ఎపిసోడ్ ప్రారంభంలో శైలేంద్ర రిషి ఎంగేజ్మెంట్ ఫోటోలు పంపించి బ్యానర్స్ కట్టించమని అటెండర్ కి చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఆ మాటలు విని, అక్కడ ఉన్న రిషి ఎంగేజ్మెంట్ ఆల్బమ్ చూసి కంగారు పడుతుంది జగతి ఏదో ప్లాన్ చేయబోతున్నాడు అని అర్థం చేసుకుంటుంది. కంగారు పడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సీన్ కట్చేస్తే వసుధార పాండ్యన్ వాళ్ళని పిలిచి మిషన్ ఎడ్యుకేషన్ విషయంలో నేను ఒక్కదాన్నే హ్యాండిల్ చేయలేకపోతున్నాను.