అనసూయ టాలీవుడ్ లో యాంకర్ గా అడుగుపెట్టి ఇప్పుడు నటిగా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. విభిన్నమైన పాత్రల్లో ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. ఇక అనసూయ అందం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్లామర్ పరంగా అనసూయ ఒక రేంజ్ లో రచ్చ చేస్తోంది. విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ వెండితెరపై కూడా పాతుకుపోయేందుకు ప్రయత్నిస్తోంది.
సినిమాల ఎంపిక విషయంలో Anasuya Bharadwaj ఎప్పుడూ తొందరపడదు. ఆచితూచి అన్నట్లుగా అడుగులు వేస్తోంది. వచ్చిన ప్రతి ఆఫర్ కి అనసూయ ఒకే చెప్పి ఉంటే ఈ పాటికి ఆమె చాలా చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఉండాలి. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది. Rangasthalam చిత్రంలో అనసూయ రంగమ్మత్తగా అద్భుతమైన నటన కనబరిచిన సంగతి తెలిసిందే. కంప్లీట్ గ్లామర్ రోల్ కాకుండా తన పాత్రలో నటనకు కూడా ప్రాధాన్యత ఉండేలా అనసూయ జాగ్రత్త పడుతోంది.
టాలీవుడ్ లో అనసూయతో పోటీ పడే యాంకర్స్ చాలా మందే ఉన్నారు. కానీ వారందరికీ అనసూయ తరహాలో వెండితెరపై ఛాన్సులు రావడం లేదు. క్షణం, రంగస్థలం చిత్రాల్లో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. క్షణంలో పోలీస్ అధికారిగా, రంగస్థలంలో పల్లెటూరి గృహిణిగా అనసూయ తన నటనతో మెస్మరైజ్ చేసింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామర్ తో ఒకరేంజ్ లో రచ్చ చేస్తోంది. తాజాగా అనసూయ సోషల్ మీడియాలో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ పిక్స్ షేర్ చేసింది. ఇందులో సర్ ప్రైజ్ ఏంటంటే.. అనసూయ ఫ్యామిలీతో కలసి శ్రీముఖి కూడా న్యూఇయర్ సెలెబ్రేషన్స్ లో పాల్గొంది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అనసూయ పుష్ప చిత్రంలో ద్రాక్షాయణి పాత్రలోనటించిన సంగతి తెలిసిందే. కానీ అనసూయ ద్రాక్షాయని పాత్ర ఆశించిన స్థాయిలో పేలలేదు. ఆమె రోల్ నామమాత్రంగా ఉందంటూ కామెంట్స్ వినిపించాయి. అనసూయ భర్త పాత్రలో సునీల్ మంగళం శ్రీనుగా కనిపించారు. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ లో భాగంగా శ్రీముఖి మాట్లాడుతూ.. మనతో ద్రాక్షాయణి ఉంది అంటూ అనసూయని చూపించింది. ద్రాక్షాయణి మాత్రమే కాదు ఆమె వెనుక మరొక వ్యక్తి ఉన్నారు అంటూ అనసూయ భర్తని చూపించింది.
దీనితో అనసూయ వెంటనే మా ఆయన మంగళం శ్రీను లాగా కాదు అంటూ సరదాగా కామెంట్ చేసింది. సునీల్ పుష్ప చిత్రంలో నెగిటివ్ షేడ్స్ లో నటించాడు. కానీ మా ఆయన మాత్రం నైస్ గాయ్ అంటూ ప్రశంసలు కురిపించింది అనసూయ
అలాగే అనసూయ తన ఫ్యామిలీతో కలసి న్యూ ఇయర్ సెలెబ్రేట్ చేసుకుంటున్న దృశ్యాలు కూడా వైరల్ అయ్యాయి. తన పెట్స్ , పిల్లలు, భర్తతో అనసూయ ఉన్న ఫొటోస్ చాలా క్యూట్ గా ఆకట్టుకుంటున్నాయి.