అప్పుడే ఓటీటీ లోకి సల్మాన్, రష్మిక సికందర్ మూవీ, స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Published : Apr 03, 2025, 09:52 PM ISTUpdated : Apr 04, 2025, 06:23 AM IST

Sikandar OTT Release: సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న నటించిన 'సికందర్' మార్చి 30, న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈసినిమా ప్లాప్ టాక్ ను మూటకట్టుకుంది. అయితే ఈసినిమా ఓటీటీ రిలీజ్  కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా సికందర్  ఓటీటీ  రిలీజ్ పై ఓ విషయం వైరల్ అవుతోంది. 

PREV
13
అప్పుడే ఓటీటీ లోకి సల్మాన్, రష్మిక  సికందర్ మూవీ, స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Sikandar OTT Release:  సల్మాన్ , రష్మిక జంటగా నటించిన సినిమా సికిందర్. మార్చి 30, 2025న రంజాన్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది ఈసినిమా.  ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో కాజల్ అగర్వాల్, ప్రతీక్ బబ్బర్, శర్మన్ జోషి కూడా  నటించారు. థియేటర్లలో పెద్దగా ప్రభావం చూపించని ఈసినిమా  ఓటీటీ విడుదల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీ డిజిటల్ హక్కులు  నెట్ ఫ్లిక్స్  కొనుగోలు చేసిందని పుకార్లు ఉన్నాయి, కాని  ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

Also Read:  రాధిక అల్లుడు ఒక స్టార్ క్రికెటర్ అని మీకు తెలుసా? ఇంతకీ ఎవరా స్టార్ ప్లేయర్ ?

 

23

యావరేజ్ టాక్ తో నడుస్తున్నప్పటికీ.. సికందర్ బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి రోజు రూ. 26 కోట్లు వసూలు చేసింది. రెండో రోజు రూ. 29 కోట్లకు చేరుకుంది. కానీ 4వ రోజు కలెక్షన్స్ మాత్రం గణనీయంగా తగ్గాయి.. ప్రస్తుతం ఈ సినిమా మొత్తం రూ. 82.25 కోట్లు వసూలు చేసింది. రాబోయే వారాల్లో మరింత వసూళ్ళు వచ్చే అవకాశం ఉంది. 

Also Read: బాహుబలి సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో, ప్రభాస్ కంటే ముందు రాజమౌళి ఆఫర్ ఇచ్చింది ఎవరికి?

 

33

సల్మాన్ ఖాన్ హీరోగా గతంలో విడుదలైన సుల్తాన్ (2016), టైగర్ 3 (2023) భారీ ఓపెనింగ్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. వాటితో పోల్చుకుంటే  సికందర్ రూ. 26 కోట్ల వసూళ్లు చాలా  తక్కువ అని చెప్పాలి.  ఈ సినిమా అదే స్థాయిలో విజయం సాధించకపోవచ్చు. కాని ఓటీటీలో  స్ట్రీమింగ్ అయితే మాత్రం మంచి రెస్పాన్స్ వస్తుందన్న ఆశతో ఉన్నారు  అభిమానులు. ఈసినిమా వచ్చే నెలలో ఓటీటీ రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.  

Also Read: మోక్షజ్ఞ కోసం మరో స్టార్ డైరెక్టర్, ఫస్ట్ సినిమా ఎవరితో? బాలయ్య ఏం ప్లాన్ చేశారు?

 

Read more Photos on
click me!

Recommended Stories