ఇలియానా లైఫ్‌లో జరిగిందే పూజా కెరీర్‌లో జరిగింది.. టెన్షన్ పెడుతున్న బుట్టబొమ్మ ఫ్యూచర్‌?

Published : Jul 14, 2022, 11:22 PM ISTUpdated : Jul 15, 2022, 04:47 AM IST

ఇలియానా ఒకప్పుడు టాలీవుడ్‌ని ఊపేసింది. తిరుగులేని ఇమేజ్‌తో ఓ ఊపు ఊపింది. ఇప్పుడు పూజా హెగ్డే సైతం టాలీవుడ్‌ని షేక్‌ చేస్తుంది. తన అందాలతో, క్రేజ్‌తో టాలీవుడ్‌ మొత్తాన్ని తన చుట్టూ తిప్పుకుంటోంది. కానీ వీరిద్దరి కెరీర్‌ ఒకేలా సాగడం ఆసక్తికరంగా మారింది. 

PREV
19
ఇలియానా లైఫ్‌లో జరిగిందే పూజా కెరీర్‌లో జరిగింది.. టెన్షన్ పెడుతున్న బుట్టబొమ్మ ఫ్యూచర్‌?

గోవా బ్యూటీ ఇలియానా(Ileana) ఒకప్పుడు టాలీవుడ్‌లో తిరుగులేని స్టార్‌ హీరోయిన్‌గా వెలిగింది. తన నడుము అందాలతో టాలీవుడ్‌ని షేక్‌ చేసింది. `దేవదాస్‌`, `పోకిరి` వంటి బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్లతో విజయాలు అందుకుని అందరి దృష్టిని ఆకర్షించిన ఈ భామ అందాలు టాలీవుడ్‌లో ఫేమస్‌గా మారడం విశేషం. దీంతో ఇల్లిబేబీకి వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. అనతి కాలంలోనే స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. 
 

29

తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన ఇలియానా తమిళంలో మాత్రం గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. విజయాలు అందుకోలేకపోయింది. ఆమె 2006లో `కేడి` చిత్రంలో రవికృష్ణ హీరోగా నటించారు. ఈ చిత్రం పరాజయం చెందింది. మళ్లీ ఆరేళ్ల వరకు కోలీవుడ్‌  వైపు చూడలేదు. ఆ తర్వాత `3ఇడియట్స్` కి రీమేక్‌ చిత్రాన్ని `నన్బన్‌`(స్నేహితులు)గా తెరకెక్కించారు. విజయ్‌ హీరోగా రూపొందిన ఈ సినిమాకి శంకర్‌ దర్శకత్వం వహించగా, ఇలియానా కథానాయికగా నటించింది. ఈ సినిమా కూడా పరాజయం చెందింది.

39

దీంతో మళ్లీ కోలీవుడ్‌ వైపు చూడలేడు ఇలియానా. తెలుగు, హిందీలోనే ఫోకస్‌ పెట్టింది. ఇక్కడే రాణించింది. ఆ తర్వాత ఆమె చేసిన కొన్ని మిస్టేక్స్ కారణంగా, కొత్తగా వచ్చిన హీరోయిన్ల కారణంగా ఇలియానాకి అవకాశాలు తగ్గిపోయాయి. మరోవైపు ఆమె లవ్‌లో పడటం, బ్రేకప్‌ కావడం, మానసికంగా కృంగిపోవడం వంటి కారణాలతో ఇలియానా కెరీర్‌ డౌన్‌ అయ్యింది. ప్రస్తుతం ఆమె కెరీర్‌ స్ట్రగులింగ్‌లో సాగుతుంది. 

49

మరోవైపు Ileana కెరీర్‌లో జరిగిందే ఇప్పుడు బుట్టబొమ్మ పూజా హెగ్డే(Pooja Hegde) కెరీర్లో జరుగుతుందనే ప్రచారం సోషల్‌ మీడియాలో ఊపందుకుంది. ఇలియానా కెరీర్‌తో పోల్చి చూస్తే అప్పుడు ఆమె సినిమాల మాదిరిగానే పూజా హెగ్డే సినిమాల ట్రాక్‌ ఉందని అంటున్నారు. కంపేరిజన్స్ చూపించి మరి నిరూపిస్తున్నారు నెటిజన్లు. పలు వెబ్‌ మీడియా సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 
 

59

Pooja Hegde హీరోయిన్‌గా ఎంట్రీనే కోలీవుడ్‌ సినిమా `మూగముడి`(మాస్క్) చిత్రంతో పరిచయం అయ్యింది. ఇందులో జీవా సరసన నటించింది పూజా. ఈ చిత్రం సక్సెస్‌ సాధించలేదు. ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `ఒక లైలా కోసం`, `ముకుంద` సినిమాలు చేసింది. ఏకకాలంలో రెండు సినిమాలతో ఆకట్టుకుంది. ఆ తర్వాత హిందీకి ఎంట్రీ ఇచ్చి ఆక్కడ పరాజయం చవిచూసింది. 
 

69

ఆ తర్వాత `డీజే` సినిమాతో తెలుగులో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న పూజా వరుసగా `సాక్ష్యం`, `అరవింద సమేత`, `మహర్షి`, `అల వైకుంఠపురములో`, `గద్దల కొండ గణేష్‌`, `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌`, `ఆచార్య`, `రాధేశ్యామ్‌` చిత్రాల్లో నటించింది. టాలీవుడ్‌ టాప్‌ స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్‌గా నిలిచింది పూజా హెగ్డే. 

79

ఇదిలా ఉంటే సరిగ్గా పదేళ్ల తర్వాత మళ్లీ తమిళంలోకి రీఎంట్రీ ఇచ్చింది పూజా. ఇటీవల విజయ్‌తో `బీస్ట్` చిత్రం చేసింది. కానీ ఇది పరాజయం చెందింది. దీంతో మళ్లీ తమిళ సినిమాకి ఒప్పుకోలేదు. విజయ్‌తో `వారసుడు` చిత్రంలో నటించే అవకాశం వచ్చినా నో చెప్పింది. ఇప్పట్లోమళ్లీ కోలీవుడ్‌లో సినిమాలు చేసే ఆలోచనలో పూజా లేదు. ఇప్పుడు తెలుగు, బాలీవుడ్‌పైనే ఫోకస్‌ పెట్టింది. మరి అప్పుడు ఇలియానా లైఫ్‌లో జరిగినట్టే ఫ్యూచర్‌లో పూజా విషయంలో జరుగుతుందా? అనే టెన్షన్‌ ఇప్పుడు అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంది. 
 

89

ప్రస్తుతం తెలుగులో మహేష్‌బాబుతో కలిసి త్రివిక్రమ్‌ సినిమాలో నటిస్తుంది. ఇది వచ్చే నెల నుంచి రెగ్యూలర్‌ షూటింగ్‌ జరుపుకోబోతుంది. మరోవైపు విజయ్‌ దేవరకొండతో కలిసి `జనగణమన`లో, హిందీలో సల్మాన్‌ ఖాన్‌తో `కభీ ఈద్‌ కభీ దివాళీ` చిత్రంలో నటిస్తుంది. వీటితోపాటు పవన్‌తో ఓ సినిమా చేయనుంది. అలాగే కన్నడలోకి ఎంట్రీ ఇస్తూ యష్‌తో ఓ సినిమా చేయబోతుంది పూజా. 
 

99

ఇదిలా ఉంటే ప్రస్తుతం వెకేషన్‌లో ఎంజాయ్‌ చేస్తుంది పూజా. తన సినిమాల షూటింగ్‌ లకు గ్యాప్‌ దొరకడంతో వెకేషన్‌కి చెక్కేసింది. ఇటీవల బ్యాంకాక్‌లో దిగిన ఫోటోలను పంచుకుని కుర్రాళ్లకి హీటెక్కించింది. గ్లామర్‌ పోతలో రెచ్చిపోతూ సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories