ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీయ ఇలా కనిపిస్తే చాలు.. చిరునవ్వుతోనే షేక్ చేస్తోంది

First Published Sep 2, 2021, 6:53 PM IST

అందాల తార శ్రీయ శరన్ గురించి పరిచయం అవసరం లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా శ్రీయ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తోంది. టాలీవుడ్ స్టార్స్ అందరి సరసన నటించి ఓ వెలుగు వెలిగిన నటి శ్రీయ. 

అందాల తార శ్రీయ శరన్ గురించి పరిచయం అవసరం లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా శ్రీయ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తోంది. టాలీవుడ్ స్టార్స్ అందరి సరసన నటించి ఓ వెలుగు వెలిగిన నటి శ్రీయ. 

ఇటీవల ఆమెకు టాలీవుడ్ లో అవకాశాలు తగ్గాయి. అప్పుడప్పుడూ మాత్రమే కనిపిస్తోంది. శ్రీయ చివరగా పైసా వసూల్, గాయత్రి లాంటి చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత పూర్తిస్థాయి పాత్రలో తెలుగులో నటించలేదు. 

ఎట్టకేలకు శ్రీయ చాలా గ్యాప్ తర్వాత తెలుగు మూవీలో కనిపించబోతోంది. శ్రీయ కీలక పాత్రలో నటించిన గమనం చిత్ర ప్రెస్ మీట్ నేడు జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో ప్రధాన పాత్రల్లో నటిస్తున్న శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్ తోపాటు శ్రీయ శరన్ ఇతర చిత్ర యూనిట్ హాజరయ్యారు. 

శ్రీయ చాలా కాలం తర్వాత తెలుగు మీడియా ముందుకు రావడంతో ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శ్రీయ రెడ్ డ్రెస్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. 

శ్రీయ చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోస్ కి యువత ఫిదా అవుతున్నారు. వాలు చూపుతో కొంటె గాలం వేయడంలో శ్రీయ ఫేమస్. ఆమె చిరునవ్వుకు కుర్రాళ్లు దాసోహమైపోతున్నారు. 

ఇక శ్రీయ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ లో శ్రీయ లుక్ కూడా బయట పడింది. 

click me!