దిల్‌రాజు.. నితిన్ హీరోగా `తమ్ముడు` చిత్రాన్ని నిర్మించారు. తమ్ముడు శిరీష్‌తో కలిసి దీన్ని తెరకెక్కించారు. వేణు శ్రీరామ్ దర్శకుడు. ఈ మూవీ జులై 4న విడుదల కానుంది. ఈ మూవీతో ఒకప్పటి హీరోయిన్ లయ రీఎంట్రీ ఇస్తున్నారు.
ఇందులో ఆమె నితిన్‌కి అక్కగా నటిస్తున్నారు. కన్నడ నటి సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ని సోమవారం నిర్వహించారు.
ఇందులో దిల్ రాజు మాట్లాడుతూ, `తమ్ముడు` సినిమాతో హిట్ కొట్టబోతున్నట్టు తెలిపారు. నితిన్ గత నాలుగైదు సినిమాలు ఆడలేదు, దీంతో కొంత లో లో ఉన్నాడు. ఇప్పుడు ఈ మూవీతో ఆయన బౌన్స్ బ్యాక్ అవుతారని, సినిమా చూసుకున్నామని, కచ్చితంగా హిట్ కొట్టబోతున్నామని తెలిపారు.