విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా కలిసి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ `రణబాలి`. మ్యారేజ్ తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తున్న మూవీ ఇదే కావడం విశేషం. దీనితో సినిమాపై భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ వచ్చింది.
రౌడీ బాయ్ విజయ్ దేరవకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కలిసి `రణబాలి` చిత్రంలో నటిస్తున్నారు. `డియర్ కామ్రేడ్` తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తున్న చిత్రమిది. అదే సమయంలో మ్యారేజ్ తర్వాత నటిస్తోన్న మొదటి మూవీ కావడం విశేషం. రాహుల్ సంక్రిత్యన్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. స్వాతంత్య్రం రావడానికి ముందు జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా చేసుకొని ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ సెప్టెంబర్ 5న విడుదల కావాల్సి ఉంది. కానీ వాయిదా పడింది.
24
రణబాలి కొత్త రిలీజ్ డేట్
`రణబాలి` మూవీ కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటించింది టీమ్. దసరా పండగ సందర్భంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అక్టోబర్ 16న విడుదల చేస్తున్నట్టు తాజాగా వెల్లడించారు. దసరా పండక్కి వరుసగా సెలవులు ఉంటాయి. అవి ఈ మూవీకి కలిసొచ్చే అవకాశం ఉంది. సినిమా బాగుంటే మాత్రం విజయ్ దేవరకొండకి అసలైన పండగ రాబోతుందని చెప్పొచ్చు. మరి మూవీ ఎలా ఉంటుందో చూడాలి. అయితే తాజాగా కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తూ కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. ఇందులో పద్ద కొడవలి పట్టుకొని రణబాలిగా విజయ్ దేవరకొండ లుక్ అదిరిపోయింది.
34
యదార్థా చారిత్రక సంఘటనలతో రణబాలి
19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. 1878లో జరిగిన కథని ఇందులో చూపించబోతున్నారు. ఆ సమయంలో బ్రిటీష్ వారు మన భారతీయులను ఎంతగా చిత్ర హింసలు పెట్టారు, కనీసం ఫుడ్ కూడా లేకుండా ఎలా దోచుకున్నారనేది ఇందులో చూపించారు. స్వాతంత్ర్య ఉద్యమానికి ముందు జరిగిన చీకటి రహస్యాలను, చరిత్రలోని లేని రహస్యాలను ఇందులో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు దర్శకుడు రాహుల్.
ఆ టైమ్‌లో మన ఇండియా నుంచి బ్రిటీష్ వారు ఏకంగా 45 ట్రిలియన్ డాలర్లు దోచుకుపోయారట. హిట్లర్ కంటే దారుణమైన నియంతృత్వం చోటు చేసుకుందట. కేవలం 40ఏళ్ల వ్యవధిలోనే వందల మిలియన్స్ ప్రజలు ఆకలితో చనిపోయారట. దీనిపై రణబాలి చేసిన తిరుగుబాటనే సినిమా అని సమాచారం. ఇందులో రణబాలిగా విజయ్, జయమ్మగా రష్మిక మందన్నా కనిపించనున్నారు. ఆ మధ్య విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ లో గుర్రంపై స్వారీ చేస్తూ ఓ బ్రిటీష్ అధికారిని లాక్కుంటూ రైలు పట్టాలపై నుంచి విజయ్ ఎంట్రీ ఇచ్చిన తీరు మాత్రం మైండ్ బ్లోయింగ్. కోపంతో, ఆవేశంతో అరుస్తూ ఆయన కనిపించడం అదిరిపోయింది.