దేవదాస్ సినిమాకు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించారు. విడుదలైన తర్వాత ఈ సినిమా అనేక అవార్డులు గెలుచుకుంది. షారుఖ్ ఖాన్ ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకోగా, సంజయ్ లీలా భన్సాలీ ఉత్తమ దర్శకుడి అవార్డు అందుకున్నారు.
ఐశ్వర్య రాయ్ ఉత్తమ నటిగా, మాధురి దీక్షిత్ ఉత్తమ సహాయ నటిగా అవార్డులు అందుకున్నారు.IMDb ప్రకారం, దేవదాస్ 12 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, 5 జాతీయ అవార్డులు గెలుచుకుంది. మొత్తంగా ఈ సినిమా 58 అవార్డులు గెలుచుకుని అరుదైన ఘనత సాధించింది.
ఆ కాలంలో అత్యంత ఖరీదైన చిత్రాలలో దేవదాస్ ఒకటి. బాలీవుడ్ హంగామా ప్రకారం, ఈ సినిమా భారతదేశంలో ₹ 57.86 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాని మొత్తం వసూళ్లు ₹ 89.46 కోట్లు.