`తమ్ముడు`లో నితిన్‌తోపాటు మరో ఐదుగురు హీరోలు.. క్రేజీ ట్విస్ట్ ఇచ్చిన డైరెక్టర్‌

Published : Jul 01, 2025, 06:15 AM IST

నితిన్‌ హీరోగా `తమ్ముడు` చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు వేణు శ్రీరామ్‌. అయితే ఇందులో నితిన్‌తోపాటు మరో ఐదుగురు హీరోలుంటారట. ఆ కథేంటంటే? 

PREV
15
పవన్‌ కళ్యాణ్‌ టైటిల్‌తో నితిన్‌ `తమ్ముడు`

నితిన్‌ హీరోగా `తమ్ముడు` మూవీ రూపొందింది. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు, శిరీష్‌ ఈ మూవీని నిర్మించారు. పవన్ కళ్యాణ్‌ నటించిన `తమ్ముడు` మూవీ టైటిల్‌ని ఈ చిత్రానికి పెట్టడంతో కొంత బజ్‌ ఏర్పడింది. 

ఈ చిత్రంతో లయ రీఎంట్రీ ఇస్తుండగా, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, కీలక పాత్రలు పోషిస్తున్నారు. జులై 4న ఈ చిత్రం విడుదల కానుంది. సినిమాపై నమ్మకంతో ఉన్న నిర్మాత దిల్‌ రాజు జులై 3నే ప్రీమియర్స్ వేయబోతున్నట్టు తాజాగా `తమ్ముడు` ట్రైలర్‌ ఈవెంట్‌లో తెలిపారు.

25
`తమ్ముడు`లో నితిన్‌తోపాటు ఐదుగురు హీరోలు

దర్శకుడు వేణు శ్రీరామ్‌ సోమవారం మీడియాతో మాట్లాడుతూ మరికొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ మూవీ స్క్రీన్‌ ప్లే విషయంలో కమల్‌ హాసన్‌ `విక్రమ్‌` సినిమాని ఫాలో అయ్యారట. 

అదే సమయంలో నితిన్‌ ఒక్కడే హీరో కాదు, మరో ఐదుగురు ఉన్నారని చెప్పి షాకిచ్చారు. ఆయన చెబుతూ, `ఈ కథలో హీరోతో పాటు ఐదుగురు లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, స్వసిక విజయన్, దిత్య ముఖ్యమైన పాత్రలు చేశారు. 

హీరో అంటే ఇంత లెంగ్త్ ఉండాలి అనేది `తమ్ముడు`లో ఉండదు. హీరోతో పాటు ఐదుగురు ఉమెన్ క్యారెక్టర్స్ బలంగా ఉంటాయి. `విక్రమ్` సినిమాలో కమల్ హాసన్ క్యారెక్టర్ కథలో ఎలా ట్రావెల్ అవుతుందో అలా మా మూవీలోనూ ఉంటుంది` అని తెలిపారు.  

35
పేపర్‌లో ఆర్టికల్‌ స్ఫూర్తితో `తమ్ముడు` కథ

కథ గురించి దర్శకుడు చెబుతూ, `తమ్ముడు` కథ విని దిల్ రాజు  బడ్జెట్ గురించి ఆలోచించకుండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. అంతకుముందు మా కాంబోలో `ఐకాన్` మూవీ కోసం వర్క్స్ చేశాం. ఆ తర్వాత ఈ మూవీ స్టార్ట్ చేశాం. 

ఈ కథకు సెట్ అయ్యే హీరో కోసం సెర్చ్ జరిగింది. నితిన్ బాగుంటాడని తీసుకున్నాం. ఓ దినపత్రికలో వచ్చిన ఆర్టికల్ స్ఫూరితో ఈ కథను సిద్ధం చేసుకున్నా. కథ ప్రకారమే `తమ్ముడు` టైటిల్ పెట్టాం. 

సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. ట్రైలర్ లో కథ ఎలా ఉండబోతుందో చెప్పాం. సెన్సార్ వాళ్లు కొన్ని కట్స్ చెప్పారు. మేము ఆ కట్స్ వద్దు అనుకున్నాం. 

ఒప్పుకుంటే `యు బై ఎ` సర్టిఫికెట్ ఇచ్చేవాళ్లు. సినిమాలోని ఎస్సెన్స్ ను సరిగ్గా ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లాలనే కట్స్ లేకుండా `ఎ` సర్టిఫికెట్ తీసుకున్నాం` అని తెలిపారు వేణు శ్రీరామ్.

45
సీనియర్‌ హీరోయిన్‌ రిజెక్ట్ చేస్తే లయ ఎంట్రీ

`లయ పాత్ర కోసం ఒకప్పటి స్టార్ హీరోయిన్ కి కథ చెప్పాను. ఆమెకు స్టోరీ, క్యారెక్టర్ నచ్చింది కానీ తన పర్సనల్ రీజన్స్ వల్ల నటించలేదు. ఆ తర్వాత లయ ప్రాజెక్ట్ లోకి వచ్చారు. తను బాగా సపోర్ట్ చేసి మూవీ ఫినిష్ చేసింది. 

ఈ సినిమాలో ఫైట్స్ ను ఎపిసోడ్స్ ఫీల్ ఉండేలా రూపొందించాం. ఈ ఫైట్ సీక్వెన్సులు మంచి ఇంపాక్ట్ ఉంటాయి. కథను కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించాలనే ప్రయత్నిస్తుంటాను. నా స్క్రిప్ట్స్ లో ఫీమేల్ క్యారెక్టర్స్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇందులోనూ అలానే ఉంటాయి` అని చెప్పారు.

55
నితిన్‌కి కమ్‌ బ్యాక్‌ మూవీ `తమ్ముడు`

`తమ్ముడు` చిత్రంలో ఆర్చరీ పెట్టడంపై వేణు శ్రీరామ్‌ రియాక్ట్ అవుతూ, `మిగతా స్పోర్ట్స్ కంటే ఆర్చరీకి మెంటల్ గా, ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ గా, ఏకాగ్రతతో ఉండాలి. గాలి వచ్చే దిశను, వేగాన్ని కూడా అంచనా వేయగలగాలి. 

విలువిద్య చాలా పురాతనమైనది, రాముడు, అర్జునుడి కాలం నుంచీ చూస్తున్నాం. ఆర్చరీని కథలో ఇన్ క్లూడ్ చేయాలని చాలా రోజులుగా అనుకున్నాం. `తమ్ముడు`లో కుదిరింది. ఆర్చరీ ట్రైనర్ తో నితిన్ కు 15 రోజులు ట్రైనింగ్ ఇప్పించాం. తను చాలా బాగా చేశాడు. ఆయనకిది మంచికమ్‌ బ్యాక్‌ మూవీ అవుతుంది. 

ఇక సినిమా ఫారెస్ట్ లో షూటింగ్ చేసినప్పుడు అందరికీ గాయాలు అయ్యాయి. రోడ్లు సరిగ్గా లేక, వెహికిల్స్ అక్కడి దాకా వెళ్లలేక ఇబ్బందులు పడ్డాం. ఈ మూవీకి సేదు, సమీర్ రెడ్డి, గుహన్ కెమెరామెన్స్ గా పనిచేశారు. 

ఏ కెమెరామెన్ వచ్చినా నా దగ్గరున్న విజువల్ టెంప్లేట్ తో "తమ్ముడు" మూవీ విజువల్ గా బ్యూటిఫుల్ గా తెరకెక్కించాం. ఈ మూవీ ఆడియెన్స్ కి కొత్త ఎక్స్ పీరియెన్స్ ఇస్తుంది. అలరిస్తుంది` అని తెలిపారు దర్శకుడు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories