Valentines Day Movies : వాలెంటైన్స్ డే కోసం OTTలో.. 6 రొమాంటిక్ కొరియన్ సినిమాలు

Published : Feb 02, 2025, 01:40 PM IST

Valentines Day Special Romantic Korean Movies:  ఫిబ్రవరి వచ్చేసింది. ప్రపంచం అంతా ఎదురుచూస్తున్న వాలెంటైన్స్ డే ఈనెలలోనే ఉంది. ప్రేమికులకు ఎంతో ఇష్టమైన ఆ రోజు.. ప్రేమికులు ఎంతో ఇష్టపడే 6 రొమాంటిక్ కొరియన్ వెబ్ సిరీస్ లకు సబంధించి వివరాలు మీకోసం.

PREV
16
Valentines Day Movies : వాలెంటైన్స్ డే కోసం OTTలో.. 6 రొమాంటిక్ కొరియన్ సినిమాలు

ఈ వాలెంటైన్స్ డే ప్రేమికుల కోసం ఎన్నో వెబ్ సిరీస్ లు ఓటీటీల్లో రెడీగా ఉన్నాయి.  గాఢమైన భావోద్వేగాలు, హద్దులు దాటిన ప్రేమ, అనుబంధాలు, సంబంధాలతో మీకోసం ఎదరుచూస్తున్నాయి. ప్రేమికులు ఎంతో ఇష్టపడే  రొమాంటిక్ డ్రామాలు మీకోసం. 

26
Things That Come After Love

'ప్రేమ, ఆ తర్వాత పరిణామాలు, ఇలా ప్రతీ ఒక్కటి వివరించడానికి  అనేక నవలు  వచ్చాయి. ఓ ప్రేమ నవల ఆధారంగా వచ్చింది Things That Come After Love, వెబ్ సిరీస్.  'ప్రేమ తర్వాత ఏం జరుగుతుంది' అనేది 2024 దక్షిణ కొరియా రొమాన్స్ డ్రామా. ఇది ఒక కొరియన్ మహిళ - జపనీస్ పురుషుడి మధ్య భావోద్వేగ ప్రేమకథను చూపిస్తుంది.  దేశ సరిహద్దులను  దాటి సాగిన ఈ ప్రేమ కథ  ఎంతో మంది జంటలను ఆకర్శిస్తుంది.  

36
My Secret Romance

ఈ వెబ్ సిరిస్ చాలామంది ఫెవరెట్ అని చెప్పాలి.  ఈసిరిస్ పేరు My Secret Romance. ప్రేమ గురించి తెలియని ఓ అమ్మాయి..  అనుకోకుండా  చా జిన్-వూక్ అనే అబ్బాయితో  ఒక రాత్రి గడుపుతుంది. కొన్నేళ్ళ తరువాత  వారు తిరిగి కలుసుకుంటారు, జిన్-వూక్ వారి అనుబంధాన్ని తిరిగి పునరుద్ధరించాలని కోరుకుంటుండగా, యూ-మి మాత్రం ఓ  రహస్యాన్ని దాచిపెడుతుంది. ఇంతకీ ఎంటి అది అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. 

46
Cinderella at 2 AM

నిజమైన ప్రేమను తెలియజేసే సినిమా ఇది. ఈమూవీ పేరు Cinderella at 2 AM. ఇది  ఒక రొమాంటిక్ కామెడీ. ప్రేమపై వారి భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉన్న జంట కథ ఇది. ఈమూవీలో ఎమోషన్స్, యాక్షన్, మనసుల మధ్య సంఘర్షణలు, వీటితో పాటు కామెడీ కూడా కలిసి అద్భుతంగా చూపించిన సినిమా ఇది. 

 

56
Love Next Door

బాల్య స్నేహితుల మధ్య ప్రేమ కథ Love Next Door.  బే సియోక్-ర్యు - చోయ్ సెయుంగ్-హ్యో అనే ఇద్దరు చిన్ననాటి స్నేహితులు మధ్యలో విడిపోయి.. పెద్దయ్యాక తిరిగి కలుసుకున్న కథ ఇది. ఇది ఒక  'ప్రక్కింటి ప్రేమ' కథ.  వారి మధ్య ఉన్న స్నేహం ప్రేమగా ఎలా మారింది. తరువాత ఏం జరిగింది అనేది కథ. 

66
Queen of Tears

Queen of Tears . 'కన్నీళ్ల రాణి' ఈ ఇంట్రెస్టింగ్ కొరియన్  డ్రామా ఇద్దరు ప్రేమికుల మధ్య  సవాళ్లను చూపిస్తుంది.  ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటున్న పెళ్ళైన మహిళ జంట హాంగ్ హే-ఇన్. కష్టాలు తట్టుకోలేని ఆమె..  బేక్ హ్యూన్-వూ అనే అబ్బాయితో ప్రేమలో పడుతుంది. మరి వారు తమ ప్రేమను ఎలా గెలుచుకున్నారు. ఆమె ఆ బంధికానా నుంచి ఎలా బయటపడింది అనేది ఈసినిమాలో క్లియర్ గా చూపించారు. ఇలా అద్భుతమైన కొరియన్ ప్రేమ కథలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. 

Read more Photos on
click me!

Recommended Stories