అప్పుడు సామ్రాట్ రేపు ఉదయాన్నే మనం ఒక ప్రాజెక్టు మీద విలేజ్ కి వెళ్ళాలి రెడీగా ఉండండి అని అబద్ధం చెబుతాడు. మరొకవైపు అనసూయ,పరంధామయ్య వారి పనులు చేసుకుంటుండగా నందు అక్కడే ఉండి లాప్టాప్ లో పనిచేసుకుంటూ ఉంటాడు. అప్పుడు పరంధామయ్య అనసూయ సరదాగా జోకులు వేసుకొని నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలోనే ఫుడ్ డెలివరీ బాయ్ అక్కడికి వచ్చి ప్రేమ్ అనే వ్యక్తి ఫుడ్ ఆర్డర్ చేశాడు అని అనగా నందు ఆలోచనలో పడతాడు. అప్పుడు నందు లోపలికి వెళ్ళగా ప్రేమ్ ఆర్డర్ చేశాడా అని అనడంతో అవును అనగా గెస్ చేశాను అని అంటే ఎలా గెస్ చేసావు లాస్య అనడంతో నువ్వే చెప్పు నందు మనం ఉన్న పరిస్థితులలో ఒక్కొక్కరికి ఒక్కొక్క వంటకాలు అవసరమా అని అంటుంది లాస్య.