కింగ్డమ్ సినిమాను గౌతం తిన్ననూరి డైరెక్ట్ చేస్తుండగా, ఇందులో విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్స్ జంటగా నటిస్తున్నారు. సత్యదేవ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ నెల 31న ‘కింగ్డమ్’ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్‌లతో సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయింది.