Silk Smitha: షూటింగ్ చాలా సీరియస్ గా జరుగుతుంది.. బాలకృష్ణ, సిల్క్ స్మితకు మధ్య సన్నివేశం. కానీ సడెన్ గా బాలయ్యను సిల్క్ తిట్టడం స్టార్ట్ చేసింది. చెడా మడా తిట్టేస్తోంది. సెట్ లో అంతా షాక్.. డైరెక్టర్ వెంటనే బ్రేక్ ఇచ్చి ఏం చేశాడంటే?
ఫిల్మ్ ఇండస్ట్రీ సముద్రం లాంటిది.. అదొక సెపరేట్ వరల్డ్.. ఎన్నో సినిమాలు, షూటింగ్ లో,మర్చిపోలేని సంఘటను.. తవ్వినా కొద్ది వస్తూనే ఉంటాయి. కొన్ని సంఘటనలు మాత్రం ఎప్పటికీ అలా గుర్తుండిపోతాయి. అలాంటి ఒక ఆసక్తికరమైన సంఘటనను నందమూరి బాలకృష్ణ ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. 'ఆదిత్య 369' సినిమా షూటింగ్ సమయంలో నటి సిల్క్ స్మిత, బాలకృష్ణను ఇంగ్లీషులో ఘాటుగా తిట్టిన విషయాన్ని బాలయ్య బయటపెట్టారు. ఆ సమయంలో సెట్‌లో ఉన్నవారంతా షాక్‌కు గురైన సంఘటన గురించి ఆయన వివరించారు.
24
తెలుగు సరిగ్గా రాక సిల్క్ స్మితకు ఇబ్బందులు..
బాలకృష్ణ వెల్లడించిన వివరాలు ప్రకారం.. ఆదిత్య 369 సినిమాలో సిల్క్ స్మిత కేవలం ఒక ఐటమ్ సాంగ్‌కే పరిమితం కాకుండా, సింహనందిని అనే ఒక పూర్తి స్థాయి పాత్రను పోషించారు. ఆ సినిమాలో ఆమెకు ఒక కీలకమైన సీన్ ఉంది. అందులో బాలకృష్ణ పోషించిన కృష్ణ కుమార్ పాత్రను ఉద్దేశించి ఆమె "ఈ నీచుడు, ఈ దుర్మార్గుడు, ఈ నికృష్టుడు" అంటూ తెలుగులో పెద్ద డైలాగ్ చెప్పాల్సి ఉంది. అయితే ఆ సమయంలో సిల్క్ స్మితకు తెలుగు అంతగా రాదు . పైగా ఆ డైలాగ్‌లో ఉన్నది తెలుగు మాత్రమే కాదు కాస్త గ్రాంథికం భాష కూడా కావడంతో ఆమెకు పలకడం చాలా కష్టంగా అనిపించింది
34
బాలయ్యను చెడామడా తిట్టేసిన సిల్క్..
షూటింగ్ టేక్ ప్రారంభం కాగానే, సిల్క్ స్మిత ఆ తెలుగు డైలాగ్‌ను పూర్తిగా మర్చిపోయింది. భావోద్వేగంతో డైలాగ్ చెప్పాల్సిన ఆ సీన్ లో, ఆమె తెలుగుకు బదులుగా ఇంగ్లీషులోకి మారిపోయి.. బాలకృష్ణను చూపిస్తూ.. "దిస్ ఫూల్, దిస్ ఇడియట్, దిస్ బాస్టర్డ్, దిస్ రాస్కల్" (This fool, This idiot, This bastard, This rascal) అంటూ చాలా కోపంగా తిట్టేసింది. ఆవేశంతో అలా తిట్టేసి, ఆ తర్వాత డైరెక్టర్ వైపు తిరిగి "డైరెక్టర్ గారు.. ఓకేనా అండి?" అని చాలా సాదాసీదాగా అడిగింది.
సిల్క్ స్మిత నోటి వెంట బాలకృష్ణ లాంటి స్టార్ హీరోపై ఆ రేంజ్ ఇంగ్లీష్ తిట్లు వినేసరికి సెట్‌లో ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏం మాట్లాడాలో తెలియక అందరూ కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు. అప్పుడు డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారు స్పందిస్తూ, నవ్వుతూ "ఓకే ఏంటమ్మా.. నువ్వు మాట్లాడిందంతా ఇంగ్లీషు, పైగా అన్ని తిట్లే తిట్టావు" అని చెప్పారు. ఆ తర్వాత సెట్‌లో అందరూ నవ్వుకున్నారు. ఈ విషయాన్ని బాలకృష్ణ గుర్తుచేసుకుంటూ ఆ సమయంలో ఆ సీన్ చాలా సరదాగా సాగిందని నవ్వేశారు .