మూడుసార్లు ఇద్దరూ ఢీ అంటే ఢీ..అప్పట్లో ఉదయ్ కిరణ్, ఎన్టీఆర్ గురించి సంచలన పుకార్లు

First Published | Aug 2, 2024, 3:26 PM IST

ఆ దశలో ఉదయ్ కిరణ్ చిత్ర పరిశ్రమలోకి వచ్చాడు. టాలీవుడ్ లో నెక్స్ట్ బిగ్ స్టార్ అన్నట్లుగా ఉదయ్ కిరణ్ హావా కొంతకాలం సాగింది. మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి హీరోలకు సమానంగా ఉదయ్ కిరణ్ క్రేజ్ పెరిగింది. 

ఉదయ్ కిరణ్ పై తెలుగు ప్రేక్షకుల్లో ఎప్పటికి చెరిగిపోని అభిమానం ఉంటుంది. ఉదయ్ కిరణ్ ని ఎప్పుడు తలచుకున్నా అభిమానుల గుండెల్లో తెలియని బాధ మొదలవుతుంది. అద్భుతమైన నటుడిగా, మంచి కుర్రాడిగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. కానీ ఒక్కసారిగా అతడి కెరీర్ పతనం కావడం.. ఫలితంగా ఉదయ్ కిరణ్ డిప్రెషన్ లోకి వెళ్ళాడు. దీనితో ఆత్మహత్య చేసుకున్నాడు. 

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి హీరోల తర్వాత యువతరం ఇప్పుడే మొదలవుతోంది. ఆ దశలో ఉదయ్ కిరణ్ చిత్ర పరిశ్రమలోకి వచ్చాడు. టాలీవుడ్ లో నెక్స్ట్ బిగ్ స్టార్ అన్నట్లుగా ఉదయ్ కిరణ్ హావా కొంతకాలం సాగింది. మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి హీరోలకు సమానంగా ఉదయ్ కిరణ్ క్రేజ్ పెరిగింది. 

Latest Videos


యువతలో, అమ్మాయిల్లో ఉదయ్ కిరణ్ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. కానీ ఆ తర్వాత ఉదయ్ కిరణ్ వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటనలు కావచ్చు, ఇతర కారణాలు ఏవైనా కావచ్చు.. అతడి కెరీర్ పతనం అవుతూ వచ్చింది. ఉదయ్ కిరణ్ కి టాలీవుడ్ లో ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి హీరోలతో మంచి సాన్నిహిత్యం ఉండేది. ఎన్టీఆర్ తో అయితే ఉదయ్ కిరణ్ అనేక వేదికలు షేర్ చేసుకున్నాడు. ఇంత మంచి సాన్నిహిత్యం ఉన్నప్పటికీ ఉదయ్ కిరణ్ ఎన్టీఆర్ తో మూడుసార్లు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాడు. 

ఎన్టీఆర్ నటించిన రాఖీ.. ఉదయ్ కిరణ్ అబద్దం చిత్రాలు ఒక రోజు గ్యాప్ లో రిలీజ్ అయ్యాయి. 2006 డిసెంబర్ లో ఈ రెండు చిత్రాలు విడుదలయ్యాయి. 2012లో ఉదయ్ కిరణ్ నువ్వెక్కడుంటే నేనెక్కడుంటా చిత్రం విడుదలైంది. వారం కూడా గ్యాప్ లేకుండా ఎన్టీఆర్ దమ్ము రిలీజ్ అయింది. 

2013లో ఏప్రిల్ లో ఎన్టీఆర్ బాద్షా చిత్రం రిలీజ్ కాగా వారం వ్యవధిలో ఉదయ్ కిరణ్ జైశ్రీరామ్ చిత్రం రిలీజ్ అయింది. ఇదిలా ఉండగా ఉదయ్ కిరణ్, ఎన్టీఆర్ గురించి ఇండస్ట్రీలో ఒక సమయంలో సంచలన పుకార్లు వినిపించాయి. 2008లో ఎన్టీఆర్.. ఉదయ్ కిరణ్ ని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించాడట. ఆ టైంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. చిరంజీవి ఫ్యామిలీ, ఉదయ్ కిరణ్ కి సంబంధించిన విషయాలు కూడా అప్పట్లో హైలైట్ అయ్యాయి. చిరంజీవి పార్టీకి వ్యతిరేకంగా ఉదయ్ కిరణ్ ని తెలుగుదేశంలోకి ఆహ్వానించారనే పుకారు పెద్ద ఎత్తున వినిపించింది. 

NTR

ఎన్టీఆర్, ఉదయ్ కిరణ్ గురించి మరొక రూమర్ కూడా ఉంది. ఉదయ్ కిరణ్ మరణించినప్పుడు చివరి చూపుకి ఎన్టీఆర్ వెళ్ళలేదు. ఆ టైం లో ఎన్టీఆర్ ఇండియాలో లేడు అని కొందరు అంటుంటారు. మరికొందరేమో ఉదయ్ కిరణ్ ని ఆ స్థితిలో చూడడం తారక్ కి ఇష్టం లేదని.. అలా చూస్తే భరించలేనేమో అని ఉదయ్ కిరణ్ కడసారి చూపుకి ఎన్టీఆర్ వెళ్ళలేదని అంటుంటారు. 

click me!