కోట్ల ఆస్తి ఉన్నా అద్దె ఇంట్లోకి మారిన హీరో శివకార్తికేయన్, కారణం ఏంటంటే?

Published : Jul 19, 2025, 01:10 PM IST

ఇండస్ట్రీలో స్టార్ డమ్, కోట్ల ఆస్తి, లగ్జరీ ఇల్లు, కార్లు ఉన్నా కూడా యంగ్ హీరో శివకార్తికేయన్ అద్దె ఇంట్లో ఉంటున్నారని మీకు తెలుసా. దానికి కారణం ఏంటంటే?

PREV
15

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నేచురల్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు శివకార్తికేయన్. ఆయన ఈమధ్య నటించిన బయోపిక్ అమరన్ సినిమా బాక్సాఫీస్ వద్ద 350 కోట్లకు పైగా వసూలు చేసింది. అమరన్ సినిమా విజయం తర్వాత ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నారు యంగ్ హీరో. 

ఒకటి మద్రాసి మూవీ కాగా.. మరొకటి పరాశక్తి. ఈ రెండు సినిమాల షూటింగ్స్ ప్రస్తుతం సూపర్ ఫాస్ట్ గా జరుగుతున్నాయి. తాజాగా శివకార్తికేయన్ కు సబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఆయన తన ఇంటిని ఖాళీ చేసి.. అద్దె ఇంటికి మారినట్టు తెలుస్తోంది. కారణం ఏంటి?

25

శివకార్తికేయన్ చెన్నై పనయూర్‌లో కుటుంబంతో నివసిస్తున్నారు. అక్కడి నుంచి తాజాగా చెన్నై ఈసీఆర్‌లోని నిర్మాత బోనీ కపూర్ ఇంటిని రెంట్ కు తీసుకుని షిప్ట్ అయ్యారని సమాచారం. సొంత ఇంటి నుంచి అద్దె ఇంటికి శివకార్తికేయన్ మారడానికి ప్రధాన కారణం, ఆయన పనయూర్‌లోని తన ఇంటిని కూల్చివేసి అక్కడ మరో అద్భుతమైన ఇంటిని కట్టించబోతున్నాడట. ఈ కారణంగా పనయూర్ నుంచి ఈసీఆర్‌కు మారనున్నారట. పనయూర్‌లో కోట్ల రూపాయల విలువైన భవనాన్ని యంగ్ హీరో నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

35

ఇక శివకార్తికేయన్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన నటించిన మద్రాసి సినిమా ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఈ మూవీకి ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో శివకార్తికేయన్‌తో పాటు బిగ్ బాస్ షానా, నటి రుక్మిణి వసంత కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మద్రాసి సినిమాను సెప్టెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.

45

ఇది కాకుండా ఆయన నటించిన పరాశక్తి అనే సినిమా కూడా నిర్మాణంలో ఉంది. ఈ మూవీకి సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో శివకార్తికేయన్‌తో పాటు అథర్వ, శ్రీలీల, రవి మోహన్ వంటి పెద్ద తారాగణం నటిస్తోంది. ఈ పరాశక్తి సినిమాకి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.

55

మద్రాసి, పరాశక్తి సినిమా తర్వాత శివకార్తికేయన్ మరికొన్ని మూవీస్ లో టించనున్నారు. గుడ్ నైట్ ఫేమ్ వినాయక్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఆయన సైన్ చేసినట్టు తెలుస్తోంది. ఈసినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.మోహన్ లాల్ శివకార్తికేయన్ కు తండ్రి పాత్ర చేయబోతున్నట్టు తెలుస్తోంది. 

ఇది కాకుండా వెంకట్ ప్రభు దర్శకత్వంలోనూ ఒక చిత్రంలో ఆయన నటించనున్నారు. ఆ సినిమాకు సత్య జ్యోతి ఫిల్మ్స్ నిర్మిస్తోంది.ఇక విక్రమ్ వేదా సినిమా దర్శకులు పుష్కర్ గాయత్రి దర్శకత్వంలోనూ ఆయన ఒక సినిమాలో నటించేందుకు చర్చలు జరుగుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories