Irumudi Controversy: వివాదంలో రవితేజ 'ఇరుముడి' సినిమా.. టీచర్ల నుంచి తీవ్ర అభ్యంతరం, ఎందుకంటే?

Published : Aug 27, 2026, 11:22 AM IST

Irumudi Controversy: రవితేజ నటించిన 'ఇరుముడి' సినిమా మంచి విజయం సాధించినా, ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది. ఈ చిత్రంపై ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సమాఖ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వివాదంపై చిత్ర దర్శకుడు శివ నిర్వాణ ఏమన్నాడంటే?

PREV
15
వివాదంలో ఇరుముడి సినిమా

టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ నటించిన 'ఇరుముడి' సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఆ సీన్లను తొలగించాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. అసలు ఈ వివాదం ఏంటో చూద్దాం.

25
ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అభ్యంతరం
ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (APTF) ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేస్తోంది. 'ఇరుముడి' సినిమాలో టీచర్లను, ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థను అవమానించారని APTF రాష్ట్ర అధ్యక్షురాలు మంజుల ఆరోపించారు. సిలేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసే ఒక మహిళా టీచర్ పాత్రను సినిమాలో తప్పుగా చూపించారని ఆమె అన్నారు.
35
ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతాయని..
'ఇరుముడి' సినిమాలో సిలేరులోని నిజమైన పాఠశాల పేరును చూపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ధరించే యూనిఫామ్‌నే వాడారు. టీచర్లు తమ విధులను సరిగ్గా నిర్వర్తించరన్నట్లుగా చిత్రీకరించారు. ఇలాంటి సన్నివేశాలు మా విద్యావ్యవస్థపై ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతాయని APTF అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
45
టీచర్ పాత్రను క్రూరంగా చూపించారు..
'ఇరుముడి' సినిమాలో టీచర్ పాత్రను క్రూరంగా చూపించారు. పిల్లలను కొట్టడం, సాయంత్రం వరకు క్లాస్‌రూమ్ బయట నిలబెట్టడం వంటి సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి. పిల్లలు చదవకపోతే టీచర్లు శిక్షిస్తారు కానీ, ఇంత క్రూరంగా శిక్షించరని APTF రాష్ట్ర అధ్యక్షురాలు మంజుల అంటున్నారు.
55
స్పందించిన దర్శకుడు శివ నిర్వాణ
టీచర్ల అభ్యంతరాలపై 'ఇరుముడి' సినిమా దర్శకుడు శివ నిర్వాణ స్పందించారు. తాను కూడా ఎమ్మెస్సీ, బీఈడీ చేసి టీచర్‌గా పనిచేశానని చెప్పారు. మంచి సినిమాలు తీయాలనే ఉద్దేశంతోనే ఇండస్ట్రీకి వచ్చానన్నారు. సినిమాలో ఒక టీచర్ మాత్రమే తప్పు చేసినట్లు చూపించామని, మిగతా టీచర్లను మంచివాళ్లుగానే చూపించామని స్పష్టం చేశారు. సినిమాలో స్కూల్ పేరు వాడామే తప్ప, అక్కడ షూటింగ్ చేయలేదని, దీనిపై ఎక్కువ మాట్లాడదల్చుకోలేదని ఆయన అన్నారు.
Read more Photos on
click me!

Recommended Stories