Karthika Deepam: హిమ గురించి నిజం తెలుసుకున్న శౌర్య.. గుండెలకు హత్తుకొని కన్నీళ్లు పెట్టిన జ్వాల!

Published : Jul 15, 2022, 07:59 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథా నేపథ్యం లో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జులై 15వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
17
Karthika Deepam: హిమ గురించి నిజం తెలుసుకున్న శౌర్య.. గుండెలకు హత్తుకొని కన్నీళ్లు పెట్టిన జ్వాల!

ఈ రోజు ఎపిసోడ్ లో హిమ(hima)ను భోజనం చేయడానికి సౌందర్య, ఆనందరావు లు ఎంత పిలిచినా కూడా రాకుండా తర్వాత తింటాను అని అంటుంది. అప్పుడు వెంటనే సౌర్య(sourya) నానమ్మ రమ్మని చెప్పు అని సౌందర్యకీ చెబుతుంది. దాంతో సౌందర్య, హిమ ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు హిమ ఆనందంగా వచ్చి భోజనం చేయడానికి కూర్చుంటుంది. అప్పుడు హిమ నాకు ఎదురుగా నా కళ్ళలోకి చూస్తూ తినమని చెప్పు అప్పుడు చేసిన ప్రతి ద్రోహం గుర్తుకు వస్తుంది అనడంతో హిమ బాధపడుతుంది.
 

27

 మరొకవైపు నిరుపమ్(nirupam), హిమ ఫోటో వైపు జరిగిన విషయాలు గురించి తలచుకొని బాధపడుతూ ఉంటాడు. మరొకవైపు హిమ కూడా సౌర్య నీ తలచుకొని సౌర్య నా మీద నీకు కోపం ఎప్పుడు తగ్గుతుందో తెలియదు అని సౌర్య తలుచుకునే ఎమోషనల్ అవుతుంది. ఆ తరువాత సౌందర్య, ఆనంద్ రావ్(anand rao) లు కూడా హిమ, సౌర్య గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు.
 

37

అప్పుడు సౌర్య(sourya), హిమ లను కొంచెం నిదానంగా అయినా ఇద్దరినీ ఒకటి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. మొదట్లోనే ప్రయత్నాలు మొదలుపెడితే సౌర్య కోసం మళ్ళీ ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది అని అనుకొని బాధపడుతూ ఉంటారు. మరోవైపు హిమ,సౌర్య కోసం తాను గుర్తు చేసుకుని తనలో తానే మాట్లాడుకుంటూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే ఆనంద్ రావ్ లు హిమ(hima), సౌర్య ల కోసం కొత్త బట్టలు తీసుకుని వస్తారు.
 

47

అప్పుడు సౌందర్య(soundarya) వెళ్ళి సౌర్య కొత్త బట్టలు ఇచ్చి సంతోషపడుతుంది. మరొకవైపు ప్రేమ్ తన సెల్ఫీ వీడియో గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఆనందరావు ఇచ్చిన కొత్తబట్టలను హిమ వేసుకుని వస్తుంది. ఆ తరువాత హిమ సౌందర్య ఆనందరావు(anad rao) దగ్గరికి వెళ్లి ఎందుకు కొత్త డ్రెస్ వేసుకోమన్నారు అని అడుగడంతో ఏమీ లేదు అని అంటూ ఉండగా ఇంతలో సౌర్య కూడా అలాంటి డ్రెస్సే వేసుకుని రావడంతో అది చూసి హిమ సంతోష పడుతూ ఉండగా సౌర్య కోపంతో రగిలిపోతూ ఉంటుంది.
 

57

 అప్పుడు సౌర్య(sourya) ఆనంద్ రావు తో డ్రెస్సులు ఒకటే అయితే మనసులు కలవాలి కదా చేసిన ద్రోహం తిడుతుందా అంటూ హిమ పై సీరియస్ అవుతుంది.  ఆ తరువాత సౌర్య అక్కడి నుంచి వెళ్లిపోవడంతో హిమ కూడా నిరుపమ్ కాల్ చేయడంతో వెళ్ళిపోతుంది. ఆ తరువాత స్వప్న(swapna),ప్రేమ్ నీ నిరుపమ్ విషయం లో ఆలోచించావా లేదా అని టెన్షన్ టెన్షన్ గా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ప్రేమ వాళ్ళిద్దరికీ ఎట్టి పరిస్థితులను పెళ్లి జరగదు అనడంతో స్వప్న సంతోష పడుతూ ఉంటుంది.
 

67

మరొకవైపు నిరుపమ్,హిమ(hima) ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి సౌర్య వస్తుంది. అప్పుడు నిరుపమ్ ఎంత మాట్లాడుతున్న హిమ వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సౌర్య కోపంతో ఇంటికి రావడంతో సౌందర్య ఏంటి అప్పుడే వచ్చావు అని అడగగా కాస్త వెటకారంగా సమాధానం చెబుతుంది. ఇంతలోనే అక్కడికి హిమ రాగా సౌందర్య(soundarya) వాళ్ళు మాట్లాడుతుండగా ఏమి మాట్లాడకుండా కోపంతో వెళ్లిపోతుంది.
 

77

అప్పుడు వారిద్దరూ కాస్త సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు సౌర్య, హిమ(hima) పై కోపంతో ఫోటోకి బాణాలు విసురుతూ ఉండగా ఇంతలో హిమ అక్కడికి వచ్చి అంత కోపం నా మీదకీ విసురేయ్ నన్ను చంపేయ్ అని ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో సౌర్యకీ,నిరుపమ్(nirupam) ఐ లవ్ యు అని చెప్పడంతో సౌర్య షాక్ అవుతుంది. నేను నిన్ను హిమ అనుకునే ఐ లవ్ యు చెప్పాను అని అనడంతో శౌర్య బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత హిమ,సౌర్య గురించి నిరుపమ్ కీ చెప్పి పెళ్లి చేసుకోమని చెబుతుంది. ఆ మాటలు విన్న శౌర్య  హిమ నీ ఎమోషనల్ తో హత్తుకుంటుంది.

click me!

Recommended Stories