మందారంలా విరబూసిన చిరునవ్వుతో కీర్తి సురేష్..చిలిపి హావభావాలు చూస్తే ఎంతటివారైనా ఫిదానే  

Published : May 19, 2023, 06:14 AM IST

కీర్తి సురేష్ కి సౌత్ లో ప్రత్యేకమైన స్థానం ఉంది. హోమ్లీ బ్యూటీ ఇమేజ్ తో పాటు, గ్లామర్ ఇమేజ్ కూడా కీర్తి సురేష్ సొంతం. చూడచక్కని రూపంతో పాటు నటన పరంగా కూడా కీర్తి సురేష్ తనకు తిరుగులేదని నిరూపించుకుంది.

PREV
16
మందారంలా విరబూసిన చిరునవ్వుతో కీర్తి సురేష్..చిలిపి హావభావాలు చూస్తే ఎంతటివారైనా ఫిదానే  

కీర్తి సురేష్ కి సౌత్ లో ప్రత్యేకమైన స్థానం ఉంది. హోమ్లీ బ్యూటీ ఇమేజ్ తో పాటు, గ్లామర్ ఇమేజ్ కూడా కీర్తి సురేష్ సొంతం. చూడచక్కని రూపంతో పాటు నటన పరంగా కూడా కీర్తి సురేష్ తనకు తిరుగులేదని నిరూపించుకుంది. మహానటి ఒక్క చిత్రం చాలు కీర్తి సురేష్ నటన గురించి చెప్పడానికి. హోమ్లీగా ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పిస్తూనే,అవసరమైనప్పుడు గ్లామర్ ఒలకబోస్తూ కవ్విస్తోంది. 

26

 నేను శైలజ చిత్రంతో కీర్తి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో అందరి దృష్టి కీర్తి సురేష్ పై పడింది. కీర్తి సురేష్ సినిమాల్లో గ్లామర్ రోల్స్ చేస్తుంది. కానీ ఎప్పుడూ హద్దులు దాటేలా అందాలు ఆరబోయలేదు. నటనతోనే పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. సౌత్ టాప్ హీరోయిన్ల సరసన చేరింది. 

36

కీర్తి సురేష్ లేటెస్ట్ ఫోటోలు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్నాయి. సింపుల్ గా ఉంటూనే చిరునవ్వులు, క్యూట్ లుక్స్ తో కీర్తి సురేష్ యువతని మాయ చేస్తోంది. మందారంలా విరబూసిన నవ్వులతో కీర్తి లుక్స్ బ్యూటిఫుల్ గా ఉన్నాయి. 

46

కీర్తి సురేష్ నేచురల్ స్టార్ నాని సరసన దసరా చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. చాలా రోజుల తర్వాత నానికి దసరా చిత్రంతో బాక్సాఫీస్ హిట్ దక్కింది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ వెన్నెల పాత్రలో అద్భుతంగా నటించింది. 

56

తెలంగాణ యాసలో డైలాగులు చెబుతూ కీర్తి బాగా ఆకట్టుకుంది. తెలంగాణ యువతిగా కీర్తి కాస్త డీ గ్లామర్ గా కనిపిస్తూ చేసిన పాత్రకు ప్రశంసలు దక్కాయి. 

66

అలాగే కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవి బోళా శంకర్ చిత్రంలో కీలక పాత్రకు ఎంపికైంది. ఈ చిత్రాల్లో ఆమె చిరంజీవి సోదరిగానటిస్తోంది. కీర్తి సురేష్ కి భోళా శంకర్ చిత్రం ఒక కొత్త అనుభూతి. 

click me!

Recommended Stories