ఉండడమే మంచిది.