ఆ టైమ్ లో పెద్ద యుద్దమే చేశాను.. తల్లి మరణంపై జాన్వీకపూర్ ఎమోషనల్ కామెంట్స్

Published : Jul 14, 2023, 09:11 PM IST

తన జీవితంలో.. అత్యంత బాధాకరమైన రోజులను గుర్తు చేసుకుని.. ఎమోషనల్ అయ్యింది.. బాలీవుడ్ యంగ్ స్టార్ బ్యూటీ జాన్వీ కపూర్. తను కోలుకోవడం కోసం చాలా కాలం పట్టిందన్నారు.   

PREV
16
ఆ టైమ్ లో పెద్ద యుద్దమే చేశాను.. తల్లి మరణంపై  జాన్వీకపూర్ ఎమోషనల్  కామెంట్స్
Janhvi kapoor

జాన్వీ కపూర్ చాలా ఎమోషనల్ అయ్యింది. తన తల్లిని గుర్తు చేసుకుని బాధపడింది. తన కెరీర్ ను చూడకుండానే తన తల్లి కన్నుమూయడం.. ఎప్పుడూ.. తనకు లోటుగానే భావిస్తానంది జాన్వీ. అతిలోక సుంద‌రి, దివంగ‌త న‌టి శ్రీదేవి  కూతురు గా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీక‌పూర్ త‌ల్లి వార‌స‌త్వాన్ని నిలబెడుతోంది. 

26

 ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టడమే.. . ధ‌డ‌క్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్... మ‌రాఠీలో సూపర్ హిట్ అయిన సైరాట్ రీమేక్ సినిమాతో  సినిమాకు రీమేక్‌గా ఇది రూపొందింది. ఫస్ట్ మూవీ ప్లాప్ అయినా కాని.. వరుస అవకాశాలు ఆమెను చేరాయి. అయితే కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ..ప్రయోగాలు చేస్తోంది జాన్వీ కపూర్. తాజాగా సౌత్ ఎంట్రీకి కూడా రెడీ అయ్యింది బ్యూటీ. 

36

తాజాగా బాలీవుడ్ లో  ఆమె న‌టిస్తున్న సినిమా బవాల్‌. వరుణ్‌ ధావన్ హీరోగా నితీశ్‌ తివారీ ద‌ర్శ‌క‌త్వంలో  ఈ సినిమా తెర‌కెక్కుతోంది. అమెజాన్‌ ప్రైమ్‌లో జూలై 21న ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ మూవీ రిలీజ్ దగ్గరలో ఉండటంతో.. ప్రమోషన్లలో జోరు పెంచింది మూవీ టీమ్.

46

ఈ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో జాన్వీక‌పూర్ తన పర్సనల్ విషయాలు కూడా పంచుకుంది. మరీ ముఖ్యంగా త‌న త‌ల్లి శ్రీదేవి మ‌ర‌ణం గురించి ఎమోషనల్ గా  మాట్లాడింది జాన్వీ కపూర్. తాను  తన త‌ల్లి మ‌ర‌ణాన్ని జీర్ణించుకోలేక‌పోయాన‌ని చెప్పుకొచ్చింది జాన్వీ. ఆబాధ నుంచి కోలుకోవడానికి తాను  పెద్ద యుద్ధ‌మే చేయాల్సి వ‌చ్చింద‌న్నారు.
 

56
Photo Courtesy: Instagram

ధ‌డ‌క్ సినిమా చేస్తున్న టైమ్ లో..  తన తల్లి శ్రీదేవిని కోల్పోయింది జాన్వీ కపూర్. ఆ స‌మ‌యంలో నేను ధ‌డ‌క్ సినిమా షూటింగ్‌లో ఉన్నాను. ఆమె లేని లోటు ఎవ్వ‌రు తీర్చ‌లేనిది. ఆ నాటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన‌డం క‌ష్టంగా ఉండేది. ఆ స‌మ‌యం ఎలా గ‌డిచింది అన్న‌ది అస్ప‌ష్టంగా ఉంది. నాకు స‌రిగా గుర్తులేదు అన్నారు. 

66

అంతే కాదు.. . ఏమైన‌ప్ప‌టికీ ఆ నెల మొత్తం నాకు ఏమీ అర్థం కాలేదు. చాలా కాలం పాటు అలాగే ఉంది. ఏదో ఒక ప‌ని చేస్తూ జీవితంలో ముందు సాగ‌డం క‌ష్టంగా అనిపించింది. ఆ బాధ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు పెద్ద యుద్ద‌మే చేశా.’అని జాన్వీక‌పూర్ తెలిపింది. ఇక శ్రీదేవి త‌న‌ను ల‌డ్డూ అని పిలిచేద‌ని జాన్వీ చెప్పింది. 2018 ఫిబ్ర‌వ‌రిలో దుబాయ్‌లో శ్రీదేవి మ‌ర‌ణించారు.

Read more Photos on
click me!

Recommended Stories