Illu Illalu Pillalu Today Episode Jan 28: అమూల్యను అర్థరాత్రి ఎత్తుకెళ్లి నిజస్వరూపం చూపించిన విశ్వక్

Published : Jan 28, 2026, 09:22 AM IST

Illu Illalu Pillalu Today Episode Jan 28: ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో  అమూల్యను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయాడు విశ్వక్. తన నిజస్వరూపాన్ని అమూల్యకు చూపిస్తాడు. రామరాజు చావును చూస్తానని అంటాడు. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోండి. 

PREV
14
వల్లి భాగ్యం వరస్ట్ ప్లాన్

ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో వల్లి, భాగ్యం కలిసి అమూల్యని ఎలాగైనా విశ్వక్ దగ్గరికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తారు. ఇందుకోసం ఇంట్లో కరెంటు తీసేస్తారు. కరెంటు తీసేసాక తిరుపతి లేవడం, వీళ్లు దాక్కుకోవడం ఇలా కాస్త ఫన్నీగా కాసేపు సాగుతుంది. తర్వాత నర్మద నీళ్ల కోసం లేస్తుంది. నర్మద నుంచి కూడా వీరిద్దరూ తెలివిగా తప్పించుకుంటారు. ఈలోపు ప్రేమ గదిలో లేచి కొవ్వొత్తి వెలిగిస్తుంది. అమూల్యను తీసుకొస్తానని వల్లి చీకట్లో నెమ్మదిగా పిల్లిలాగా వెళుతుంది. ఈలోపు ధీరజ్ కూడా లేస్తాడు. ఇద్దరూ కాసేపు మళ్లీ సరదాగా గొడవ పడతారు. రామరాజు ధీరజ్ ను పిలిచి కరెంటు పోయింది వెళ్లి ఫీజు చూసి రమ్మని చెబుతాడు. ప్రేమను టార్చ్ లైట్ తీసుకురమ్మని చెప్పి ధీరజ్ ఫీజు చూసేందుకు సిద్ధమవుతాడు.

అమూల్య రూమ్‌లో భయపడుతూ కూర్చునే ఉంటుంది. ఆమె దగ్గరకు వల్లి వస్తుంది. అమూల్య నిన్ను తీసుకెళ్లడానికే మేము కరెంటు తీశాము, నీకు దండం పెడతాను ఒక్కసారి బయటికి రా అని అమూల్యను బతిమిలాడుతుంది. దాంతో అమూల్య ఇష్టం లేకపోయినా వల్లితో వెళుతుంది. భాగ్యం వల్లి అమూల్యను తలుపు తీసి ఇంటి నుంచి బయటకు తీసుకు వస్తారు. ఈ లోపు బయట ప్రేమ, ధీరజ్ కలిపి ఫీజు చూసేందుకు వస్తారు. టార్చ్ లైట్ పెట్టుకుని ప్రేమ రావడంతో భాగ్యం,వల్లి, అమూల్య భయపడతారు. ముగ్గురు గోడ చాటుకు వెళ్లి దాక్కుకుంటారు. ఇద్దరూ కలిసి ఫీజు చెక్ చేస్తూ ఉంటారు ప్రేమ, ధీరజ్. ప్రేమకు మనిషి నీడ కనబడడంతో అనుమానిస్తుంది. ధీరజ్ కు చెబితే అతడు ఏమీ పట్టించుకోడు.

24
విశ్వక్ నిజస్వరూపం

అమూల్యను తీసుకొని వల్లి, భాగ్యం గేట్ నుంచి బయటికి వస్తారు. అక్కడ విశ్వక్ బౌన్సర్లతో పాటు వెయిట్ చేస్తూ ఉంటాడు. భాగ్యం ‘ముందు మా ఆయనను వదిలిపెట్టు’ అని అడుగుతుంది. ఇడ్లీ బాబాయిని కట్లు విప్పి బయటకు తీసుకొస్తారు బౌన్సర్లు. విశ్వక్ అమూల్యతో మాట్లాడాలని చెబుతాడు. దీంతో వల్లి అమూల్యను వెళ్ళమని చెబుతుంది. ‘ఎందుకని అన్నిసార్లు ఫోన్ చేస్తున్నావ్. అయినా నువ్వు ఏం మాట్లాడాలి నాతో’ అని గట్టిగా అడుగుతుంది. ‘నీకోసం నీ ప్రేమ కోసం నేను ఎంతో చేశాను. నువ్వు లేకుండా నేను బతకలేను అని చెప్పాను. పగలు రాత్రి నీ గురించి ఆలోచించాను. మా ఇంట్లో వాళ్ల చేత తన్నులు కూడా తిన్నాను. మరి నువ్వు సడన్ గా మనసు మార్చుకుని వేరే పెళ్లి కాదు సిద్ధపడుతున్నావ్. నిన్న రాత్రి ఫోన్ చేసినప్పుడు కూడా నువ్వు సరే అన్నావ్. మనం లేచిపోయి పెళ్లి చేసుకుందామంటే సరే అన్నావ్.’ అని అంటాడు విశ్వ. 

దానికి అమూల్య మాట్లాడుతూ ‘అవును సరే అన్నాను. ఆ తర్వాతే నాకు అర్థమైంది. నేను ఏం దూరం చేసుకుంటున్నానో అని. మా నాన్న నామీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఎంతో ప్రేమ పెంచుకున్నాడు. నా పెళ్లి జరుగుతుందని ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అంతా పండుగ వాతావరణం ఉంది. ఇప్పుడు నేను నీతో వచ్చేస్తే అంత నాశనం అయిపోతుంది. అందుకే నాకు ఇష్టం లేదు’ అని చెబుతుంది అమూల్య.

34
నన్నెందుకు ప్రేమించావు

‘మరలాంటి దానివి నాకు నన్ను ప్రేమిస్తున్నావని ఎందుకు చెప్పావు’ అని అడుగుతాడు విశ్వ. దానికి అమూల్య ‘నువ్వు నా వెంట పడ్డావు. నన్ను ప్రేమిస్తున్నానని అన్నావు. నాకు అర్థం కాలేదు. నేను ప్రేమిస్తున్నానని చెప్పాను.. కానీ ఇప్పుడు అంతా అర్థం అయ్యాక నేను చేస్తున్నది కరెక్ట్ కాదనిపిస్తోంది. అయినా ఇప్పుడు ఏమైంది? చిన్న పిల్లాడిలా చేయకు. అర్థం చేసుకో. నేను మా అమ్మ నాన్నలు చేసిన చూసిన సంబంధమే చేసుకుంటాను’ అని తేల్చి చెప్పేస్తుంది అమూల్య. వదిన వెళ్దాం పదండి అని ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది అమూల్య.

దానికి విశ్వక్ తన నిజ స్వరూపాన్ని బయటపెడతాడు. అమూల్య చెయ్యి పట్టుకుని గట్టిగా లాగుతాడు. ఎక్కడికి వెళ్ళేది, నేను భద్రావతి మేనల్లుడిని. నిన్ను అంత సులువుగా వదిలిపెట్టను అని అంటాడు. అమూల్య చెయ్యిని విడిపించడానికి భాగ్యం, వల్లి చాలా ప్రయత్నిస్తారు. కానీ అమూల్యను బౌన్సర్లు విశ్వక్ కలిపి కారులో ఎక్కించి తీసుకెళ్లిపోతారు. దీంతో వల్లి చాలా భయపడిపోతుంది. తెల్లారితే పెళ్లి.. ఇప్పుడు అమూల్యను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. ఇప్పుడు ఏం చెప్పాలి. నువ్వు నా కాపురాన్ని నాశనం చేసావ్ అని భాగ్యాన్ని తిడుతుంది వల్లి. భాగ్యం ‘అరవకు.. పద మనం ఇక్కడ ఉన్న సంగతి ఎవరూ చూడకముందే వెళ్లిపోవాలి’ అని అందరూ ఇంట్లోకి వెళ్లిపోతారు.

44
తాళి పట్టుకుని విశ్వక్

ఇక్కడ నుంచి సీన్ అమూల్య దగ్గరికి మారుతుంది. అమూల్యను గదిలోకి తీసుకొచ్చి మంచం మీదకి తోసేస్తాడు. ఆమె ఎదురుగా కూర్చుని తన నిజస్వరూపం చూపిస్తాడు. ‘నువ్వు నీ నిజ స్వరూపం చూపించావు కదా ఇప్పుడు నా నిజస్వరూపం చూపిస్తాను. మీ ఇల్లు అన్నా, మీ ఇంట్లో వాళ్ళ అన్నా.. నాకు అసహ్యం. ముఖ్యంగా మీ నాన్నంటే ఇంకా అసహ్యం. ఇదంతా మా అత్తయ్య ప్లాన్. ఈ ప్లాన్ ప్రకారం మీ వదిన సహకారంతో నిన్ను నా బుట్టలో పడేసుకున్నాను. పంజరంలో పడిన చిలకా చిక్కినట్టే చిక్కి ఇప్పుడు ఎగిరిపోతానంటే ఎలా వదిలేస్తాను. నిన్ను పెళ్లి చేసుకుని అనాధను చేసి మీ నాన్న కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేయాలి. అదే నా ప్లాన్’ అని చెబుతాడు. దానితో అమూల్య ఏడుస్తూ ‘ఇదంతా పగతో చేసావా నామీద ప్రేమతో చేసినట్టు నమ్మించావు కదా’ అని అంటుంది. 

దానికి విశ్వక్ ‘అవును నటించాను. నువ్వు కూడా నన్ను ప్రేమించినట్టు నటించావు కదా. కానీ ఈరోజు నువ్వు కూడా మారిపోయావు కదా. అందుకే మీ ఫ్యామిలీ అంటే నాకు అసహ్యం. ఒక మాట మీద ఉండరు. మీ నాన్న మా అత్తయ్యని లేపుకుపోయాడు. మీ అన్నయ్య నా చెల్లెల్ని లేపుకుపోయాడు. ఇప్పుడు నేను కూడా వాళ్లకి ఆ నొప్పి ఎలా ఉంటుందో చూపించాలని ఇదంతా చేశాను. లేకపోతే నేను నిన్ను ప్రేమించడం ఏంటి?’ అంటాడు. ‘ఇప్పుడు చూడు తెల్లారి పెళ్లి పీటల మీద కూర్చోవాల్సిన పెళ్లికూతురు కనపడకపోయేసరికి ఊరు ఊరంతా మీ నాన్న మీద ఉమ్మేస్తుంది. అది తట్టుకోలేక మీ నాన్న గుండె పగిలి చస్తాడు’ అని విశ్వ అంటాడు. ఇదంతా చూసి అమూల్య ఏడుస్తూ ఉంటుంది. కోపంతో లేచి విశ్వను కొడుతుంది. దాంతో విశ్వక్ అమూల్య మెడ పట్టుకొని తోసేస్తాడు. తాళి పట్టుకుని అమూల్య దగ్గరికి వస్తాడు. ఇక్కడితో ఎపిసోడ్ ముగిసిపోతుంది

Read more Photos on
click me!

Recommended Stories