Ajith v/s Sivakarthikeyan: అజిత్ కి షాకిచ్చిన శివ కార్తికేయన్‌.. `పట్టుదల` రికార్డ్ ని `పరాశక్తి` బ్రేక్‌

Published : Feb 02, 2025, 01:41 PM IST

Ajith v/s Sivakarthikeyan: సుధా కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్ నటించిన `పరాశక్తి` సినిమా టీజర్, `విడాముయర్చి`(`పట్టుదల` తెలుగులో) సినిమా రికార్డ్ ని బద్దలు కొట్టడం విశేషం. 

PREV
14
Ajith v/s Sivakarthikeyan: అజిత్ కి షాకిచ్చిన శివ కార్తికేయన్‌..  `పట్టుదల` రికార్డ్ ని `పరాశక్తి` బ్రేక్‌
అజిత్ ని మించిన శివకార్తికేయన్

Ajith v/s Sivakarthikeyan: శివకార్తికేయన్‌  మొన్నటి వరకు టైర్‌ 2 హీరోల జాబితాలో ఉన్నారు. కానీ ఇప్పుడు `అమరన్‌` సినిమాతో ఆయన సూపర్‌ స్టార్‌ హీరోల జాబితాలో చేరుతున్నారు. విజయ్‌ సినిమాలు వదిలేస్తున్న సమయంలో శివ కార్తికేయ నెమ్మదిగా ఎదుగుతూ రావడంతో విజయ్‌ లేని లోటు భర్తీ చేయబోతున్నారని, విజయ్‌ స్థానానికి శివ కార్తికేయన్‌ బెస్ట్ ఛాయిస్‌ అంటున్నారు. 

 

24
రికార్డ్ సృష్టించిన `పరాశక్తి`

నటుడు విజయ్ తర్వాత కోలీవుడ్ లో అత్యధిక అభిమానులను కలిగిన నటుడు అజిత్. ఆయన ఇప్పటివరకు ఏ సినిమాతోనూ 350 కోట్ల వసూళ్లు సాధించలేదు. కానీ శివకార్తికేయన్ తన 22వ సినిమా `అమరన్‌`తో ఆ ఘనత సాధించి కోలీవుడ్ బాక్సాఫీస్ కింగ్ గా అవతరించారు. ఇదిలా ఉండగా, తన `పరాశక్తి` సినిమా టీజర్ తో  అజిత్ `విడాముయర్చి`(పట్టుదల) సినిమా రికార్డ్ ని బద్దలు కొట్టారు.

 

34
వెనుకబడిన `విడాముయర్చి`

అజిత్ `విడాముయర్చి` సినిమా టీజర్ గత ఏడాది నవంబర్ లో విడుదలైంది. ఆ టీజర్ విడుదలై 2 నెలలు దాటినా యూట్యూబ్ లో 1.4 కోట్ల వ్యూస్ మాత్రమే వచ్చాయి. కానీ శివకార్తికేయన్ `పరాశక్తి` సినిమా టీజర్ విడుదలై 3 రోజుల్లోనే యూట్యూబ్ లో 2 కోట్లకు పైగా వ్యూస్ సాధించింది. దీన్ని చూసిన నెటిజన్లు అజిత్ కంటే శివకార్తికేయన్ సినిమాకి ఇంత క్రేజా అని ఆశ్చర్యపోతున్నారు.

44
విడాముయర్చి vs పరాశక్తి

`విడాముయర్చి` టీజర్ మాత్రమే కాదు, రెండు వారాల క్రితం విడుదలైన ఆ సినిమా ట్రైలర్ కూడా ఇప్పటివరకు 1.7 కోట్ల వ్యూస్ మాత్రమే సాధించింది. అజిత్ సినిమా రికార్డ్ ని శివకార్తికేయన్ ఇలా బద్దలు కొట్టడంతో, `పరాశక్తి` సినిమా బాక్సాఫీస్ దగ్గర కూడా సంచలనం సృష్టిస్తుందని అంచనా. ఈ సినిమా మాతృభాషా ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రాజేంద్రన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ఇది శివకార్తికేయన్ 25వ సినిమా అని గుర్తుంచుకోవాలి.

read  more Aamir Khan Third Marriage: మూడో పెళ్లికి రెడీ అవుతున్న అమీర్‌ ఖాన్‌. అమ్మాయి ఎవరో తెలుసా? ఆ హీరోయిన్‌ కాదు

also read: Chiranjeevi next movie: `పూనకాలు లోడింగ్‌`.. చిరంజీవి నెక్ట్స్ సినిమా టైటిల్‌, మరో బ్లాక్‌ బస్టర్‌ లోడింగ్‌

 

 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories