పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళతారని అసలు ఊహించలేదు.. గబ్బర్ సింగ్ షూటింగ్ లో ఆయన చెప్పిన విషయాలు ఇవే

Published : Jul 11, 2025, 07:41 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శృతి హాసన్ కలిసి గబ్బర్ సింగ్, కాటమరాయుడు, వకీల్ సాబ్ చిత్రాల్లో కలిసి నటించారు. నటిగా శృతిహాసన్ కి దక్కిన తొలి విజయం గబ్బర్ సింగ్ చిత్రమే.

PREV
15

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శృతి హాసన్ కలిసి గబ్బర్ సింగ్, కాటమరాయుడు, వకీల్ సాబ్ చిత్రాల్లో కలిసి నటించారు. నటిగా శృతిహాసన్ కి దక్కిన తొలి విజయం గబ్బర్ సింగ్ చిత్రమే. కమల్ హాసన్ కూతురుగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టినప్పటికీ శృతిహాసన్ కి వరుస పరాజయాలు ఎదురయ్యాయి. గబ్బర్ సింగ్ చిత్రంతో ఆమె కెరీర్ మారిపోయింది.

25

రీసెంట్ గా ఇంటర్వ్యూలో శృతిహాసన్ పవన్ కళ్యాణ్ గురించి, ఆయన పొలిటికల్ ఎంట్రీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వెళతారని మీరు ఊహించారా అని యాంకర్ శృతిహాసన్ ను ప్రశ్నించారు. శృతిహాసన్ సమాధానం ఇస్తూ.. నేను మొదట నటిగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టాను. అక్కడ నిరాశ ఎదురైంది. ఆ తర్వాత తెలుగులో ఓ చిత్రంలో నటించాను. అది కూడా వర్కౌట్ కాలేదు.

35

యాక్టింగ్ కంటిన్యూ చేద్దామా లేక ఇంకేదైనా ప్రొఫెషన్ చూసుకుందామా అని ఆలోచిస్తున్నాను. ఆ టైంలో నాకు గబ్బర్ సింగ్ చిత్రంలో నటించే అవకాశం దొరికింది. అయితే ఈ చిత్రంలో నేను నటించకూడదని చాలా మంది కోరుకున్నారు. కానీ దర్శకుడు హరీష్ శంకర్ పట్టు పట్టి నన్నే తీసుకున్నారు. ఆ పాత్రలో ఆయన నన్ను ఊహించుకొని బలంగా నమ్మారు.

45

ఒక్క సక్సెస్ దక్కితే చాలు అని అనుకుంటున్న తరుణంలో గబ్బర్ సింగ్ చిత్రం మాసివ్ హిట్ గా నిలిచింది. ఆ మూవీతో నా కెరీర్ మారిపోయింది అని శృతిహాసన్ తెలిపింది. పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా షూటింగ్ లొకేషన్ లో సైలెంట్ గా ఉంటారు. కానీ ఆయన నాతో మాట్లాడినప్పుడు మాత్రం వ్యవసాయం, పల్లెటూర్లు ఇలా రూటెడ్ గా ఉండే విషయాలే ఎక్కువగా చెప్పేవారు. కానీ ఆ టైంలో ఆయన రాజకీయాల్లోకి వస్తారని నేను అస్సలు ఊహించలేదు.

55

కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే మాత్రం ఇలాంటి వ్యక్తులే కదా పాలిటిక్స్ లో ఉండాలి అని అనిపిస్తుంది. ఆయన ఆల్ రౌండర్ అని శృతి హాసన్ పవన్ పై ప్రశంసలు కురిపించింది. 

Read more Photos on
click me!

Recommended Stories