మహేష్‌ బాబు రిజెక్ట్ చేసిన సినిమాతో డిజాస్టర్‌ని ఫేస్‌ చేసిన రామ్‌ చరణ్‌, తండ్రి కారణంగా అడ్డంగా బుక్కయ్యాడా?

Published : Nov 20, 2024, 09:16 PM IST

మహేష్‌ బాబు తన కెరీర్‌లో చాలా సినిమాలు రిజెక్ట్ చేశారు. అయితే ఓ సినిమా మాత్రం చాలా ప్రత్యేకం. ఆ మూవీ చేసి రామ్‌ చరణ్‌ బోల్తా పడ్డారు.   

PREV
15
మహేష్‌ బాబు రిజెక్ట్ చేసిన సినిమాతో డిజాస్టర్‌ని ఫేస్‌ చేసిన రామ్‌ చరణ్‌, తండ్రి కారణంగా అడ్డంగా బుక్కయ్యాడా?

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు తన కెరీర్‌లో చాలా సినిమాలు రిజెక్ట్ చేశాడు. ఆయన రిజెక్ట్ చేసిన సినిమాల్లో చాలా వరకు పరాజయం చెందాయి. ఒకటి రెండు మూవీస్‌ మాత్రం పెద్ద హిట్‌ అయ్యాయి. కానీ మేజర్‌గా నెగటివ్‌ ఫలితాలను ఫేస్‌ చేసిన సినిమాలే ఉన్నాయి. అయితే ఓ సినిమా విషయంలో మహేష్‌ చాలా తెలివిగా తప్పించుకున్నాడు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

25

మహేష్‌ బాబు రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్ చాలానే ఉన్నాయి. లేటెస్ట్ మూవీస్‌లో మాత్రం `పుష్ప`, `జనగణమన` వంటి సినిమాలున్నాయి. దీంతోపాటు మరో సినిమా ఉంది. మహేష్‌ రిజెక్ట్ చేసిన ఆ సినిమాలో రామ్‌ చరణ్‌ నటించారు. దారుణమైన డిజాస్టర్‌ని ఫేస్‌ చేశాడు. మరి ఆ సినిమా ఏంటనేది చూస్తే, 
 

35
Acharya movie

ఆ సినిమానే `ఆచార్య`. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన మూవీ ఇది. కొరటాల శివ దర్శకుడు. ఈ సినిమాలో కీలక పాత్రలో రామ్‌ చరణ్‌ నటించాడు. ఇందులో ఆయన పాదఘట్టం సేవకుడు సిద్ధ పాత్రలో నటించారు. ఆయనకు జోడీగా పూజా హెగ్డే చేసింది. ఈ పాత్రకు ముందుగా మహేష్‌ని అడగ్గా ఆయన నో చెప్పారు. సాడ్‌ ఎండింగ్‌ కావచ్చు, నక్సల్‌గా కనిపించాలనేది కావచ్చు, మహేష్‌ రిజెక్ట్ చేశాడు. 
 

45

దీంతో రామ్‌ చరణ్‌ చేత నటింప చేశారు. చరణ్‌ కూడా తండ్రి కోసం చేశారు. చిరంజీవి హీరోగా తెరకెక్కిన మూవీ కావడంతో, అభిమానులు కూడా వీరి కాంబినేషన్‌ని చూడాలనుకుంటున్నారు. అందుకే ఇద్దరు కలిసి నటించారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ మూవీ డిజాస్టర్‌ అయ్యింది. `ఆర్‌ఆర్‌ఆర్‌` వంటి సక్సెస్‌ అందుకున్న చరణ్‌ని ఇలాంటి పాత్రల్లో ఆడియెన్స్ చూడలేకపోయారు. వారి అంచనాలకు తగ్గట్టుగానూ సినిమా లేకపోవడంతో బాక్సాఫీసు వద్ద ఘోరమైన ఫలితాన్ని చవి చూడాల్సి వచ్చింది. అలా మహేష్‌ ఓ పెద్ద డిజాస్టర్‌ నుంచి తెలివిగా తప్పించుకున్నాడని చెప్పొచ్చు. 
 

55

మహేష్‌ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా (ఎస్‌ఎస్‌ఎంబీ29)కి ప్రిపేర్‌ అవుతున్నాడు. ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ లో జక్కన్న బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది ఈ మూవీ ప్రారంభం కానుంది. దీంతోపాటు రామ్‌ చరణ్‌ `గేమ్‌ ఛేంజర్‌` చిత్రంలో నటిస్తున్నారు. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఇది సంక్రాంతికి విడుదల కానుంది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.

Read More: బాలకృష్ణకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్‌ ఎవరో తెలుసా? ఆయన ఒక్కరినే కలుస్తాడా? విశ్వక్‌ సేన్‌, సిద్దు కాదు

also read: 500 ఏళ్లలో మగజాతి అంతరించిపోతుందా? సీనియర్‌ నటుడు చెప్పిన పచ్చినిజాలు, నిద్ర లేవకపోతే ఇక అంతే

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories