Deepthi-Shanmuk Breakup: షణ్ముఖ్-దీప్తి బ్రేకప్ కి కారణం నేను కాదు... సిరి సోషల్ మీడియా పోస్ట్?

అనుకున్నంతా అయ్యింది. షణ్ముఖ్ కి దీప్తి బ్రేకప్ చెప్పేసింది. సోషల్ మీడియా వేదికగా ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నట్లు వెల్లడించారు దీప్తి. దీనితో షణ్ముఖ్-దీప్తి బ్రేకప్(Deepthi-Shanmuk Breakup) హాట్ టాపిక్ గా మారింది. 

బిగ్ బాస్ హౌస్ (Bigg Boss Telugu 5) నుండి షణ్ముఖ్ బయటికి వచ్చిన నాటి నుండి బ్రేకప్ రూమర్స్ చక్కర్లు కొట్టాయి. దీప్తి షణ్ముఖ్ పట్ల కోపంగా ఉన్నారని వీరిద్దరూ విడిపోయే అవకాశం కలదంటూ వరుస కథనాలు వెలువడ్డాయి. దీప్తి తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పరోక్షంగా షణ్ముఖ్ పై ఆవేశం, ఆవేదన వ్యక్తం చేశారు. 


దీప్తి (Deepthi Sunaina) ఇండైరెక్ట్ పోస్ట్స్ షణ్ముఖ్ ని ఉద్దేశించేనని నెటిజెన్స్, మీడియా అభిప్రాయపడ్డారు. రెండు రోజుల క్రితం దీప్తి ప్రకటనతో దీనిపై పూర్తి స్పష్టత వచ్చింది. బ్రేకప్ జరిగిన వెంటనే అన్ని వేళ్ళు సిరి వైపు తిరిగిరాయి. షణ్ముఖ్ తో దీప్తి విడిపోవడానికి పూర్తి బాధ్యత సిరిదే అంటూ సోషల్ మీడియా కామెంట్స్ వినిపిస్తున్నాయి. 
 


బిగ్ బాస్ హౌస్ లో వీరి రిలేషన్ హద్దులు దాటిన నేపథ్యంలో దీప్తి జీర్ణించుకోలేకపోయినట్లు తెలుస్తుంది. ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూ... సిరి-షణ్ముఖ్ చాలా దగ్గరయ్యారు. గొడవలు, రొమాన్స్, అలకలు, హగ్గులు, కిస్సులు ఇలా ప్రేమ పక్షులుగా మెలిగారు. మానసికంగా ఒకరంటే ఒకరు విపరీతమైన ప్రేమ పెంచుకొని... ఎమోషనల్ గా వీక్ అయ్యారు. 
 


ఒక దశలో ఈ రిలేషన్ ఇద్దరినీ గేమ్ పరంగా దెబ్బతీసింది. ఒకరిపై మరొకరికి ఏర్పడిన బాండింగ్ కారణంగా  గేమ్ పై ఫోకస్ పెట్టలేకపోతున్నట్లు అంగీకరించారు కూడా. ఇక షణ్ముఖ్ టైటిల్ కోల్పోవడానికి కారణం కూడా సిరితో అతనికి ఏర్పడిన బంధమే అని చెప్పాలి. మరో అమ్మాయికి ప్రేమించినావాడు దగ్గరైతే తట్టుకోవడం ఏ అమ్మాయికైనా కష్టమే. 

Deepthi Sunaina


దీప్తి అందుకే షణ్ముఖ్ (Shanmukh) కి దూరమయ్యారని, అందుకే బ్రేకప్ చెప్పారనేది సోషల్ మీడియాలో జరుగుతున్న వాదన. ఈ నేపథ్యంలో సిరి పరోక్షంగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మనసును బాధించే ఇలాంటి పుకార్లు తనను ఇబ్బంది పెట్టవంటూ కామెంట్ చేశారు. ఆమె ఇంస్టాగ్రామ్ లో.. ఎవరైనా మీ జీవితం చాలా కఠినంగా ఉందని అడిగితే.. వాటికంటే నేను ఇంకా స్ట్రాంగ్ అంటూ చిరునవ్వుతో సమాధానం చెప్పూ.. అని ఓ ప్రముఖ వ్యక్తి చెప్పిన మాటలను కోట్ చేసింది. 

ఒకవైపు ఇలాంటి నిరాధారమైన కామెంట్స్ పట్టించుకోనూ అంటూనే.. సన్నిహితుల వద్ద దీప్తి, షణ్ముఖ్ బ్రేకప్ కి నేను కారణం కాదని సిరి (Siri Hanmanth)చెప్పుకుంటున్నారట. వ్యక్తిగత కారణాల వలన విడిపోయారని.. నా వలన కాదని అంటున్నారట. నిజం ఏదైనా సోషల్ మీడియా లవ్ బర్డ్స్ గా పేరుగాంచిన దీప్తి, షణ్ముఖ్ విడిపోయారు. 
 


గతంలో దీప్తి సైతం బిగ్ బాస్ హౌస్ కి వెళ్లడం జరిగింది. హీరో నాని హోస్ట్ గా కొనసాగిన బిగ్ బాస్ సీజన్ 2లో ఆమె పాల్గొన్నారు. 10వ వారం దీప్తి ఎలిమినేట్ కావడం జరిగింది. ఇక షణ్ముఖ్ సీజన్ 5 రన్నర్ గా నిలిచారు. సన్నీతో ఫైనల్ లో పోరాడిన షణ్ముఖ్ సెకండ్ ప్లేస్ దక్కించుకున్నాడు. 

Also read అఫీషియల్.. షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పిన దీప్తి సునైనా.. మంట పెట్టింది ఎవరు

Latest Videos

click me!