సిమ్రాన్‌ ఎంత మంది హీరోలతో ఎఫైర్‌ నడిపించిందో తెలుసా? సీనియర్‌ హీరోయిన్‌ సీక్రెట్‌ లవ్‌ స్టోరీస్‌

Published : Jul 01, 2025, 07:33 AM IST

సిమ్రాన్‌ ఒకప్పుడు టాలీవుడ్‌ స్టార్‌ హీరోలందరితోనూ రొమాన్స్ చేసి మెప్పించింది. అంతేకాదు అదే స్థాయిలో ఎఫైర్స్ కూడా నడిపించిందట. ఆ కథేంటో చూద్దాం. 

PREV
16
`టూరిస్ట్ ఫ్యామిలీ`తో సిమ్రాన్‌ బెస్ట్ కమ్‌ బ్యాక్‌

సిమ్రాన్‌ ఇటీవల తమిళ మూవీ `టూరిస్ట్ ఫ్యామిలీ`తో కమ్‌ బ్యాక్‌ ఇచ్చింది. ఈ మూవీ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్ములేపుతుంది. దీంతో మరోసారి వార్తల్లో నిలిచింది సిమ్రాన్‌. 

ఓ రకంగా ఆమెకిది మంచి కమ్‌ బ్యాక్ అని చెప్పొచ్చు. అంతకు ముందు ఒకటి అర సినిమాలు చేస్తూ వచ్చినా ఏదీ పెద్దగా పేరు తేలేది. దీంతో ఇప్పుడీ మూవీ విజయంతో మరోసారి సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కిండి సిమ్రాన్‌.

 ఇక మరోసారి ఆమె బిజీగా కాబోతుందని, సీనియర్లకి మరోసారి జోడీ కట్టేఛాన్స్ ఆమెని వరించబోతుందని చెప్పొచ్చు. మరోసారి తెలుగులో సందడి చేయబోతుందా? అనేది చూడాలి. 

26
తెలుగులో కంటే తమిళంలోనే సిమ్రాన్‌ ఎక్కువ సినిమాలు

ఇదిలా ఉంటే సిమ్రాన్‌ కి సంబంధించిన మరికొన్ని ఆసక్తికర విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ప్రధానంగా ఆమె లవ్‌ ఎఫైర్లు చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం ఆమె మ్యారేజ్‌ చేసుకుని లైఫ్‌లో సెటిల్‌ అయ్యింది. 

కానీ ఆమె ప్రేమ రహస్యాలు మాత్రం తరచూ వైరల్‌గా మారుతూనే ఉన్నాయి. మరి సిమ్రాన్‌ ఎవరితో ప్రేమలో పడింది? ఆమె ఎంత మంది హీరోలను ఫిదా చేసిందనేది చూస్తే.. 

సిమ్రాన్‌ టాలీవుడ్‌లో కంటే కోలీవుడ్‌లోనే సినిమాలు ఎక్కువగా చేసింది. టాప్‌ స్టార్స్ తో సినిమాలు చేసి మెప్పించింది. తమిళ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. సినిమాల్లోకి 1995లో ఎంట్రీ ఇచ్చి 2008 తర్వాత సినిమాలకు దూరమైంది. 

ప్రధానంగా ఆమె పదేళ్లు మాత్రం ఫుల్‌ యాక్టీవ్‌గా ఉంది. ఆ సమయంలోనే ఎన్నో సినిమాలు చేసి మెప్పించింది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలోనూ నటించి మెప్పించింది.

36
అబ్బాస్‌తో ఎక్కువగా సిమ్రాన్‌ లవ్‌ రూమర్స్

పదేళ్లపాటు తిరుగులేని స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన సిమ్రాన్‌ అత్యంత సక్సెస్‌ ఫుల్‌ హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది. అదే సమయంలో ప్రేమ కథల విషయంలోనూ వార్తల్లో నిలిచింది. అప్పట్లో ఆమె చుట్టూ చాలా ప్రేమ కథలు పుట్టుకొచ్చాయి. 

తాను పని చేసిన హీరోలతో ఆమె ప్రేమలో పడినట్టు, రహస్య ప్రేమ వ్యవహారాలు నడిపినట్టు వార్తలు వచ్చాయి. చాలా మంది హీరోలతో సిమ్రాన్‌ రొమాంటిక్‌ రిలేషన్స్ ని మెయింటేన్‌ చేసిందన్నారు. 

అందులో భాగంగా మొదట అబ్బాస్‌తో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. సిమ్రాన్‌ తమిళంలో నటించిన తొలి చిత్రం `వీఐపీ`, ఇందులో ప్రభుదేవా, అబ్బాస్‌ హీరో. అబ్బాస్‌కి జోడీగా సిమ్రాన్‌ నటించింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్‌ అయ్యింది. 

ఇద్దరు ప్రేమలో ఉన్నారనే ప్రచారం జరిగింది. అంతేకాదు ఇద్దరు పెళ్లి చేసుకుంటారనే రూమర్స్ వచ్చాయి. అబ్బాస్‌.. సిమ్రాన్‌ని మ్యారేజ్‌ చేసుకోవాలనుకున్నాడట. కానీ సన్నిహితుల సలహా మేరకు ఆయన సిమ్రాన్ కి బ్రేకప్‌ చెప్పాడట.

46
రాజు సుందరం మాస్టర్‌తోనూ సిమ్రాన్‌ డేటింగ్‌

ఆ తర్వాత కొన్ని రోజులకు ప్రభుదేవా సోదరుడు, డాన్స్ మాస్టర్‌ రాజు సుందరం ఆమె ప్రేమలో పడ్డాడట. సిమ్రాన్‌ నటించిన చాలా సినిమాలకు రాజు సుందరం డాన్స్ మాస్టర్ గా పనిచేశారు. అంతేకాదు హీరోగా `ఐ లవ్యూ దా` వంటి సినిమాలో నటించారు. 

ఈ క్రమంలో సిమ్రాన్‌తో ఆయన ప్రేమలో పడ్డారట. చాలా కాలం పాటు ఈ ఇద్దరు లవ్‌ స్టోరీని నడిపించారని టాక్‌. వీరు కూడా పెళ్లి వరకు వెళ్లారట. ప్రభుదేవా, నయనతారల ప్రేమ వ్యవహారం పెద్ద రచ్చకావడంతో.. రాజు సుందరం మాస్టర్‌ సిమ్రాన్‌కి గుడ్‌ బై చెప్పాడట. 

56
కమల్‌ హాసన్‌తోనూ రొమాన్స్ చేసిన సిమ్రాన్‌

మరోవైపు లోకనాయకుడు కమల్‌ హాసన్‌ తోనూ సిమ్రాన్‌ ఎఫైర్‌ పెట్టుకుందని అంటున్నారు. ఈ ఇద్దరు కలిసి `పంచతంత్రం` చిత్రంలో నటించారు. ఇందులో రెచ్చిపోయి రొమాన్స్‌ చేశారు. 

ఆ కెమిస్ట్రీ చూశాక ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారనే రూమర్స్ వచ్చాయని ప్రముఖ జర్నలిస్ట్ చెయ్యర్‌ బాలు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

వీటి అన్నింటికి పుల్‌ స్టాప్‌ పెడుతూ సిమ్రాన్‌ 2003లో తన చిన్ననాటి స్నేహితుడు దీపక్‌ బగ్గాని వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కొడుకులు. పెళ్లి తర్వాత సిమ్రాన్‌ సినిమాలు తగ్గించింది. 

కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉంది. మళ్లీ కొంత కాలం తర్వాత సెకండ్‌ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి మెప్పిస్తుంది. ఇటీవల `టూరిస్ట్ ఫ్యామిలీ`తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకుని సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కింది.

66
సిమ్రాన్‌ తెలుగులో నటించిన సినిమాలు

సిమ్రాన్‌ తెలుగులో కూడా చాలా సినిమాలే చేసింది. చిరు, బాలయ్య, వెంకీ, నాగార్జున ఇలా దాదాపు అందరితోనూ కలిసి నటించింది. ఆమె తెలుగులో `సమరసింహారెడ్డి`, `కలిసుందాం రా`, `నువ్వు వస్తావని`, `యువరాజు`, `నరసింహనాయుడు`, `ప్రేమతో రా`, `బావ నచ్చాడు`, `డాడీ`, `సీమ సింహం`, `సీతయ్య`, `ఒక్క మగాడు` వంటి సినిమాలు చేసి ఆకట్టుకుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories