రజినీకాంత్ హీరోగా మొదట చేసింది తెలుగులోనే. చిలకమ్మ చెప్పింది మూవీలో పూర్తి స్థాయి హీరో రోల్ చేశాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. 80ల నాటికి రజినీకాంత్ హీరోగా నిలదొక్కుకున్నాడు. ఇక 90లలో రజినీకాంత్ ఫేమ్ ఇండియా వైడ్ పాకింది. ముత్తు, అరుణాచలం, నరసింహ, భాష చిత్రాలు రజినీకాంత్ స్టార్డం ని ఎక్కడికో తీసుకుపోయాయి.