Sandeep Vanga, Spirit Movie, Prabhas
సందీప్ రెడ్డి వంగ హీరోలంతా ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కామ్ గా ఉండే హీరోను కూడా యానిమల్ లా మార్చేస్తుంటాడు. అగ్రెస్సీవ్ క్యారెక్టర్స్ ను డిజైన్ చేయడంతోసందీప్ తరువాతే ఎవరైనా. హీరోలలో కూడా నెగెటీవ్ థాట్స్ ఉంటాయి.. హీరోలు అంటే ఇలానే ఉండాలి అని లేదుఅని.. తన మార్క్ హీరోయిజం ను తన సినిమాల్లో చూపిస్తూ.. ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు సందీప్ రెడ్డి.
ఇక చిన్న హీరోలు దొరికితేనే అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి సినిమాలు పడ్డాయి. ఇక ప్రభాస్ లాంటి హైట్, పర్సనాలిటీ, ఇమేజ్ ఉన్న హీరోను ఇంకెంత చూపిస్తాడా అని ప్యాన్స్ ఎదురుచూస్తున్నాడు. ప్రభాస్ లోని ఎనర్జీని సందీప్ స్పిరిట్ కోసం ఎలా వాడబోతున్నాడా అని ప్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇందంతా పక్కన పెడితే.. స్పిరిటి మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఏదో ఒక అప్ డేట్ బయటకు వస్తూనే ఉంది.
అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు తప్పించింది.. అఫీషియల్ గా స్పిరిట్ కు సబంధించిన వార్త ఒక్కటి కూడా ఇవ్వడంలేదు టీమ్. ఇక ఆ సినిమాకు సబంధించిన ఓ అప్ డేట్ వైరల్ అవుతుంది. అందేంటంటే.. ఈమూవీలో ప్రభాస్ కు అన్నగా ఓ స్టార్ హీరో నటించబోతున్నాడట. అతను ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్.
ఈ మధ్య సౌత్ సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాడు సంజయ్. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కాస్త పవర్ ఫుల్ పాత్రల్లో కనిపిస్తున్నాడు. ఈక్రమంలోనే ప్రభాస్ కు అన్నగా.. సందీప్ మార్క్ పాత్రను ఇందులో క్రియేట్ చేశాడట.
ఆ పాత్రకు సంజయ్ దత్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరో కరెక్ట్ అనుకున్నాడో ఏమో.. ఈమూవీలో దాదాపు కన్ ఫార్మ్ చేసినట్టు అంటున్నారు. ఈ విషయం అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కాని.. టాలీవుడ్ లో మాత్రం టాక్ వినిపిస్తోంది.
ఇక ప్రభాస్ సినిమాల లైన్ అప్ చూసుకుంటే.. మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. దీనితో పాటు కల్కీ2, సలార్ 2, ఫౌజీ ఇలా వరుసగా ప్రభాస్ సినిమాలు లైన్ లో ఉన్నాయి. మరోమూడు సినిమాలకుఆయన గ్రీన్ సిగ్నల్ఇచ్చిన్ట తెలుస్తోంది.