I Nobody Movie Review: ఐ నోబడీ మూవీ రివ్యూ, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటించిన మూవీ ఎలా ఉందంటే?

Published : Jul 10, 2026, 07:43 AM IST

I Nobody Movie Review: `సలార్‌`తో తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకున్న పృథ్వీరాజ్‌ సుకుమార్‌ నటించిన `ఐ నోబడీ` మూవీ నేడు విడుదలైంది. మరి తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో పృథ్వీరాజ్‌ సక్సెస్‌ అయ్యాడా? 

PREV
17
ఐ నోబడీ మూవీ రివ్యూ

మలయాళ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ మల్టీటాలెంటెడ్‌గా రాణిస్తున్నారు. ఆయన హీరోగా, దర్శకుడిగా, రైటర్‌గా, నిర్మాతగా రాణిస్తున్నారు. నటుడిగా విభిన్న పాత్రలు పోషిస్తున్నారు. హీరోగానే కాదు విలన్‌గానూ మెప్పిస్తున్నారు. ఆ మధ్య `సలార్‌`లో ప్రభాస్‌తో కలిసి నటించాడు. ఇప్పుడు మహేష్‌ తో `వారణాసి`లో విలన్‌గా నటిస్తున్నారు. దర్శకుడుగా `లూసీఫర్‌ 2`తో సంచలనాలు క్రియేట్‌ చేశారు. ఈ క్రమంలో మలయాళంలో ఆయన నటించిన లేటెస్ట్ మూవీ `ఐ నోబడీ`. ఈ సినిమాకి ఆయనే నిర్మాత. పృథ్వీరాజ్‌ ప్రొడక్షన్స్, ఈ4 ఎక్సపరిమెంట్స్ బ్యానర్స్ పై సుప్రియ మీనన్‌, ముఖేష్‌ ఆర్‌ మెహతా, సీవీ సారథి నిర్మాణంలో నిసం బషీర్‌ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. ఈ చిత్రం మలయాళంలో గురువారమే విడుదలైంది. తెలుగులో నేడు శుక్రవారం(జులై 10) న రిలీజ్‌ అయ్యింది. మరి ఈ మూవీ ఎలా ఉంది? తెలుగు ఆడియెన్స్ ని అలరించిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

27
ఐ నోబడీ మూవీ కథ

రాజీవ్‌(పృథ్వీరాజ్‌ సుకుమారన్‌) ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఆయన భార్య మీరా(పార్వతి తిరువొతు) కూడా ప్రైవేట్‌ జాబ్‌ చేస్తుంది. వీరికి ఇద్దరు పిల్లలు. చాలా మధ్యతరగతి కుటుంబం. సింపుల్‌ గా లైఫ్‌ని లీడ్‌ చేస్తుంటారు. అయితే రాజీవ్‌ భార్య మీరాకి మరో వ్యక్తితో ఎఫైర్‌ ఉంటుంది. ఈ విషయం రాజీవ్‌కి తెలుస్తుంది. దీంతో అతన్ని బెదిరించడానికి బ్యాంక్‌కి వెళ్తాడు రాజీవ్‌. అదే సమయంలో ఆ బ్యాంక్‌లో దొంగతనం చేయడానికి ముగ్గురు దొంగలు వస్తారు. రూ.17కోట్లు దొంగిలిస్తారు. అదే సమయంలో రాజీవ్‌ని కొట్టి బంధించి తీసుకెళ్తారు. మధ్యలో అతన్ని వదిలేసి వెళ్లిపోతారు. అయితే రోడ్డు ప్రమాదంలో ఆ ముగ్గురు దొంగలు చనిపోతారు. దీంతో ఈ రాబరీలో రాజీవ్‌కి ప్రమేయం ఉందని చెప్పి పోలీసులు అతన్ని విచారిస్తుంటారు. నానా రకాలుగా వేధిస్తుంటారు. దీని కారణంగా రాజీవ్‌ ఫ్యామిలీ కూడా ఇబ్బంది పడుతుంది. మరోవైపు డబ్బు కోసం కొందరు కస్టమర్లు, జాబ్‌ పోయిన పోలీసులు కూడా వెతుకుతుంటారు. మరి తనకు చేయని తప్పుకి రాజీవ్‌ ఎలా బలి అయ్యాడు? తన ఈ గండం నుంచి ఆయన ఎలా గట్టెక్కాడు, తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? అసలు డబ్బు కాజేసింది ఎవరు? అనేది మిగిలిన కథ.

37
ఐ నోబడీ మూవీ విశ్లేషణ

మనీ చుట్టూ తిరిగే కథలతో చాలా కాలంగా సినిమాలు వస్తూనే ఉంటాయి. డబ్బుల కోసం చాలా మంది గ్యాంగ్ లు వేటాడటం, డబ్బుల మిస్సింగ్‌ కేసుని విచారించే కథలతో చాలా సినిమాలు వచ్చాయి. అడపాదడపా వస్తూనే ఉన్నాయి. అయితే ఇవి కొన్ని ఫన్నీగా ఉంటే, కొన్ని థ్రిల్లర్‌గానూ ఉంటాయి. ఈ మూవీ యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో సాగుతుంది. అయితే ఇందులో అన్ని అంశాలున్నాయి. ఫ్యామిలీ ఎలిమెంట్లు ఉన్నాయి, సెంటిమెంట్‌, ఎమోషన్స్, యాక్షన్‌, థ్రిల్లర్‌ ఇలా అన్నీ కనిపిస్తాయి. అదే సమయంలో అదిరిపోయే ట్విస్ట్ లు కూడా ఉన్నాయి. కమర్షియల్‌ అంశాలను కూడా జోడించి చేసిన చిత్రమిది అని చెప్పొచ్చు. రొటీన్‌కి భిన్నంగా ఈ మూవీని తెరకెక్కించారు. అదే ఈ మూవీలో హైలైట్‌ పాయింట్‌గా చెప్పొచ్చు. సినిమా బ్యాంక్‌ రాబరీ సీన్‌ నుంచే ప్రారంభం అవుతుంది. ఆరంభం నుంచే ప్రేక్షకుడిని కథలోకి లాగేస్తుంది. తొలి సన్నివేశం నుంచే `తర్వాత ఏం జరుగుతుంది?`, `ఆ డబ్బు ఏమైంది?`, హీరో ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్నాడు?, ఈ సమాజం ఇంత క్రూరంగా ఎందుకు మారింది? అనే ప్రశ్నలు వరుసగా తలెత్తుతాయి. సమాజం ఒక వ్యక్తిని ఎలా వేటాడుతుందో, అవకాశమొస్తే ఎలా పీక్కుతింటుందో ఎంతో వాస్తవికంగా చూపిస్తూ కథ వేగంగా ముందుకు సాగుతుంది. అయితే కథ ముందుకు వెళ్లేకొద్దీ ఇంటర్వెల్ బ్లాక్ ఎలా ఉండబోతుందో ప్రేక్షకుడు ముందే ఊహించగలుగుతాడు. ద్వితీయార్ధం మొత్తం హీరో ఈ వ్యవస్థ నుంచి ఎలా బయటపడతాడు? సమాజం అతనిపై వేసిన ముద్రను ఎలా చెరిపేస్తాడు? తన కుటుంబానికి మళ్లీ సాధారణ జీవితం ఎలా అందిస్తాడు? అనే అంశాల చుట్టూ తిరుగుతుంది.

47
ఐ నోబడీ మూవీలో ప్లస్‌, మైనస్‌లు

ఫస్ట్ హాఫ్‌లో కనిపించిన ఉత్కంఠ, వేగం సెకండాఫ్‌లో అంతగా కనిపించదు. కొన్ని సందర్భాల్లో కథ ముందుకు సాగడం లేదనే భావన కలుగుతుంది. అలాగే కొన్ని లాజికల్ లోపాలు కూడా కనిపిస్తాయి. రోడ్లపై హీరో స్వేచ్ఛగా తిరుగుతున్నా పోలీసులు ఎందుకు గుర్తించలేకపోయారు? సీసీటీవీ ఫుటేజ్‌లో వాహనం కనిపిస్తున్నా దాని ఆధారంగా విచారణ ఎందుకు ముందుకు సాగలేదు? వంటి ప్రశ్నలు తలెత్తుతాయి. అయితే ఈ అంశాలను పక్కన పెడితే సినిమా చివరి వరకు ఆసక్తిని కొనసాగిస్తుంది. క్లైమాక్స్ కూడా కొంతవరకు ముందే ఊహించదగ్గ విధంగా సాగుతుంది. అందువల్ల కొన్ని ట్విస్టులు ఆశించినంత  హైలైట్‌ కాలేదు, థ్రిల్‌ని ఇవ్వలేకపోయాయి. సినిమాలో ప్రస్తుత సమాజ పరిస్థితులను బలంగా ప్రతిబింబించారు. ఒక చిన్న అబద్ధాన్ని లేదా రూమర్‌ను సోషల్ మీడియా ఎలా పెద్ద ప్రచారంగా మారుస్తుందో, ప్రజలు వాటిని ఎంత సులభంగా నమ్మేస్తారో ఇందులో కళ్లకి కట్టినట్టు చూపించారు. సోషల్ మీడియా, ప్రధాన మీడియా, రాజకీయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థలు సమాజంపై చూపే ప్రభావాన్ని సెటైరికల్‌గా ఆవిష్కరించారు. అలాగే డబ్బు మనుషులను ఎలా మార్చేస్తుందో, ఎలాంటి నిర్ణయాలు తీసుకునేలా చేస్తుందో కూడా కథలో చక్కగా చూపించారు.

57
ఐ నోబడీలో నటీనటులు ఎలా నటించారంటే?

 పృథ్వీరాజ్ మరోసారి తన నటనతో మెప్పించారు. రాజీవన్ పాత్రలోని బాధ, పోరాటం, భావోద్వేగాలను ఎంతో సహజంగా ఆవిష్కరించారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో ఆయన పెట్టిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. మీరా పాత్రలో పార్వతి తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నారు. చిన్నారుల పాత్రలు ఎంతో ముద్దుగా అనిపిస్తాయి. పోలీసు అధికారుల పాత్రలు, వృద్ధ దంపతుల పాత్రలు కూడా కథకు బలాన్ని చేకూర్చాయి. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిలో చక్కగా నటించారు.

67
టెక్నీకల్‌గా ఐ నోబడీ మూవీ ఎలా ఉందంటే?

టెక్నికల్‌గా చూస్తే 'ఐ, నోబడీ' అదిరిపోయింది. సహజమైన లొకేషన్లలో చిత్రీకరణ చేయడం వల్ల ప్రతి సన్నివేశం వాస్తవానికి దగ్గరగా అనిపిస్తుంది. బస్సులో వచ్చే ఫైట్ సీన్‌లో విజువల్ ఎఫెక్ట్స్ కొద్దిగా కనిపించినా, లిఫ్ట్‌లోని యాక్షన్ సీక్వెన్స్ మాత్రం ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుంది. జేక్స్ బిజోయ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను మరింత ఎలివేట్ చేస్తుంది. పాటలు పెద్దగా గుర్తుండకపోయినా, ఎడిటింగ్, కాస్ట్యూమ్స్, ప్రొడక్షన్ డిజైన్, నిర్మాణ విలువలు అన్నీ కథకు తగిన విధంగా ఉన్నాయి. 

77
ఫైనల్‌గా

'ఐ, నోబడీ' మంచి సినిమా చూసిన అనుభూతిని మాత్రం ఇస్తుంది. సమాజంలోని లోపాలను కళ్లకి కట్టినట్టు చూపించిన చిత్రమిది. థ్రిల్లర్‌లను ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది.

రేటింగ్‌: 2.75

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories