Guppedantha Manasu: వసుధార విషయంలో మరొక మాస్టర్ ప్లాన్ వేసిన దేవయాని.. కోపంతో రగిలిపోతున్న మహేంద్ర?

First Published Dec 13, 2022, 9:31 AM IST

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు డిసెంబర్ 13వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
 

ఈ రోజు ఎపిసోడ్లో రిషి, వసుధార చేతులు పట్టుకుని ఈ రిషి ఉండగా నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అయినా ఏంటి నువ్వు మీ మేడం దగ్గర కూర్చుంటే ఎలా నాకు కూడా కనిపించాలి కదా అని అంటాడు రిషి. ఎందుకు సార్ అని వసుధార అడగగా ఏమో నాకు తెలియదు నువ్వు కొద్దిసేపు కనిపించకపోతే నాకు ఎలాగో ఉంటుంది ఊపిరి ఆడడంతగా ఉంటుంది అని అంటాడు. గతంలో రిషి అన్న మాట తలుచుకొని నవ్వుతూ ఉంటుంది వసుధార. అప్పుడు ఎందుకు నవ్వుతున్నావు అని రిషి అడగడంతో ఏమీ లేదు సార్ అని అంటుంది వసుధార. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు.
 

 ఏంటి సార్ కొత్తగా మాట్లాడుతున్నారు అని అనగా నువ్వు నా జీవితంలోకి వచ్చిన రోజు ప్రతి రోజు కొత్తగా ఉంటుంది అని అంటాడు రిషి. అలా వారిద్దరు సరదాగా నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వసుధార రిషి భుజం పై తలపెట్టి నవ్వుతూ ఉంటుంది. ఇక మరుసటి రోజు ఉదయం కాలేజీలో మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు విషయంలో మీటింగ్ ని ఏర్పాటు చేస్తారు. అప్పుడు రిషి ఇన్ని రోజులు జగతి మేడం మిషన్ ప్రాజెక్టుని  చూసుకున్నారు అని అనగా అదేంటి ఇన్ని రోజులు అంటున్నాడు మరి ఇప్పుడు ఎవరు చూసుకుంటున్నారు అని కాలేజీ స్టాఫ్ గుసగుసలాడుతూ ఉండడంతో వెంటనే రిషి నా ఒక్క ప్రశ్నతో మీ అందరి చాలా ప్రశ్నలు తలెత్తవచ్చు.
 

అప్పుడు అందరికీ సమాధానాలు తెలియాలంటే నేను ఒక వీడియో చూపిస్తాను అని జగతి మాట్లాడిన వీడియో ని చూపిస్తాడు రిషి. ఆ వీడియోలో జగతి ఎడ్యుకేషన్ పాలిటి నుంచి తాను తప్పుకొని ఆ ప్లేస్లో వసుధారని నియమిస్తున్నట్లు చెప్పడంతో కాలేజీ స్టాఫ్ ఒక్కసారిగా షాక్ అవుతారు. అందరూ విన్నారు కదా ఈ విషయంలో అందరూ ఏకాభిప్రాయానికి వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను అని అంటాడు రిషి. ఇంతలోనే మినిస్టర్ రిషి కి ఫోన్ చేసి వసుధార ని జగతి ప్లేస్ లో పెట్టాలి అనుకున్న విషయం కరెక్టే కానీ ని విషయంలో రేపటి రోజున అధికారులు ప్రశ్నిస్తే మన దగ్గర సమాధానం ఉండదు అని అనగా రిషి ఆశ్చర్యపోతాడు.
 

మీకు ఇష్టం వచ్చిన వారిని నియమిస్తారా అని అడిగితే మన దగ్గర సమాధానం ఉండదు కదా అనడంతో అవును సార్ అని అంటారు రిషి. ఇప్పుడు రిషి కాల్ కట్ చేయగా ఏమయింది అని మహీంద్ర, ఫణీంద్ర అడగడంతో వెంటనే రిషి మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్గా వసుధారని నియమించడం కరెక్ట్ కాదు అని అంటున్నారు అనడంతో మహేంద్ర ఆశ్చర్యపోతాడు. ఆ మాట విన్న కాలేజీ స్టాఫ్ నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు మహేంద్ర ఇప్పుడు ఏం చేద్దాం రిషి అని అడగడంతో ఓటింగ్ పెడదాము అని అంటాడు రిషి. అప్పుడు మెజారిటీ ప్రకారం ఎవరైతే వసుధార హెడ్ గా ఉండాలి అనుకుంటున్నారో దాని ప్రకారం చేద్దామని చెప్పి అక్కడి వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత వసుధార ఆలోచించుకుంటూ బయటకు వెళ్తూ ఉండగా ఇంతలోనే కాలేజీలో స్టాఫ్ దేవయానికి ఫోన్ చేసి అసలు విషయం చెప్పడంతో ఆ మాటలు విన్న వసుధార షాక్ అవుతుంది. మేడం వసుధార నియామకం మీద అభ్యంతరం ఉన్నట్టు మినిస్టర్ గారికి మెయిల్ చేశాము అనగా ఆ మాట విని వసుధార షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు మహేంద్ర జరిగిన విషయాన్ని జగతి చెప్పి బాధపడుతూ ఉంటాడు. అప్పుడు జగతి కూడా బాధపడుతూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు అని మహేంద్ర అనగా ఇంతలోనే అక్కడికి వసుధార వస్తుంది.
 

అప్పుడు మహేంద్ర స్వారీ వసుధార ఇలా అవుతుందని అనుకోలేదు అనడంతో వెంటనే వసుధార దీనంతటికీ కారణం దేవయాని మేడం అనడంతో మహేంద్ర షాక్ అవుతాడు. అప్పుడు వసుధార జరిగింది మొత్తం వివరించగా మహేంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఎలా అయినా వాళ్లకు గుణపాఠం చెప్పాలి అని మహేంద్ర అక్కడి నుంచి వెళుతుండగా వద్దు అని అడ్డుపడుతుంది. ఈ విషయం మనకు తెలిసిందని దేవయాని మేడంకు తెలిస్తే ఈ విషయాన్ని కూడా తనకు అనుగుణంగా మార్చుకుంటారు వద్దు సార్ అని అంటుంది వసుధార.
 

 మరొకవైపు జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ రిషి టెన్షన్ పడుతూ ఉంటాడు.  ఏదేమైనా ఈ సవాల్ ని ఎదుర్కోవాలి అని అనుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి వసుధార వస్తుంది. అప్పుడు వసుధార ఈ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కి హెడ్ గా నేను ఉండడం అవసరమా అని అనగా ఏంటి అలా మాట్లాడుతున్నావో వసుధార అని అంటాడు రిషి. ఎందుకో తెలియడం లేదు కానీ నాకు ఈ హోదాలు ఓటింగ్ లు ఇవన్నీ అవసరం లేదని అనిపిస్తుంది అని అంటుంది వసుధార. వేరే ఎవరినైనా ఆ స్థానంలో నియమించండి అనడంతో అయిందా ఇంకా ఉందా అని అడుగుతాడు రిషి. ఎందుకు నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు అని అనగా ఈ విషయంలో లేనిపోని తలనొప్పులు ఎందుకని సార్ అని అంటుంది.

 రిషి సార్ ఈ విషయంలో దేవయాని మేడం హస్తము ఉందని తెలిస్తే మేడం మీ విషయంలో ఇంకా నిన్ను బాధ పెడుతుంది అందుకే ఏం చెప్పలేకపోతున్నాను అనుకుంటూ ఉంటుంది వసుధార. ఈ విషయంలో నువ్వేం మాట్లాడొద్దు వసుధార అని అంటాడు రిషి. ఈ విషయంలో నువ్వు ఎన్ని చెప్పినా నేను వినను ఒక్కసారి నేను ఏదైనా అనుకున్న తర్వాత దాని జోలికి కూడా వెళ్ళను అనుకుంటూ ఉంటారు రిషి. ఓటింగ్ జరగాలి జరిపి తీరుతాను అని అంటాడు. ఆ తర్వాత మీటింగ్ హాల్లో వసుధార విషయంలో మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టుకి హెడ్గా ఉండాలా లేదా అని ఓటింగ్ నిర్వహిస్తూ ఉంటాడు రిషి. ఇప్పుడు రిషి మీలో ఎవరైతే వసుధార హెడ్ గా ఉండాలి  అనుకుంటున్నారో వారు వచ్చి ఎస్ అని పెట్టండి వద్దు అనుకున్నవారు న నో అని టిక్ పెట్టండి అని పనీంద్రతో మొదలు పెడతాడు రిషి. తర్వాత ఒక్కొక్కరుగా వెళ్లి వసుధరకి ఓటింగ్ చేస్తూ ఉంటారు.

click me!