పెళ్ళికి ముందే స్టార్ హీరోకి పుట్టిన నటి, 40 ఏళ్ల సెన్సేషనల్ హీరోయిన్ ఎవరో తెలుసా?

Published : Jan 28, 2026, 10:20 AM IST

సౌత్ స్టార్ హీరోయిన్  40 వ ఏడాదిలోకి అడుగు పెట్టింది. స్టార్ సీనియర్ హీరో వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. హీరోయిన్ గా, సింగర్ గా, సత్తా చాటుతోంది. ఇంతకీ ఎవరా బ్యూటీ..?  

PREV
16
కమల్ హాసన్ వారసురాలిగా..

40వ ఏడాదిలోకి అడుగుపెట్టింది స్టార్ హీరోయిన్  శ్రుతి హాసన్.  ఇండియన్ స్టార్ సీనియర్ హీరో కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. సొంత ట్యాలెంట్ తో ఎదిగింది బ్యూటీ. అయితే శృతీ హాసన్ కమల్ కు పెళ్లికి ముందే కలిగిన సంతానం.  సారిక, కమల్ హాసన్‌ లివ్-ఇన్‌లో ఉన్నప్పుడే సారిక గర్భవతి అయింది.

26
శ్రుతి హాసన్‌కు 2 ఏళ్ల వయసులో

శ్రుతి హాసన్‌కు 2 ఏళ్ల వయసులో ఆమె తల్లిదండ్రులు పెళ్లి చేసుకున్నారు. 1988లో కమల్, సారిక పెళ్లి  చేసుకోగా.. వారికి  రెండో కూతురు అక్షర జన్మించింది. చాలాకాలం కలిసి ఉన్నాక, 2004లో శ్రుతి తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు.

36
స్టార్ హీరో కూతురు అని తెలియకుండా...

స్కూల్లో చదివేటప్పుడు తాను ఫేక్ పేరు వాడినట్టు శ్రుతి హాసన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. తాను ఫిల్మ్ స్టార్స్ కూతురునని ఎవరికీ తెలియకూడదనే అలా చేసినట్టు చెప్పింది. ఆమె తన పేరును పూజా రామచంద్రన్‌గా మార్చుకుంది. ఆతరువాత కాలంలో ఆమె తన అసలు పేరును రివిల్ చేసినట్టు సమాచారం.. 

46
ప్లేబ్యాక్ సింగర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి..

శ్రుతి 6 ఏళ్లకే ప్లేబ్యాక్ సింగర్‌గా కెరీర్ మొదలుపెట్టింది. ఆతరువాత కాలంలో  'హే రామ్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెరమీదకు వచ్చింది. కొన్ని సినిమాల్లో బాలనటిగా కనిపించిన శ్రుతి హాసన్..  2009లో 'లక్'తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. 'గబ్బర్ ఈజ్ బ్యాక్' లాంటి సినిమాలు చేసినా, బాలీవుడ్‌లో మాత్రం సక్సెస్ కాలేదు.

56
టాలీవుడ్ లో శృతీ హాసన్ సినిమాలు?

హిందీతో పాటు సౌత్ సినిమాల్లోనూ శ్రుతి నటించింది. 2011లో 'అనగనగా ఓ ధీరుడు'తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత, గబ్బర్ సింగ్  బలుపు, ఎవడు, రేసుగుర్రం, క్రాక్, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, సలార్ లాంటి హిట్స్ కొట్టింది.

66
శ్రుతి హాసన్ వర్క్‌ఫ్రంట్

శ్రుతి హాసన్ వర్క్‌ఫ్రంట్ చాలా భారీగా ఉంది. వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో కూడా ఆమె నటిస్తోంది. ప్రస్తుతం తే, ఆమె 'ట్రైన్', 'సలార్ 2: శౌర్యాంగ పర్వం' సినిమాల్లో కనిపించనుంది. రీసెంట్ గా  రజనీకాంత్ హీరోగా వచ్చిన 'కూలీ' సినిమాలో కూడా ఆమె నటించింది. 40 ఏళ్లు వచ్చినా.. పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ హీరోయిన్.. రెండు సార్లు ప్రేమలో పడి.. బ్రేేకప్ చెప్పేసింది. 

Read more Photos on
click me!

Recommended Stories