సూర్య సినిమాతో 7 ఏళ్ల తర్వాత శ్రియ రీఎంట్రీ!

First Published | Nov 20, 2024, 9:28 PM IST

సూర్య 44: ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న త‌న 44వ చిత్రంలో న‌టిస్తున్నారు సూర్య‌.

సూర్య 44

సౌత్ స్టార్ హీరో  సూర్య న‌టించిన "కంగువా" మూవీ రిలీజ్ అయ్యి నాలుగు రోజులు అవుతోంది.  ప్ర‌పంచ వ్యాప్తంగా 150 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించిన ఈ చిత్రం ప్ర‌స్తుతం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దూసుకుపోతుంది. ఇక  సూర్య త‌న నెక్ట్స్ మూవీ ప‌నుల‌ను వేగ‌వంతం చేశారు. ఇప్ప‌టికే సూర్య 44వ చిత్ర షూటింగ్ ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. యంగ్ డైరెక్టర్  కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో  సూర్య సరికొత్తగా కనిపించబోతున్నారు. 

Also Read: విజయ దేవరకొండ సినిమాలో బాలకృష్ణ,

కంగువా

2025లో సూర్య నటిస్తోన్న ఈసినిమా రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టికే అండ‌మాన్ త‌దిత‌ర ప్రాంతాల్లో ఈ చిత్ర షూటింగ్ జ‌రుగుతుండ‌గా, ఈ చిత్రంలో సూర్య లుక్ ఇప్ప‌టికే విడుద‌లైంది. కోలీవుడ్‌లో ప‌లు సూప‌ర్ హిట్ చిత్రాల‌ను అందించిన కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో తొలిసారి సూర్య న‌టిస్తుండ‌టంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ సినిమా లో హీరోయిన్ ఎవరు అన్న విషయంలో బారీ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. 

Also Read: నయనతార డాక్యుమెంటరీకి నెట్‌ఫ్లిక్స్ ఎంత డబ్బు ఇచ్చింది?


సూర్య 44 చిత్రం

ఈ సినిమాలో శ్రియా శరణ్  నటించబోతున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ లో తన సినిమా ప్రయాణం స్టార్ట్ చేసిన శ్రీయా ఆతరువాత తమిళ సినిమాల్లో కూడా స్టార్ హీరోయిన్ గా రాణించింది. తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించి ఈ బ్యూటీ.. ఓ పారెన్ వ్యాపార‌వేత్త‌ను వివాహం చేసుకుని కొంత కాలం ఫ్యామిలీ లైఫ్ కే పరిమితం అయ్యింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ సినిమాల్లో న‌టించ‌డం ప్రారంభించారు. ఆర్ ఆర్ ఆర్ లో అజయ్ దేవగణ్ భార్యగా నటించి మెప్పించింది శ్రీయా శరణ్. 

Also Read:అమల తల్లి ఏదేశానికి చెందిన మహిళ, అమల ఇండియన్ కాదా..?

శ్రియ శ‌ర‌ణ్

తెలుగులో సరే.. తమిళ తెరపై శ్రీయా కనిపించక చాలా కాలం అవుతోంది.  ఈ నేప‌థ్యంలో దాదాపు ఏడేళ్ల త‌ర్వాత ప్ర‌స్తుతం సూర్య న‌టిస్తున్న 44వ చిత్రంలోని ఒక పాట‌లో తాను నృత్యం చేసిన‌ట్లు శ్రియ శ‌ర‌ణ్ ఒక ఇంట‌ర్వ్యూలో తెలిపారు. ఏడేళ్ల త‌ర్వాత త‌మిళ చిత్రంలో మ‌ళ్లీ న‌టించ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని, న‌టుడు సూర్య‌తో తొలిసారి క‌లిసి న‌టిస్తున్న‌ట్లు శ్రియ శ‌ర‌ణ్ చెప్పారు.

Also Read: పుష్ప 2 కోసం రష్మిక మందన్నా రెమ్యునరేషన్...? స్టార్ హీరోయిన్లు కూడా షాక్ అయ్యేలా శ్రీవల్లి పారితోషికం

Latest Videos

click me!