15 సినిమాల్లో నటిస్తే 11 హిట్లు..కాజల్, తమన్నా, సమంత కాదు.. మెగా ఫ్యామిలీ ఆమెని నెత్తిన పెట్టుకోవచ్చు

Published : Feb 14, 2025, 12:43 PM IST

టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోయిన్లు ఉన్నారు. సరైన సక్సెస్ లేకపోయినా గ్లామర్ తో స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతుంటారు. మరికొందరికి మాత్రమే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది.

PREV
15
15 సినిమాల్లో నటిస్తే 11 హిట్లు..కాజల్, తమన్నా, సమంత కాదు.. మెగా ఫ్యామిలీ ఆమెని నెత్తిన పెట్టుకోవచ్చు
Allu Arjun, Pawan Kalyan, Ram Charan

టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోయిన్లు ఉన్నారు. సరైన సక్సెస్ లేకపోయినా గ్లామర్ తో స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతుంటారు. మరికొందరికి మాత్రమే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఆ కోవకి చెందిన హీరోయిన్ శృతి హాసన్. శృతి హాసన్ కి సక్సెస్ ఆలస్యంగా వచ్చింది. కానీ ఒక్కసారి హిట్ పడ్డాక ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. 

25
Mega Family

శృతి హాసన్ తెలుగు తో పాటు ఇతర భాషల్లో బిగినింగ్ లో నటించిన చిత్రాలన్నీ డిజాస్టర్ అయ్యాయి. దీనితో శృతి హాసన్ పై ఐరెన్ లెగ్ అంటూ కామెంట్స్ చేయడం ప్రారంభించారు. శృతి హాసన్ కి తొలి సక్సెస్ దక్కింది గబ్బర్ సింగ్ చిత్రంతోనే. అది కూడా అలాంటి ఇలాంటి హిట్ కాదు. పవన్ కళ్యాణ్ అభిమానుల పదేళ్ల నిరీక్షణకు తెరదించిన చిత్రం గబ్బర్ సింగ్.. బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ చిత్రం హిట్ కావడం శృతి హాసన్ కి ఎంత ముఖ్యమో పవన్ కళ్యాణ్ కి కూడా అంతే కీలకం. పదేళ్లుగా పరాజయాలతో సతమతమవుతున్న పవన్ కి సాలిడ్ హిట్ దక్కింది. 

35
Shruti Haasan

ఈ చిత్రం తర్వాత శృతి హాసన్ పట్టిందల్లా బంగారమే అయింది. తెలుగులో ఆమె 15 చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. కొన్ని ఒకటి రెండు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. హీరోయిన్ గా నటించిన 15 చిత్రాల్లో 11 హిట్లు కొట్టింది శృతి హాసన్. దీనిని బట్టి ఆమె ట్రాక్ రికార్డ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఐరన్ లెగ్ అని విమర్శించిన వారే లక్కీ హీరోయిన్ అని ప్రశంసలు కురిపించారు. 

45
Shruti Haasan

మెగా ఫ్యామిలీకి శృతి హాసన్ నిజంగానే లక్కీ హీరోయిన్ అని చెప్పొచ్చు. మెగా ఫ్యామిలిలో శృతి హాసన్ పవన్ కళ్యాణ్, చిరంజీవి, అల్లు అర్జున్, రాంచరణ్ లతో నటించింది. వీరందరితో ఆమె సూపర్ హిట్ చిత్రాల్లో నటించడం విశేషం. పవన్ తో గబ్బర్ సింగ్, వకీల్ సాబ్.. రాంచరణ్ తో ఎవడు, అల్లు అర్జున్ తో రేసుగుర్రం, చిరంజీవితో వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. 

55
Shruti Haasan

అదే విధంగా శృతి హాసన్ రవితేజతో నటించిన బలుపు, క్రాక్ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ప్రభాస్ తో నటించిన సలార్, బాలయ్యతో నటించిన వీర సింహా రెడ్డి చిత్రాలు కూడా హిట్ అయ్యాయి. మహేష్ బాబుతో నటించిన శ్రీమంతుడు చిత్రం అయితే తిరుగులేని హిట్ గా నిలిచింది. 

Read more Photos on
click me!

Recommended Stories