తన ఎదురుగా ఉన్న జగతి ఇచ్చిన బొకేని పక్కన పడేయమని ఏంజెల్ కి చెప్తాడు రిషి. ఇంత అందమైన బొకేని పక్కన పడేయటం ఏమిటి దీంతో సెల్ఫీ తీసుకుందాం అంటుంది. ఇష్టం లేకపోయినా ఏంజెల్ వాళ్లతో సెల్ఫీ దిగుతారు వసుధార, రిషి. మరోవైపు రిషి బ్రతికున్నాడన్న నిజాన్ని శైలేంద్ర చెప్పడంతో షాక్ అవుతుంది దేవయాని. చనిపోయాడు అన్నావు మళ్లీ ఎలా బ్రతికి వచ్చాడు అంటుంది. ఆ రౌడీ వెధవలు చెప్పింది విని చనిపోయాడు అనుకున్నాను.