అతడితో సహజీవనం చేస్తూ సిరి హనుమత్ వరలక్ష్మీ వ్రతం చేయడం తప్పు..దుమ్మెత్తి పోసిన ప్రముఖ జ్యోతిష్యుడు

Published : Aug 12, 2025, 06:30 AM IST

సిరి హనుమంత్, శ్రీహాన్ తో కలిసి వరలక్ష్మీ వ్రతం చేయడం వివాదంగా మారింది. ప్రముఖ జ్యోతిష్యుడు మురళీశర్మ సిరి హనుమంత్ పై తీవ్రంగా విమర్శలు చేశారు. 

PREV
15
సిరి హనుమంత్ వరలక్ష్మీ వ్రతం పోస్ట్ వైరల్ 

భారతదేశంలో మహిళలకు వరలక్ష్మీ వ్రతం పండుగ చాలా పవిత్రమైనది. వివాహమైన మహిళలు తమ భర్త క్షేమం కోసం ఈ వ్రతం చేస్తారు. అదే విధంగా పెళ్లి కావలసిన అమ్మాయిలు కూడా వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. సెలెబ్రిటీలు తమ ఇళ్లలో వరలక్ష్మీ వ్రతం చేసుకుని ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో బిగ్ బాస్ ఫేమ్ సిరి హనుమంత్ వివాదంలో చిక్కుకుంది. 

DID YOU KNOW ?
టాప్ 5 గా సిరి హనుమంత్
సిరి హనుమంత్ బిగ్ బాస్ తెలుగు 5లో పాల్గొని టాప్ 5 కంటెస్టెంట్ గా నిలిచింది. 100 రోజులకి పైగా హౌస్ లో గడిపింది. 
25
శ్రీహాన్ తో సిరి హనుమంత్ సహజీవనం 

సిరి హనుమంత్, శ్రీహాన్ ఇద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. ఇంకా పెళ్లి చేసుకోలేదు కానీ సహజీవనం చేస్తున్నారు. ఇటీవల సిరి హనుమంత్, శ్రీహాన్ తో కలిసి వరలక్ష్మీ వ్రతం ఆచరించింది. భక్తి శ్రద్దలతో ఈ జంట పూజలు చేశారు. ఆ దృశ్యాలని సిరి హనుమంత్ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. 

35
సిరి హనుమత్, శ్రీహాన్ వరలక్ష్మీ వ్రతం చేయడం తప్పు 

సిరి హనుమంత్, శ్రీహాన్ తో కలిసి వరలక్ష్మీ వ్రతం చేయడాన్ని ప్రముఖ జ్యోతిష్యుడు మురళీశర్మ తీవ్రంగా తప్పు పట్టారు. ఆయన తెలంగాణ బ్రాహ్మణ సేన అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. సిరి హనుమంత్ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి వరలక్ష్మీ వ్రతం చేయడం గురించి మురళీశర్మ మాట్లాడుతూ.. బిగ్ బాస్ షో వింత పోకడలు సమాజంలోకి కూడా ప్రవేశించాయి అని అన్నారు. 

45
గోత్ర నామాలు ముఖ్యం 

మన సనాతన ధర్మ వ్యవస్థలో కొన్ని నియమాలు ఉన్నాయి. వరలక్ష్మీ వ్రతం చేయాలన్నా, ఏదైనా దేవాలయంకి వెళ్లి పూజలు చేయాలన్నా గోత్ర నామాలు ముఖ్యమైనవి. సిరి హనుమంత్, శ్రీహాన్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. మరి వీరిద్దరూ కలిసి ఎవరి గోత్రం చెబుతారు అని మురళీశర్మ ప్రశ్నించారు. స్త్రీకి పెళ్ళైన తర్వాత భర్త గోత్రం సంక్రమిస్తుంది అని అన్నారు. 

55
కెరీర్ లో బిజీగా సిరి హనుమంత్ 

ఇంకా సిరి హనుమంత్, శ్రీహాన్ లకు వివాహం కాలేదు కాబట్టి వీరిద్దరి గోత్రాలు వేరుగా ఉంటాయి. కాబట్టి వారిద్దరూ కలిసి వరలక్ష్మీ వ్రతం చేయడం తప్పు అని మురళీశర్మ అన్నారు. పెళ్లి కానీ అమ్మాయిలకు తన తండ్రి నుంచి వచ్చిన గోత్రమే ఉంటుంది. పెళ్లయ్యాక ఆమె గోత్రం మారుతుంది. సిరి హనుమంత్ కావాలంటే సింగిల్ గా పూజ చేసుకోవచ్చు. కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదు అని మురళీశర్మ అన్నారు. సిరి హనుమంత్ బుల్లితెర కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. అప్పుడప్పుడూ సినిమా అవకాశాలు కూడా సిరి అందుకుంటోంది. 

Read more Photos on
click me!

Recommended Stories