అయితే ఇంతలో గుడి టైం అయిపోవడంతో పూజారి తలుపులు వేసుకొని వెళ్లిపోతారు. ఆర్య వెళ్లేటప్పటికీ తలుపులు వేసి ఉండటంతో మళ్ళీ వెనక్కి వస్తాడు. వచ్చేసారా అంటుంది అను. అసలు నేను వెళ్తే కదా.. టైం అయిపోయినట్లుగా ఉంది ఈ గుడి తలుపులు వేసేసారు మనం ఈ రాత్రికి ఇక్కడే ఉండాలేమో అంటాడు ఆర్య. పర్వాలేదు సార్ గుడిలో నిద్ర చేస్తే చాలా మంచిదంట ఎప్పటినుంచో అనుకుంటున్నాను ఇప్పటికీ కుదిరింది అంటుంది అను. భార్యని తన ఒడిలో తలపెట్టుకొని పడుకో మంటాడు ఆర్య.