Dharmendra Love Affairs: ధర్మేంద్ర సినిమా జీవితమే కాదు, పర్సనల్ లైఫ్ కూడా చాలా పెద్దదే. అందులో ప్రేమ కథలు చాలానే ఉన్నాయి. ధర్మేంద్ర జీవితంలోకి వచ్చిన హీరోయిన్లు ఎవరు, లవ్ ఎఫైర్స్ గురించి తెలుసుకుందాం.
బాలీవుడ్ హీ-మ్యాన్ ధర్మేంద్ర మరణంతో ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో ధర్మేంద్ర లవ్ స్టోరీస్ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తున్నాయి. అయితే ధర్మేంద్రకి సినిమాల్లోకి రాకముందే పెళ్లి అయ్యింది. ఆయన 1954లో ప్రకాష్ కౌర్‌ని పెళ్లి చేసుకున్నారు. వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి. వీరికే సన్నీడియోల్, బాబీ డియోల్, విజేతా, అజీతా జన్మించారు.
26
ధర్మేంద్ర లవ్ ఎఫైర్స్.. ఫస్ట్ మీనా కుమారి
ధర్మేంద్ర సినిమాల్లో రాణించాక అనతి కాలంలోనే స్టార్ అయిపోయాడు. ఆయన అందంతో ఎంతోమందిని ఆకర్షించాడు. నటుడిగానూ విశేష క్రేజ్ అందుకున్న నేపథ్యంలో హీరోయిన్లు ఆయన వెంటపడేవారట. ఈ క్రమంలో చాలా మంది హీరోయిన్లతో ధర్మేంద్ర లవ్ ట్రాక్‌లు నడిపించారని టాక్. అందులో భాగంగా ఒకప్పుడు ధర్మేంద్రకు మీనా కుమారి అంటే చాలా ఇష్టం. ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో పనిచేశారు. ఆ సమయంలో డేటింగ్ మొదలుపెట్టి, కొంతకాలానికి విడిపోయారట.
36
హీరోయిన్ రాఖీతోనూ లవ్ స్టోరీ న్యూస్
ధర్మేంద్ర, రాఖీలు కలిసి పలు సినిమాలు చేశారు. ఈ క్రమంలో ఇద్దరి స్నేహం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారిందనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే, ఆ తర్వాత ఈ వార్తలను వాళ్ళు ఖండించారు.
ధర్మేంద్ర అప్పట్లో స్టార్ హీరోయిన్ ఆశా పరేఖ్‌తో డేటింగ్ చేశారట. ఈ ఇద్దరు కలిసి తిరిగారని వార్తలొచ్చాయి. అయితే, ఆశాకు అప్పటికే పెళ్లి కావడంతో వారి బంధం ముందుకు సాగలేదు.
56
హేమా మాలినితో స్ట్రక్ అయిపోయిన ధర్మేంద్ర
వీరందరి తర్వాత ధర్మేంద్ర మనసు హేమ మాలినిపై పడింది. ఇద్దరూ డేటింగ్ చేసుకుని, కొంతకాలం తర్వాత పెళ్లి చేసుకున్నారు. తమ పెళ్లి బంధాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. చివరి వరకు కలిసే ఉన్నారు. వీరికి కూతుళ్లు ఈషా డియోల్, ఆహానా డియోల్ జన్మించారు.
66
హేమా మాలిని తర్వాత కూడా?
హేమ మాలినితో పెళ్లి తర్వాత ధర్మేంద్ర పేరు అనితా రాజ్‌తో వినిపించింది. సినిమా షూటింగ్‌లో ఇద్దరూ దగ్గరయ్యారు. ఈ విషయం హేమకు తెలియడంతో ఆమె గట్టి వార్నింగ్ ఇచ్చిందట. దీంతో వీరిద్దరు దూరం కావాల్సి వచ్చింది. ఇలా ఐదుగురు హీరోయిన్లతో ధర్మేంద్ర లవ్ ఎఫైర్స్ నడిపించారని బాలీవుడ్ టాక్. ఇందులో నిజమెంతా అనేది వాళ్లకే తెలియాలి.