తండ్రి ఏఎన్నార్‌ జోరు ముందు నిలబడలేకపోయిన నాగార్జున.. ఆ ఏడాది వరుసగా చేదు అనుభవాలు

Published : Jul 19, 2025, 11:48 AM IST

అక్కినేని నాగార్జునని మూడు సినిమాలు డిజప్పాయింట్‌ చేస్తే, అదే ఏడాది తండ్రి ఏఎన్నార్‌ వరుస హిట్లతో దుమ్ములేపారు.  ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. 

PREV
15
`శివ` ఇమేజ్‌ని కాపాడుకునేందుకు నాగ్‌ ప్రయత్నం

`శివ` చిత్రం రిలీజ్ అయ్యే వరకు నాగార్జున కెరీర్ చప్పగా సాగింది. శివ మూవీతో నాగార్జున టాలీవుడ్ లో నయా స్టార్ గా అవతరించారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 1989లో విడుదలైన `శివ` చిత్రం సంచలన విజయం సాధించింది. శివ చిత్రంతో వచ్చిన క్రేజ్ ని కొనసాగించడానికి నాగార్జున చాలా కష్టపడ్డారు. 

25
ఒకే ఏడాది నాలుగు సినిమాలతో నాగార్జున

1991 సంవత్సరం నాగార్జునకి ఏమాత్రం కలిసిరాలేదు. 1991లో నాగార్జున నుంచి నాలుగు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అందులో నిర్ణయం, చైతన్య, శాంతి క్రాంతి, జైత్ర యాత్ర చిత్రాలు ఉన్నాయి. నిర్ణయం చిత్రం యావరేజ్ గా నిలిచింది. మిగిలిన చైతన్య, శాంతి క్రాంతి, జైత్ర యాత్ర చిత్రాలు అంతగా ఆడలేదు. 

35
ఏఎన్నార్‌ భారీ విజయం

ఆ టైంలో రిటైర్మెంట్ దశలో ఉన్న నాగార్జున తండ్రి అక్కినేని నాగేశ్వరరావు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. 1991లో ఏఎన్నార్ నటించిన సీతారామయ్య గారి మనవరాలు చిత్రం సంచలన విజయం సాధించింది. ఈ మూవీలో ఏఎన్నార్ తాత పాత్రలో నటించగా మీనా మనవరాలిగా నటించింది. 

45
`సీతారామయ్యగారి మనవరాలు` లో మీనాకి బ్రేక్

ఈ చిత్రం నుంచి ఏఎన్నార్ తండ్రి, తాత తరహా పాత్రలని అంగీకరించడం ప్రారంభించారు. ఆ విధంగా 1991లో ఏఎన్నార్ బ్లాక్  బస్టర్ హిట్ అందుకోగా, నాగార్జున మాత్రం ఫ్లాపులతో డీలా పడ్డారు. సీతారామయ్య గారి మనవరాలు చిత్రంతోనే మీనాకి నటిగా మంచి గుర్తింపు దక్కింది. ఈ చిత్రం తర్వాత మీనా తెలుగులో బిజీ హీరోయిన్ గా మారిపోయారు. 

55
అవార్డులందుకున్న `సీతారామయ్య గారి మనవరాలు`

క్రాంతి కుమార్ దర్శకత్వంలో సీతారామయ్య గారి మనవరాలు చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రానికి అనేక అవార్డులు దక్కాయి. క్రాంతి కుమార్ ఉత్తమ దర్శకుడిగా ఫిలిం ఫేర్, నంది అవార్డులు అందుకున్నారు. ఉత్తమ నటుడిగా ఏఎన్నార్ కి ఫిలిం ఫేర్ అవార్డు దక్కింది.

Read more Photos on
click me!

Recommended Stories