'బిగ్ బాస్ తెలుగు 9 అగ్ని పరీక్ష' షూటింగ్ ప్రారంభం.. ఇక్కడ జరిగేది ఇదే

Published : Aug 11, 2025, 10:19 PM IST

బిగ్‌బాస్ 9 తెలుగు అగ్నిపరిక్ష ప్రీ-షో షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జోరుగా సాగుతోంది.బిగ్ బాస్ ప్రధాన షోకి ముందు ప్రీ షోని ఎందుకు షూట్ చేస్తున్నారో ఇక్కడ తెలుసుకోండి.    

PREV
15
బిగ్ బాస్ అగ్నిపరీక్ష షూటింగ్ ప్రారంభం  

బిగ్‌బాస్ 9 తెలుగు సీజన్‌పై ఇప్పటికే ఉన్న ఆసక్తి ఇప్పుడు మరింత పెరిగింది. ప్రధాన రియాలిటీ షో ప్రారంభానికి ముందు ప్రత్యేకంగా రూపొందించిన ‘అగ్నిపరీక్ష’ అనే ప్రీ-షో ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. సామాన్య ప్రజలు (కామనర్స్) ఎంపిక చేసే ఈ ప్రత్యేక కార్యక్రమం, బిగ్‌బాస్ హౌస్‌లో ప్రవేశించే అవకాశం కోసం పోటీపడే వారికి ఒక కఠినమైన పరీక్షగా నిలవనుంది. ఈసారి ఎక్కువ మంది  కామనర్స్ కి బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్స్ గా అవకాశం లభించబోతున్నట్లు తెలుస్తోంది. 

25
ప్రీ షోతోనే అంచనాలు పెంచేలా.. 

తాజా సమాచారం ప్రకారం, అగ్నిపరీక్ష షూటింగ్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జోరుగా కొనసాగుతోంది. ఇందులో పాల్గొనే పోటీదారులు అనేక రకాల సవాళ్లు, మానసిక ఒత్తిడితో కూడిన టాస్క్‌లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ ఎంపిక ప్రక్రియలో డ్రామా, భావోద్వేగాలు, ఉత్కంఠ అన్నీ కలగలిపి ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ప్రీ షోతోనే అంచనాలు పెంచేలా ప్లాన్ చేస్తున్నారు. 

35
త్వరలో ప్రోమో రిలీజ్ 

అగ్నిపరీక్ష ప్రోమో త్వరలోనే విడుదల కానుంది. ఈ ప్రోమో ద్వారా షోలో ఉండే సవాళ్లు, పోటీదారుల ప్రతిస్పందనలు, మొత్తం షో  ఉత్కంఠభరిత వాతావరణం ప్రేక్షకులకు ముందుగానే పరిచయం కానుంది.

45
సెప్టెంబర్ నుంచి ప్రధాన షో

బిగ్‌బాస్ 9 తెలుగు అగ్నిపరీక్ష ఆగస్టు 23, 2025 నుంచి అధికారికంగా జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ప్రధాన బిగ్‌బాస్ 9 తెలుగు సీజన్ ప్రారంభానికి ముందు ఈ ప్రీ-షో, అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేయనుంది. రాబోయే రోజుల్లో ఈ ప్రోగ్రామ్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు, పోటీదారుల గురించి సమాచారం బయటకు రానుంది. ప్రధాన బిగ్ బాస్ తెలుగు 9 షో సెప్టెంబర్ నుంచి ప్రారంభం అవుతుంది.

55
సరికొత్తగా బిగ్ బాస్ షో 

బిగ్‌బాస్ 9 తెలుగు షోలో ఎప్పటిలాగే, గ్లామర్, డ్రామా, ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటూనే సరికొత్త హంగులు ఉండబోతున్నాయి.సీజన్ 9 లో రెండు హౌస్ లు ఉంటాయి. చాలా మార్పులు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. గతంలో ఎప్పుడూ బిగ్ బాస్ తెలుగు షోకి ఇలా ప్రీ షో నిర్వహించలేదు. కానీ సీజన్ 9కి ఎలా చేస్తున్నారంటే నిర్వాహకులు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్థం అవుతోంది. 

Read more Photos on
click me!

Recommended Stories