నువ్వు చేస్తున్నది కృష్ణుడి పాత్ర, చెడు వ్యసనాలు మానుకో.. ఎన్టీఆర్ వార్నింగ్ ఇచ్చినా పెడచెవిన పెట్టిన నటుడు

Published : Jul 11, 2025, 06:05 PM IST

రాముడు, కృష్ణుడు ఇలాగే ఉంటారేమో అని అనిపించేంతలా నందమూరి తారక రామారావు ఆ పాత్రల్లో మెప్పించారు. పురాణాలకు సంబంధించిన చిత్రాల్లో ఆయన పోషించని పాత్ర అంటూ లేదు.

PREV
15

రాముడు, కృష్ణుడు ఇలాగే ఉంటారేమో అని అనిపించేంతలా నందమూరి తారక రామారావు ఆ పాత్రల్లో మెప్పించారు. పురాణాలకు సంబంధించిన చిత్రాల్లో ఆయన పోషించని పాత్ర అంటూ లేదు. రాముడిగా, కృష్ణుడిగా, అర్జునుడిగా, భీష్ముడిగా ఇలా ఎన్నో పాజిటివ్ రోల్స్ చేసిన ఎన్టీఆర్.. దుర్యోధనుడిగా, రావణుడిగా నెగిటివ్ రోల్స్ లో కూడా భళా అనిపించారు.

25

రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, శివుడు ఇలా దేవుళ్ళ పాత్రల్లో నటించే సమయంలో ఎన్టీఆర్ ఎంతో నిష్టతో భక్తి శ్రద్ధలతో ఉండేవారట. ఆ సమయంలో మాంసం తినడం, చెప్పులు ధరించడం లాంటివి చేసేవారు కాదట. చెడు వ్యసనాల జోలికి అసలు వెళ్లేవారు కాదు. అందుకే ఆ పాత్రల్లో ఎన్టీఆర్ అంత అద్భుతంగా నటించగలిగారని అందరూ అంటుంటారు.

35

మహాభారతంలో భీష్ముడి ఘనచరిత్ర ని తెలియజేసేలా ఎన్టీఆర్ నటించిన చిత్రం భీష్మ. ఈ మూవీలో టైటిల్ రోల్ పోషించిన ఆయన కృష్ణుడి పాత్రను మాత్రం మరొక నటుడికి ఇచ్చారు. ఆ నటుడు ఎవరో కాదు హరనాథ్. ఈయన కూడా ఎన్టీఆర్ తర్వాత కృష్ణుడు, రాముడి పాత్రలతో ఎంతో మంచి గుర్తింపు పొందారు. అద్భుతమైన అవకాశాలు అందుకుంటున్న తరుణంలో హరనాథ్ కెరీర్ సడన్ గా పడిపోయింది. చిత్ర పరిశ్రమలో కొందరు హరనాథ్ ఎదగకుండా తొక్కేసారని అప్పట్లో ప్రచారం జరిగింది.

45

దీని గురించి సీనియర్ రచయిత ఎస్వి రామారావు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హరనాథ్ కెరీర్ పడిపోవడానికి కారణం ఎవరో కాదు ఆయన చేసుకున్న స్వయంకృతాపరాధమే. హరనాథ్ ఎవరు చెప్పిన వినేవారు కాదు తాను చేయాలనుకున్నదే చేసేవారు.

భీష్మ చిత్రంలో కృష్ణుడి పాత్రలో నటిస్తున్నప్పుడు ఎన్టీఆర్ ఆయనకి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. నువ్వు చేస్తున్నది కృష్ణుడి పాత్ర గుర్తుపెట్టుకో.. ఈ పాత్ర చేస్తున్నన్ని రోజులు మద్యం, సిగరెట్ లాంటి వ్యసనాలకు దూరంగా ఉండు అని ఎన్టీఆర్.. హరనాథ్ ని హెచ్చరించారు.

55

ఎన్టీఆర్ వార్నింగ్ ఇచ్చినప్పటికీ హరనాథ్ మారలేదు. విపరీతంగా మద్యం సేవించేవారు. దీనివల్ల కొంతకాలానికి తన బాడీ మీద ఆయనే కంట్రోల్ కోల్పోయారు. ముఖంలో కళ తగ్గిపోయింది. అందువల్లే హరినాథ్ కి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి అని ఎస్వి రామారావు అన్నారు. కానీ ఎన్టీఆర్ అలా కాదు పురాణాలకు సంబంధించిన పాత్రలో నటిస్తుంటే ఆ పాత్రకి ఎలా అవసరమో అలా కంట్రోల్ గా ఉండేవారు. రాముడు, కృష్ణుడు పాత్రలో నటిస్తున్నప్పుడు భక్తి శ్రద్ధలతో ఉండే ఎన్టీఆర్.. దుర్యోధనుడు, రావణుడు లాంటి పాత్రలు చేస్తున్నప్పుడు మాత్రం నిజంగా రాక్షసుడు లాగానే తిండి తినేవారు అని ఎస్వీ రామారావు తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories