జూనియర్ ఎన్టీఆర్, ప్రియమణి, మమతా మోహాన్ దాస్ హీరో, హీరోయిన్లుగా.. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సినిమా యమదొంగ. ఈ సినిమాలో దొంగగా ఎన్టీఆర్ మాస్ క్యారెక్టర్ ను అద్భుతంగా చేశారు. కంప్లీట్ గా సెంటిమెంట్ ను బేస్ చేసుకుని యాక్షన్ సీన్స్ తో డెకరేట్ చేసిన సినిమా ఇది. ఈ మూవీలో హీరో తరువాత అంతే ఇంపార్టెన్స్ ఉన్న మర పాత్ర యముడు. ఈ రెండు క్యారెక్టర్స్ మధ్య నడిచే అద్భుతమైన సన్నివేశాలు సినిమాకు ప్రాణం పోశాయి అని చెప్పవచ్చు. యముడి పాత్రలో కొన్ని కొత్త వేరియేషన్స్ ను మోహన్ బాబు ద్వారా చూడించాడు రాజమౌళి.
Also Read:సుశాంత్ సింగ్ సూసైడ్ కేసులో కీలక మలుపు, సీబీఐ రిపోర్ట్ లో ఊహించని ట్విస్ట్!
యముడంటే ఇలానే ఉండాలి.. మాటకి పదిసార్లు యముండా అనాలి అనే రొటీన్ నుంచి బంబోల జంబ అనే కొత్త ఊతపదం మోహన్ బాబు చేత అనిపించాడు రాజమౌళి. ఇక ఈమూవీలో మోహన్ బాబు అద్భుతంగా చేసిన యముడి పాత్ర.. అసలు ఆయన చేయాల్సింది కాదట. యముడిగా రాజమౌళి ముందు వేరే నటుడిని అనుకున్నారని తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు.. నవరస నటసార్వభౌమ కైకాల సత్యనారాయణ. ఆయన చేత ఈ పాత్ర చేయించాలి అని అనుకున్న రాజమౌళి... యముడిగా కైకాల కనిపిస్తే.. ఆడియస్స్ లో ఉత్సాహం పొంగి పొర్లుతుంది అని ప్లాన్ తో ఉన్నాడు.
అంతే కాదు ఈ పాత్ర చేయాలని కైకాలను సంప్రదించారట కూడా. అయితే కొన్ని కారణాల వల్ల కైకాల ఈసినిమాను వదులుకోవలసి వచ్చినట్టు తెలుస్తోంది. అది కూడా రెమ్యూనరేషన్ విషయంలోనే ఈసినిమాను మిస్ అయ్యారట కైకాల. ఈ విషయం కైకాల ఓ టైమ్ లో చెప్పినట్టు తెలుస్తోంది. ఆతరువాత మోహన్ బాబును తీసుకోవడం.. ఈ క్యారెక్టర్ అనుకున్నదానికంటే అద్భుతంగా రావడంతో.. రాజమౌళి కి ఉన్న చిన్న అనుమానం కూడా తీరిపోయింది. ఇక సినిమా సక్సెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
yamadonga
2007 అగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే సందర్భంతగా రిలీజ్అయిన యమదొంగ అప్పట్లోనే అద్భుతమైన కలెక్షన్లు సాధించింది. బాక్సా ఫీస్ దగ్గర తిరుగు లేని విజయాన్ని అందుకుంది. 18 కోట్లబడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తే. 30 కోట్లకుపైనే లాభాలు తీసుకువచ్చింది యమదొంగ.