మా అమ్మ మరణం కొందరికి వినోదం.. జాన్వీ కపూర్ ఎమోషనల్ కామెంట్స్

Published : Sep 03, 2025, 12:19 PM IST

Janhvi Kapoor-Sridevi: బాలీవుడ్ లెజెండరీ నటి శ్రీదేవి అకాల మరణం సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు. తన తల్లి లేని బాధను హీరోయిన్ జాన్వీ కపూర్ ఎన్నోసార్లు పంచుకున్నప్పటికీ, తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి.

PREV
16
శ్రీదేవి మరణంపై జాన్వీ కపూర్ ఎమోషనల్ కామెంట్స్

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అందం, అభినయానికి ప్రతీకగా నిలిచిన నటి శ్రీదేవి. బాలనటిగా వెండితెరపై అడుగుపెట్టిన శ్రీదేవి తన అందం, అభినయంతో అభిమానులను అలరించింది. తెలుగు, తమిళం, హిందీ సహా పలు భాషల్లో అగ్రహీరోలతో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నో హిట్‌ సినిమాలు, అవార్డులు అందుకున్న ఆమె ఆకాల మరణం ఇండస్ట్రీకి ఎంత లోటు. తాజాగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ తన తల్లి, దివంగత నటి శ్రీదేవి మృతిని గుర్తు చేసుకుంటూ చేసిన ఎమోషన్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

26
మా అమ్మ మరణాన్ని సెన్సేషనల్ న్యూస్‌లా

తాజాగా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో తన తల్లి శ్రీదేవి చనిపోయినట్టు తన కుటుంబం ఎదుర్కొన్న బాధలు, అవమానాలను వివరించింది. జాన్వీ మాట్లాడుతూ ‘ఆ సమయంలో మా కుటుంబ సభ్యులను మనుషుల్లా కూడా చూడలేదు. మమ్మల్ని ఏదోలా చూశారు. కొందరు మా మీద బురద జల్లాలని ప్రయత్నించారు. ఎవరూ సానుభూతి చూపలేదు. అమ్మను కోల్పోవడం మాకు వ్యక్తిగత విషాదం, కానీ కొందరికి అది కేవలం గాసిప్.. ఎంటర్‌టైన్‌మెంట్ అయింది. మా అమ్మ మరణాన్ని సెన్సేషనల్ న్యూస్‌లా చూపించడంతో తీవ్రంగా బాధపడ్డాం ” అని ఆవేదన వ్యక్తం చేశారు.

36
నవ్వినా తప్పు.. మౌనంగా ఉన్నా తప్పే

జాన్వీ మీడియా ప్రెజర్ గురించి కూడా చెప్పింది. ‘నేను నవ్వితే తప్పు, సైలెంట్‌గా ఉంటే మౌనంగా ఉందని కామెంట్స్ చేసేవారు. అమ్మ మరణం మాకు భరించలేని బాధ, కానీ కొందరికి అది ఒక వినోదం అయింది. ఆ సమయంలో మానసికంగా ఎంత ఒత్తిడిని ఎదుర్కొన్నానో చెప్పలేను’అని భావోద్వేగానికి లోనైంది.

46
అమ్మే నా బలం

నటి జాన్వీ తన తల్లి శ్రీదేవిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యింది. ‘నా ప్రతి అడుగులో మా అమ్మ నా వెన్నంటి ఉండేది. నేడు నేను నటిగా ఇక్కడ నిలబడనంటే కారణం ఆ అమ్మే. అమ్మ ఇచ్చిన ప్రోత్సాహమే. తల్లిని కోల్పోయిన తర్వాత జీవితం ఖాళీగా అనిపించింది. కానీ అమ్మ నేర్పిన విలువలు, పాఠాలే నాకు ధైర్యం ఇచ్చాయి. ఆమె సంపాదించిన గౌరవాన్ని ఎప్పటికీ కాపాడుకుంటాను.” అని పేర్కొన్నారు.

56
ఆ సమయంలో పెద్ద యుద్ధమే చేశా

శ్రీదేవీ మరణం తరువాత జాన్వీ కపూర్ తన తల్లి నటనా వారసత్వాన్ని కొనసాగిస్తుంది. వాస్తవానికి శ్రీదేవి మరణం తరువాత 2018లోనే జాన్వీ తొలి చిత్రం ‘ధడక్’ రిలీజ్ అయింది. ఆ సమయంలో తల్లి లేకుండా ముందుకు సాగడం తనకు ఎంతో క్లిష్టమైందని, బాధ నుంచి బయటపడేందుకు తాను పెద్ద యుద్ధం చేశానని జాన్వీ గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తాను మానసికంగా కుంగిపోయినా, ప్రమోషన్లకు, మీడియా ఈవెంట్లకు హాజరుకావడంతో తనపై తీవ్రమైన ఒత్తిడి తీసుకవచ్చారని గుర్తు చేసుకున్నారు.

66
జాన్వీ కెరీర్ ఇలా...

జాన్వీ.. తాజాగా ‘పరమ్ సుందరి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో తన నటనతో మెప్పించింది. కానీ, సినిమా అనుకున్నంత హిట్ కాలేదు. ఇక ప్రస్తుతం ఆమె ‘సన్నీ సంస్కారి కీ తులసీ కుమారి’ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ అక్టోబర్ 2 న విడుదల కానుంది. ఇక టాలీవుడ్‌లో రామ్ చరణ్ సరసన ‘పెద్ది’ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రానికి బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానున్నది.

Read more Photos on
click me!

Recommended Stories