ఇటీవల విడుదలైన సిద్ధూ జొన్నలగడ్డ తెలుసు కదా సినిమాపై కాపీ ఆరోపణలు మొదలయ్యాయి. ఓ స్టార్ హీరోయిన్ తన కథని దొంగిలించినట్లు ఓ యువకుడు ఆరోపణలు చేస్తున్నాడు. ఆధారాలు కూడా చూపిస్తున్నాడు. ఆ వివాదం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
టాలీవుడ్ కథలని కాపీ చేసే ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. మహేష్ బాబు శ్రీమంతుడు, బలగం లాంటి చిత్రాల విషయంలో కాపీ ఆరోపణలు వినిపించాయి. ఇప్పుడు తాజాగా సరికొత్త వివాదం మొదలైంది. అది కూడా ఒక ఫ్లాప్ మూవీ విషయంలో. ఇటీవల విడుదలైన ‘తెలుసు కదా’ సినిమా విషయంలో కాపీ, కథని దొంగిలించడం అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలుసు కదా మూవీ కథ తనదే అంటూ ఓ యువకుడు తెరపైకి వచ్చాడు.
25
తెలుసు కదా మూవీ కథ ఇదే
నీరజ కోన డెబ్యూ డైరెక్టర్ గా, సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా తెలుసు కదా చిత్రం తెరకెక్కింది. ఈ మూవీలో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. హీరోకి లవ్ లో బ్రేకప్ జరుగుతుంది. ఆ తర్వాత అతడికి ప్రేమపై నమ్మకం తగ్గుతుంది. కానీ రాశి ఖన్నా పరిచయం కావడంతో ఆమెతో ప్రేమలో పడి వివాహం చేసుకుంటాడు. కానీ ఆమెకి ఉన్న లోపం కారణంగా పిల్లలు కనడం సాధ్యపడదు అని డాక్టర్ తేల్చేస్తుంది. దీనితో సిద్ధూ జొన్నలగడ్డ, రాశి ఖన్నా ప్రత్యామ్నాయంగా సరోగసిని ఎంచుకుంటారు. సరోగేట్ మదర్ గా ఉండేందుకు డాక్టర్ అయిన శ్రీనిధి శెట్టి అంగీకరిస్తుంది. ట్విస్ట్ ఏంటంటే ఆమె.. సిద్దు జొన్నలగడ్డకి మాజీ లవర్. ఆ తర్వాత పరిణామాలు ఎలా మారాయి అనేది మిగిలిన కథ.
35
తెలుసు కదా స్టోరీ నాదే
నీరజ కోన తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. సిద్ధూ జొన్నలగడ్డ మాత్రం పెర్ఫార్మెన్స్ అదరగొట్టాడు. అక్టోబర్ 17న ఈ చిత్రం థియేటర్స్ లోకి వచ్చింది. ఇప్పుడు ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఇన్ని రోజుల తర్వాత ఈ కథ తనదే అంటూ ఓ యువకుడు సంచలన ఆరోపణలు చేస్తున్నాడు. ఆ కథ తనదే అని చెబుతూ కొన్ని ఆధారాలు కూడా చూపిస్తున్నాడు. అతడు చూపిస్తున్న ఆధారాలు సంచలనంగా ఉన్నాయి.
ఆ యువకుడు స్టార్ హీరోయిన్ సమంతనే తన కథ దొంగిలించినట్లుగా చెబుతున్నాడు. ఇంతకీ ఆ యువకుడు ఏం చెబుతున్నాడంటే.. తాను తెలుసు కదా చిత్ర కథని 2020 లోనే సమంత, నాని లాంటి నటులకు.. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరికి, మరికొందరు ప్రొడ్యూసర్లకు చెప్పినట్లు తెలిపాడు. దానికి సంబంధించిన వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్స్ ని ఆధారంగా చూపిస్తున్నాడు. సమంతని కలిసి కథ వినిపించిన స్క్రీన్ షాట్స్ ని, ఆమెతో జరిపిన చర్చలని బయట పెట్టాడు.
55
సమంతే కథ దొంగిలించింది
కానీ సమంత, నాని లాంటి వాళ్ళతో జరిపిన చర్చలు సఫలమైనట్లు లేవు. ఇప్పటికీ ఆ యువకుడు ఆ కథని కొన్ని ప్రొడక్షన్స్ హౌసెస్ కి వినిపిస్తూనే ఉన్నాడట. ఓ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు.. ఈ కథని నువ్వు తెలుసు కదా మూవీ నుంచి కాపీ చేశావా అని అడిగారట. దీనితో ఆ సినిమా గురించి తెలుసుకున్న తనకి హార్ట్ బ్రేక్ అయినట్లు అయిందని తెలిపాడు. సమంతకి కథ వినిపిస్తే ఆమె కథని దొంగిలించి తన బెస్ట్ ఫ్రెండ్ అయిన నీరజ కోనకు చెప్పింది అని.. ఆమె సీన్ టూ సీన్ కాపీ చేసి తెలుసు కదా చిత్రం రూపొందించారు అని ఆ యువకుడు ఆరోపిస్తున్నాడు. ఇప్పుడు ఈ వివాదం ఎంత దూరం వెళుతుందో చూడాలి.